• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

బుధిలాపురంలో కొండచిలువ కలకలం.!

BHNG: మోత్కూరు మండలంలోని బుజిలాపురం గ్రామ సమీప ప్రధాన రహదారిపై శుక్రవారం ఉదయం భారీ కొండచిలువ ప్రత్యక్షమై కలకలం రేపింది. సుమారు 20 కిలోల బరువున్న ఈ భారీ సర్పం రోడ్డుపై వెళ్తుండగా వాహనదారులు, స్థానికులు గమనించి భయాందోళనకు గురయ్యారు. ఈ సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

February 27, 2026 / 09:29 AM IST

జూలకల్లులో ఘనంగా శివ రథోత్సవం

GDWL:  అలంపూర్ నియోజకవర్గం వడ్డేపల్లి మండలం జూలకల్లు గ్రామ సమీపంలోని శివాలయంలో రథోత్సవం ఘనంగా జరిగింది. తెలంగాణతో పాటు ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉత్సవంలో నంది కోళ్ల సేవ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి భక్తులను ఆకట్టుకుంది. గుంత రంగయ్య శెట్టి, రఘు యాదవ్, రాజశేఖర్ తదితరులు పాల్గొని స్వామివారికి సేవలు అందించారు.

February 27, 2026 / 09:29 AM IST

పాలమూరు యూనివర్సిటీ.. ఫలితాలువిడుదల

MBNR: పాలమూరు యూనివర్సిటీలో 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ VII-సెమిస్టర్ రెగ్యులర్,బ్యాక్ లాగ్ ఫలితాలను వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్ బాబు విడుదల చేశారు. ఈ పరీక్షల్లో మొత్తం 69.39% ఉత్తీర్ణత నమోదైంది. కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ అధికారి ప్రవీణ,చంద్ర కిరణ్ పాల్గొన్నారు. విద్యార్థులు తమ ఫలితాలను వెబ్ సైట్ లో చూసుకోవాలని తెలిపారు.

February 27, 2026 / 09:27 AM IST

జిల్లాలో ఇద్దరు దొంగల అరెస్టు

MDK: తూప్రాన్ పట్టణంలోని సయ్యద్ సాదిక్ కు చెందిన కారు మెకానిక్ గ్యారేజ్ నుంచి చోరీలకు పాల్పడిన ఇరువురిని అరెస్టు చేసినట్లు తూప్రాన్ ఎస్ఐ గంగరాజు తెలిపారు. దుబ్బాకకు చెందిన తూర్పాటి సంజయ్ (25), పర్వతం రాజయ్య (27) గురువారం తెల్లవారుజామున విలువైన కేబుల్స్ చోరీ చేసినట్లు తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు ఎస్సై వివరించారు.

February 27, 2026 / 09:26 AM IST

జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిని కలిసిన ఎమ్మెల్యే

WGL: జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిను నిన్న సాయంత్రం హైదరాబాద్‌లోని మంత్రి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. ఈ సందర్భంగా జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రస్తుత సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులపై ఎమ్మెల్యే మంత్రికి వివరించినట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్ పాల్గొన్నారు.

February 27, 2026 / 09:20 AM IST

సిద్దిపేటలో మార్చి 1న ప్రవేశ పరీక్ష

SDPT: టీజీ ఎస్సీ స్టడీ సర్కిల్లో వివిధ పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సిద్దిపేట జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి హమీద్ తెలిపారు. అభ్యర్థులు హల్ టికెట్స్‌ని tsstudycircle.co.in నుంచి డౌన్‌లోడ్ చేయాలని తెలిపారు. మార్చి 1న స్థానిక ప్రతిభ డిగ్రీ కళాశాలలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 వరకు పరీక్ష ఉంటుందన్నారు.

February 27, 2026 / 09:19 AM IST

2.5 కిలోల గంజాయి స్వాధీనం

SRD: తెల్లాపూర్ అంబేడ్కర్ కాలనీ హనుమాన్ దేవాలయం వద్ద కారులో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మహ్మద్ ఖాన్ (33), మహ్మద్ ఓవైజ్ (23)ల నుంచి 2.5 కిలోల గంజాయితో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులను కోర్టులో హాజరుపరిచారు. నిరంతరం నిఘా కొనసాగిస్తామని అధికారులు వెల్లడించారు.

February 27, 2026 / 09:18 AM IST

అంతర్‌రాష్ట్ర గంజాయి ముఠాకు చెక్

హైదరాబాద్ సిటీ పోలీస్ టాస్క్ ఫోర్స్, అఫ్జగంజ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో అంతర్‌రాష్ట్ర గంజాయి ముఠా పట్టుబడింది. ఈ ఆపరేషన్‌లో ఏడుగురు రవాణాదారులు, ఒక స్థానిక విక్రేతను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 16 లక్షల విలువైన 23 కేజీల గంజాయి, ఒక బైక్, 6 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

February 27, 2026 / 09:16 AM IST

దాదాపూర్‌లో వీర జవాన్ విగ్రహావిష్కరణ

VKB: దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ స్వర్గీయ తోకని శ్రీనివాస్ విగ్రహావిష్కరణ మహోత్సవం రేపు దాదాపూర్‌లో జరగనుంది. మాతృభూమి సేవలో అమరుడైన ఈ వీరుడికి సముచిత గౌరవం కల్పిస్తూ గ్రామస్థులు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. దేశం కోసం సర్వస్వం ధారపోసిన జవాన్ త్యాగాన్ని స్మరించుకుంటూ ఆయనకు ఘన నివాళి అర్పించడం మనందరి బాధ్యత అని గుర్తు చేశారు.

February 27, 2026 / 09:15 AM IST

నేడు నల్గొండకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రాక

NLG: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇవాళ నల్గొండకు రానున్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఈరోజు ఉదయం 10 గంటలకు నిర్వహించే పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ మహా అభియాన్‌లో పాల్గొని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి వివరించారు. సకాలంనకు కార్యకర్తలు హాజరుకావాలని ఆయన కోరారు.

February 27, 2026 / 09:14 AM IST

రంజాన్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని వినతి

PDPL: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని కబ్రస్తాన్, ఈద్గాహ్ స్థలంలో రంజాన్ మాసం సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ అరుణ శ్రీని కలిసి గురువారం కలిసి వినతి పత్రం ఇచ్చినట్లు ముస్లిం మైనారిటీ కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రార్థనలు చేసుకునేందుకు సదుపాయాలు, శుభ్రత, నిర్వహణలో అధికారులు సహకారం అందించాలన్నారు.

February 27, 2026 / 09:14 AM IST

నిట్ వసంతోత్సవం.. సౌత్ ఇండియాలో అతిపెద్ద వేడుక!

HNK: ఆర్ఈసీ ప్రస్తుత నిట్ కళాశాలలో 1978లో వసంతోత్సవం (స్ప్రింగ్ స్ప్రీ) వేడుకల ప్రస్థానం మొదలైంది. 47 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఉత్సవం దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద సాంస్కృతిక వేడుకల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. దేశ వ్యాప్తంగా వివిధ ప్రఖ్యాత కళాశాలల నుంచి విద్యార్థులు ఇందులో పాల్గొని తమ ప్రతిభను చాటుకుంటారు.

February 27, 2026 / 09:12 AM IST

పామాపురంలో 33/11 KV సబ్‌స్టేషన్ ప్రారంభం

WNP: కొత్తకోట మండలంలోని పామాపురంలో 33/11 KV నూతన విద్యుత్ సబ్స్టేషన్‌ను ఎమ్మెల్యే జీ. మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు.     సబ్‌స్టేషన్ ప్రారంభం తర్వాత గ్రామం మరియు పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలు తొలగి, రైతులకు నాణ్యమైన కరెంటు అందుతుందని తెలిపారు. మార్కెట్ యార్డ్ ఛైర్మన్ పల్లె పాగ ప్రశాంత్, విద్యుత్ శాఖ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

February 27, 2026 / 09:07 AM IST

నగరంలో ఎయిర్ క్వాలిటీ ఎంతంటే..?

HYD: నగరంలో గాలి నాణ్యతలో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. సాధరణంగా పొగమంచు, చెత్తాచెదారం తగలబెట్టడం, వాహనాల పొగతో కాలుష్యం పెరుగుతుంటోంది. డబుల్ డిజిట్‌లో ఉండే ఎయిర్ క్వాలిటీ శుక్రవారం వట్టినాగులపల్లిలో 234గా రికార్డ్ అయింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు.

February 27, 2026 / 09:05 AM IST

సత్తుపల్లి సైబర్ కేసులో మరో ఆరుగురు నిందితుల అరెస్ట్

KMM: సత్తుపల్లి సైబర్ నేరం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. బాధితుడి ఫిర్యాదుతో నమోదైన ఈ కేసులో గతంలోనే 14 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా, తాజాగా పరారీలో ఉన్న మరో ఆరుగురు నిందితులను ప్రత్యేక బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. అంతర్జాతీయ ముఠాలతో సంబంధాలు కలిగి, అమాయకుల ఖాతాల ద్వారా భారీగా నిధులు మళ్లించిన ఈ ముఠాపై దర్యాప్తు కొనసాగుతుంది.

February 27, 2026 / 09:04 AM IST