BDK: టేకులపల్లి మండల కేంద్రంలో TSTTF ఉపాధ్యాయ సంఘం ముఖ్య నాయకులు శుక్రవారం సమావేశమయ్యారు. రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి ఆకునూరి మురళి ఛైర్మన్ విద్యా కమిషన్ నివేదించిన రిపోర్టును పరిశీలిస్తే ఉద్యోగ ఉపాధ్యాయులను అవమానించినట్టుగా ఉందని మండిపడ్డారు. వాస్తవాలు తెలుసుకోకుండా నివేదిక ఇవ్వడం సరికాదన్నారు.
నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో శుక్రవారం ఇంటర్మీడియట్ మూల్యాంకన కేంద్రాన్ని జిల్లా మాధ్యమిక విద్యాశాఖ అధికారి పరుశురామ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మూల్యాంకనాన్ని అధ్యాపకులు పకడ్బందీగా నిర్వహించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో సీసీవో సుదర్శన్, ఏసీవో తుకారం, అధ్యాపకులు విజయలక్ష్మి, నవీన్ కుమార్, గౌతమ్‌లు పాల్గొన్నారు.
MBNR: దేవరకద్ర మున్సిపల్ కేంద్రంలోని జామా మజీద్‌లో మైనారిటీ నాయకులు షీరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయని, నెల రోజులపాటు కఠిన నియమాలతో అల్లాను ప్రార్థించే ముస్లింల భక్తి విశేషమని పేర్కొన్నారు.
NLG: డిండి మండలంలోని ఎర్రగుంటపల్లి, వావిల్ కోల్, రామంతాపూర్, కందుకూరు, సింగరాజు పల్లి, శకృ తండా, తవక్లాపూర్ గ్రామాల్లో ఎమ్మెల్యే బాలు నాయక్ రేపు ఉదయం 9 గంటల నుంచి పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు చెరుకుపల్లిలో అడపాల పర్వత్ రెడ్డి ద్వాదశదిన కర్మలో పాల్గొననున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.
BDK: దమ్మపేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే జారి ఆదినారాయణ శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. ముందుగా ఆర్లపెంట గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్వహించారు. స్వయం సహాయక సంఘం మహిళా కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాలు గడపగడపకు చేరుతున్నట్లు ఆయన వెల్లడించారు.
జగిత్యాలలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పురాతన ఉన్నత పాఠశాలలో మట్టి కుండలు, గణేష్ విగ్రహాల తయారీపై వర్క్షాప్ నిర్వహించారు. మట్టి పాత్రలు ఆరోగ్యానికి, పర్యావరణానికి మేలు చేస్తాయని జిల్లా విద్యాధికారి కే. రాము తెలిపారు. లింగంపేటకు చెందిన కుమ్మరి మహిపాల్ విద్యార్థులకు సారెతో కుండల తయారీ ప్రదర్శించారు.
HYD: బీసీలలో ఐక్యత పెంపొందించి సమాజాన్ని ముందుకు నడిపించాలని బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద నిరాహార దీక్ష జరిగింది. బడ్జెట్లో బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ, చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని వక్తలు కోరారు. పలువురు ప్రజా ప్రతినిధులు మద్దతు తెలిపారు.
KMM: సత్తుపల్లి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలకు సకాలంలో అందడమే లక్ష్యంగా ఎమ్మెల్యే మట్టా రాగమయి శుక్రవారం అధికారులతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. పెండింగ్లో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని అన్నారు.
HNK: సీఎం రేవంత్ రెడ్డిని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కలిశారు. వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కళాశాల, MGM దవాఖానాల అభివృద్ధి కోసం ఆర్థిక సహాయం ప్రకటించిన ఎన్‌ఆర్‌ఐ వైద్యుడు డాక్టర్ సుజిత్ రెడ్డిని సీఎం అభినందించారు. వరంగల్ ప్రాంతంలో వైద్య సేవల స్థాయిని మరింత పెంచే దిశగా ప్రభుత్వం కూడా అవసరమైన సహకారం అందిస్తుందని సీఎం అన్నారు.
WGL: గంగదేవిపల్లి, సింగ్యతండా గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లును పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. అర్హులైన పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లును మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని, పేద ప్రజల సొంత ఇంటి కళ ప్రజా ప్రభుత్వంలోనే నెరవేరుతోందని, ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని ఎమ్మెల్యే కోరారు.
WGL: గంగదేవిపల్లి, సింగ్యతండా గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లును పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. అర్హులైన పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లును మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని, పేద ప్రజల సొంత ఇంటి కళ ప్రజా ప్రభుత్వంలోనే నెరవేరుతోందని, ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని ఎమ్మెల్యే కోరారు.
పెద్దపల్లి పట్టణంలోని కూనారం ఆర్ఓబి అప్రోచ్ రోడ్డు పనులు వేగిరం చేయాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. ఇవాళ ఆయన ఆర్‌వోపీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నెల రోజులలోపు అండర్ పాస్ పనులు పూర్తి చేయాలని తెలిపారు. ఆర్వోబీ పూర్తయ్యలోపు అప్రోచ్ రోడ్డు పనులు పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని రైల్వే మరియు ఆర్& బీ అధికారులను ఆదేశించారు.
NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీలోని 6, 11, 13, 20వ వార్డులలో మున్సిపల్ ఛైర్మన్ భర్త ఆనంద్ కుమార్ వైస్ ఛైర్మన్ శానవాజ్ ఖాన్‌తో కలిసి శుక్రవారం పర్యటించారు. అనంతరం వార్డులలో నెలకొన్న సమస్యలను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వారి ఎదుర్కొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు.
MNCL: శ్రీరాంపూర్ ఏరియా జీఎం కార్యాలయంలో శుక్రవారం సింగరేణి యాజమాన్యం, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులకు మధ్య స్ట్రక్చర్ సమావేశం జరిగింది. జీఎం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కార్మికులు ఎదుర్కొంటున్న 10 ప్రధాన సమస్యలపై చర్చించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జీఎం తెలిపారు. సమావేశంలో నాయకులు కిషన్ రావు, తదితరులు పాల్గొన్నారు.