• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఘనంగా ‘లైన్ మెన్ దివాస్’.. సిబ్బందికి సన్మానం

KMM: కామేపల్లి మండలం కొత్తలింగాల విద్యుత్ సబ్ స్టేషన్లో ఏఈ ఎన్.శ్రీనివాసులు ఆధ్వర్యంలో బుధవారం ‘లైన్ మెన్ దివాస్’ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే వో అండ్ ఎం సిబ్బందిని ఏఈ శాలువాతో సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. విద్యుత్ వినియోగదారులకు వారు అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా ప్రశంసించారు.

March 5, 2026 / 08:47 AM IST

మన్యంకొండలో వైభవంగా అమ్మవారి ‘అశ్వవాహన’ సేవ

MBNR: మన్యంకొండ క్షేత్రంలో శ్రీ అలివేలు మంగతాయారు అమ్మవారి బ్రహ్మోత్సవాలు వేడుకగా సాగుతున్నాయి. బుధవారం రాత్రి అమ్మవారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. విద్యుద్దీప కాంతులు, మంగళవాయిద్యాలు, వేదఘోషల మధ్య ఈ సేవ వైభవంగా జరిగింది. గ్రామీణ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

March 5, 2026 / 08:46 AM IST

గురుకుల సిబ్బందిపై వేటు.. నలుగురిపై చర్యలు

MHBD: మరిపెడ ట్రైబల్ వెల్ఫేర్ గురుకులంలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన నలుగురు సిబ్బందిపై అధికారులు వేటు వేశారు. ఇటీవల సీనియర్ విద్యార్థులు జూనియర్లపై దాడి చేసిన ఘటనపై విచారణ చేపట్టిన ఆర్సీఓ రత్నకుమారి.. ముగ్గురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు (వీరన్న, రాజేందర్, ఉపేందర్) లను విధుల నుంచి తొలగించారు. పర్మినెంట్ ఉద్యోగి లక్ష్మణు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

March 5, 2026 / 08:46 AM IST

‘అధికారులు బాధ్యతయుతంగా విధులు నిర్వర్తించాలి’

PDPL: వార్డు అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి ఆదేశించారు. రామగుండం కార్పొరేషన్‌లో బుధవారం వార్డు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలకు అధికారులు వారధిగా పని చేయాలన్నారు. శానిటేషన్ నిర్వహణ, ప్రజల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. 100% ఆస్తి పన్నువసూలు చేయాలని ఆదేశించారు.

March 5, 2026 / 08:43 AM IST

కేయూ పరిధిలో పీజీ తొలి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం

WGL: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో పీజీ కోర్సుల తొలి సెమిస్టర్ పరీక్షలు ఇవాళ్టీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర కోర్సుల పరీక్షలు ఈ నెల 5, 7, 10, 12, 16, 18 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. 4,149 మంది విద్యార్థుల కోసం 23 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసారు.

March 5, 2026 / 08:42 AM IST

జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి: కలెక్టర్

NZB: జీవితంలో అనేక సమస్యలు వస్తుంటాయని, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని విద్యార్థులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఆత్మహత్య ఆలోచనలు ధరి చేరకుండా, ఏకాగ్రతతో చదువుపై దృష్టి కేంద్రీకరించాలని హితవు పలికారు. క్రమశిక్షణతో ముందుకెళ్తే మంచి భవిష్యత్తు సొంతం అవుతుందన్నారు. తప్పుడు నిర్ణయాలతో నిండు జీవితాన్ని బలవంతంగా అంతం చేసుకోవద్దన్నారు.

March 5, 2026 / 08:42 AM IST

ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవ వేడుకలు

JGL: రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామంలో బుధవారం శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామం నుంచి కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి రథోత్సవంలో పాల్గొని స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. రథాన్ని ఆలయం చుట్టూ ఐదు సార్లు తిప్పారు. సర్పంచ్ శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

March 5, 2026 / 08:38 AM IST

పిచ్చిమొక్కల తొలగింపుపై ప్రత్యేక దృష్టి

BDK: భద్రాద్రి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్‌లో గురువారం కార్పొరేటర్ కంచర్ల హిమశ్రీ పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. వార్డు అధికారి మధుసూదన్ రెడ్డితో కలిసి కాలనీల్లో తిరుగుతూ డ్రైనేజీ పూడికతీత, పిచ్చిమొక్కల తొలగింపు పనుల పురోగతిని చూశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

March 5, 2026 / 08:36 AM IST

చెరువుల మరమ్మతు చేస్తే సాగునీటికి ఎంతో మేలు

VKB: యాలాల మండలంలో చెరువుల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ఆశించిన స్థాయిలో రైతులకు సాగునీరు అందడం లేదు. మండల పరిధిలోని హుస్సేన్ సాహెబ్, అగ్గనూరు రెడ్డి చెరువు, జుంటుపల్లి ఉద్దండ రావు చెరువు, పెర్కంపల్లి సదర్ చెరువుల్లో మరమ్మతులు చేస్తే రైతులకు ఎంతగానో మేలు జరుగుతుందని పేర్కొంటున్నారు. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

March 5, 2026 / 08:32 AM IST

సింగారం చెరువు వద్ద కుళ్లిన మృతదేహం కలకలం..!

HNK: ఐనవోలు మండలం సింగారం చెరువు వద్ద బుధవారం స్థానికులు కుళ్లిపోయిన డెడ్ బాడీని గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చినా స్పందించడంలేదని, మృతదేహాన్ని కుక్కలు పీక్కు తింటున్నాయంటూ స్థానికులు పేర్కొంటున్నారు. తల, మొండెం వేరుగా ఉండడంతో బలి ఇచ్చారా? ఏంటి అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 5, 2026 / 08:31 AM IST

తాను మరణించి ఆరుగురికి ప్రాణం పోశారు!

SRD: తాను మరణించిన ఆరుగురికి రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అంబాదాస్ ప్రాణం పోశారు. అమీన్పూర్ బృందావన్ టీచర్స్ కాలనీలో ఉంటున్న అంబాదాస్(63) అధిక రక్తపోటుతో బాధ పడేవారు. ఫిబ్రవరి 28న ఒక్కసారిగా కుప్పకూలగా నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. మార్చి 3న బ్రెయిన్ డెడ్ కావడంతో ఆర్గాన్స్ను డొనేట్ చేసేందుకు ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకున్నారు.

March 5, 2026 / 08:28 AM IST

నేడు గుర్జాల్‌లో కుస్తీ పోటీలు

KMR: గాంధారి మండలం గుర్జాల్‌లో హోలీ పండుగ సందర్భంగా గురువారం మధ్యాహ్నం 3:30 నుంచి కుస్తీ పోటీలు నిర్వహించనున్నట్లు సర్పంచ్ గంగారాం తెలిపారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణను పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ పోటీలను విజయవంతం చేయాలని, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సూచించారు.

March 5, 2026 / 08:28 AM IST

‘జీపీ కార్మికులకు జీతాలు సమయానికి ఇవ్వాలి’

GDWL: గ్రామపంచాయతీ కార్మికులకు ప్రతినెల ఐదవ తేదీలోగా జీతాలు చెల్లించాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి జమ్మిచేడు కార్తీక్ కోరారు. జీపీ కార్మికులతో కలిసి డీపీవో శ్రీకాంత్‌కు వినతిపత్రం అందజేశారు. జిల్లాలో 1100 మంది కార్మికులకు జీఓ 60 ప్రకారం నెలకు రూ.19 వేల వేతనం ఇవ్వాలని, అవసరమైన సామగ్రి అందించాలని కోరారు.

March 5, 2026 / 08:27 AM IST

తాగునీటి శాశ్వత పరిష్కారానికి చర్యలు

WNP: తాగునీటి శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పేర్కొన్నారు. వనపర్తి పట్టణంలోని రాజనగరం శివారిలో గురువారం అమృత్ పథకంలో భాగంగా జల బాండాగారాల నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించి మాట్లాడారు. రూ.71.71 కోట్లతో నాగవరంలో 5 లక్షలు, రాజనగరంలో 6 లక్షల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకులను నిర్మించనున్నట్లు ఆయన వివరించారు.

March 5, 2026 / 08:25 AM IST

పరీక్షా కేంద్రాల్లో అదనపు కలెక్టర్ తనిఖీలు

BHPL: చిట్యాల మోడల్ స్కూల్ ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని అదనపు కలెక్టర్ విజయ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు జరుగుతున్న తీరును గదుల వారీగా తిరుగుతూ స్వయంగా పర్యవేక్షించారు. విద్యార్థులకు కల్పించిన మౌలిక వసతులపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆమె, తాగునీరు, విద్యుత్ సౌకర్యాల్లో లోటుపాట్లు ఉండకూడదని అధికారులను ఆదేశించారు.

March 5, 2026 / 08:24 AM IST