• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఆపద సమయంలో అండగా నిలిచిన సభ్యులు

SDPT: చేర్యాల పట్టణానికి చెందిన చుంచు వివేక్ అనారోగ్యంతో చికిత్స పొందుతుండగా, అతని పేదరికాన్ని గమనించి ‘చేర్యాల అంబేద్కర్ నగర్’ సభ్యులు అండగా నిలిచారు. దాతల నుంచి సేకరించిన రూ.24,000 నగదును శుక్రవారం వివేక్ కుటుంబానికి అందజేశారు. ఆపద కాలంలో స్పందించి ఆర్థికంగా సహకరించిన ప్రతి దాతకు ఈ సందర్భంగా వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

February 27, 2026 / 01:23 PM IST

బ్రహ్మోత్సవాలలో గుండు పందెం పోటీలు

RR: కేశంపేట మండలం బైర్ ఖాన్ పల్లి గ్రామంలో ఘనంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గుండు పందెం పోటీలను ఏర్పాటు చేశారు. పోటీలలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడంతో ఆధ్యాత్మికతతో పాటు సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని పోటీలను ప్రారంభించారు.

February 27, 2026 / 01:22 PM IST

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసిన ఛైర్మన్

MLG: బండారుపల్లి 12వ వార్డులో ఇందిరమ్మ ఇంటికి నిర్మాణానికి ములుగు గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ బానోతు రవిచందర్ భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ… ప్రజా ప్రభుత్వంలో పేద ప్రజల సొంత ఇంటి కళ నెరవేరుతుందని, ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనుల్లో ప్రభుత్వం నియమ నిబంధనలను పాటిస్తూ పనులను సకాలంలో పూర్తి చేసుకోవాలన్నారు.

February 27, 2026 / 01:20 PM IST

దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని వినతి

NGKL: కుమ్మెర జాతరలో రజక కుటుంబంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు శుక్రవారం కలెక్టరేట్లో వినతిపత్రం ఇచ్చారు. ఘటన జరిగి ఐదు రోజులు గడుస్తున్నా బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని నాయకులు నరసింహ, స్వరూప మండిపడ్డారు. బాధితులకు వెంటనే న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

February 27, 2026 / 01:20 PM IST

కలెక్టరేట్ ముట్టడించిన కాడ్లాపూర్ రైతులు

VKB: తమ పట్టా భూములను ప్రభుత్వం అక్రమంగా స్వాధీనం చేసుకుందంటూ పరిగి మండలం కాడ్లాపూర్ గ్రామానికి చెందిన రైతులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. భూమి కోల్పోవడంతో తాము రోడ్డున పడ్డామని, న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

February 27, 2026 / 01:19 PM IST

కుట్రలు నేడు పటాపంచలయ్యాయి

RR: ఢిల్లీ లిక్కర్ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు రౌస్ అవెన్యూ కోర్టులో భారీ ఊరట లభించడం సత్యం గెలిచిందనడానికి నిదర్శనమని తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు పాండురంగారెడ్డి అన్నారు. SDNRలో వారు మాట్లాడుతూ.. తప్పుడు అభియోగాలన్నింటినీ న్యాయస్థానం కొట్టివేసి క్లీన్ చీట్ ఇచ్చిందన్నారు. కవితపై జరిగిన కుట్రలు నేడు పటాపంచలయ్యాయని పేర్కొన్నారు.

February 27, 2026 / 01:17 PM IST

మల్కాపూర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రం తనిఖీ

BHNG: ఎం తుర్కపల్లి మండలంలోని మల్కాపూర్ గ్రామంలో శుక్రవారం సర్పంచ్ సొన్నాయిల రఘు అంగన్వాడీ కేంద్రంలో అకస్మాత్తుగా తనిఖీ చేశారు. మెనూ ప్రకారం పాలు, గుడ్లు, మురుకులు, పెడుతున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోషక పదార్థాలను పిల్లలకు టైం ప్రకారం పెట్టాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాలయ్య , వార్డు వార్డు మెంబర్లు, పాల్గొన్నారు.

February 27, 2026 / 01:17 PM IST

‘రోడ్డు మరమ్మతులు చేపట్టాలి’

VKB: నవాబ్‌పేట్ మండలం ఏక్మామిడి గ్రామ సమీపంలో రోడ్డు నిర్మాణం మధ్యలోనే నిలిపివేశారు. కంకర తేలిపోయి వాహనదారులకు ప్రయాణం నరకంగా మారింది. ‘అర్ధాంతరంగా వదిలేసిన రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలి. ప్రయాణ సౌకర్యం కల్పించాలని అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించాలని కోరుతున్నాం’ అని వాహనదారులు వ్యాఖ్యానించారు.

February 27, 2026 / 01:17 PM IST

స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలు: DYSO పవన్ కుమార్

NZB: రాష్ట్రంలోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్, హన్మకొండ క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల ప్రక్రియ గురువారం నుంచి మొదలైంది అన్ని DYSO పవన్ కుమార్ తెలిపారు. 3వ తరగతి పూర్తి చేస్తున్న విద్యార్థులు అర్హులన్నారు. మార్చి 13 నుంచి 17 వరకు మండల, మార్చి 28 నుంచి ఏప్రిల్ 1 వరకు జిల్లా, ఏప్రిల్ 27 నుంచి మే 1 వరకు రాష్ట్ర స్థాయి ఎంపికలు ఉంటాయి అన్ని అన్నారు.

February 27, 2026 / 01:15 PM IST

చిరు వ్యాపారుల దుకాణాలు కూల్చడం అక్రమం: కంచర్ల

నల్లగొండ ప్రకాశం బజార్‌లో చిరువ్యాపారుల తొలగింపును మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ముందస్తు నోటీసులు లేకుండా షాపులు కూల్చడం దుర్మార్గమని, అధికారుల తోపులాటలో గాయపడ్డ పండ్ల వ్యాపారి అమీర్‌ను ఆయన శుక్రవారం పరామర్శించారు. ప్రభుత్వం చిరువ్యాపారులకు నష్టపరిహారం చెల్లించి, శాశ్వత ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.

February 27, 2026 / 01:15 PM IST

రూల్స్ జానతా నై.. ‘సిండికేట్’గా నొక్కేశారు..!

HYD: హైదరాబాద్ మహానగర జలమండలి అంతర్గత ఆడిట్ విభాగం రూ. 450 కోట్ల వ్యయంలో జరిగిన తేడాలను గుర్తించింది. ముఖ్యంగా మీటర్ల కొనుగోలులో టెండర్ నిబంధనలను ఒక నిర్దిష్ట కంపెనీకి అనుకూలంగా మార్చినట్లు (Tailor Made Conditions) తేలింది. నిబంధనల ప్రకారం కనీసం మూడు కంపెనీలు పోటీ పడాలి, కానీ ఇక్కడ ‘సిండికేట్’ గా ఏర్పడి రూల్స్‌ను గాలికొదిలేశారు.

February 27, 2026 / 01:12 PM IST

‘మొబైల్ ఫోన్ పట్ల అశ్రద్ధ వహిస్తే భద్రతకు భంగం’

NRML: పోయిన లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్ల పట్ల అశ్రద్ధ వహిస్తే వ్యక్తిగత, సామాజిక భద్రతకు భంగం కలుగుతుందని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. మొబైల్ ఫోన్లను త్వరగా ట్రేస్ చేసి స్వాధీనం చేసుకోవడానికి CEIR వెబ్‌సైట్ ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. శుక్రవారం వారు ఎస్పీ కార్యాలయంలో బాధితులకు వాళ్ల పోగొట్టుకున్న ఫోన్లను అందజేశారు.

February 27, 2026 / 01:10 PM IST

పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన ఏఎస్పీ

SRCL: చందుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని శుక్రవారం అదనపు ఎస్పీ చంద్రయ్య సందర్శించారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రంలో వసతులను పరిశీలించారు. విద్యార్థులకు డెస్కులు, మంచినీటి, ఫ్యాన్లు అన్ని వసతులు ఉన్నాయని చీఫ్ సూపరింటెండెంట్ మోహన్ కుమార్ అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సీఐ వెంకటేశ్వర్లు ఉన్నారు.

February 27, 2026 / 01:10 PM IST

ఖమ్మం రైల్వే స్టేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి

KMM: ఖమ్మం రైల్వే స్టేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫాంపై ఆకస్మికంగా మృతి చెందినట్లు సమాచారం. మృతుడి వ్యక్తిగత సమాచారాలు అందలేదని, గుర్తు తెలియని కారణంగా రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతుడి వివరాలు తెలిస్తే రైల్వే జీఆర్పీ అధికారులను సంప్రదించాలని సూచించారు.

February 27, 2026 / 01:08 PM IST

నేడు నర్సంపేటలో ‘డయల్ యువర్ డీఎం’

WGL: ప్రయాణికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నర్సంపేట ఆర్టీసీ డిపోలో నేడు ‘డయల్ యువర్ డీఎం’ కార్య క్రమం నిర్వహించనున్నారు. శుక్రవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ప్రయాణికులు తమ ఫిర్యాదులు, సలహాలను తెలియజేయాలని డిపో మేనేజర్ ప్రసన్నలక్ష్మి తెలిపారు. 7382926166, 9989038476కు ఫోన్ చేసి బస్సుల రాకపోకలు, సౌకర్యాలపై మాట్లాడాలని ఆమె కోరారు.

February 27, 2026 / 01:08 PM IST