• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

వైస్ ఛైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన.. కాంగ్రెస్ నేతలు

MHBD: కేసముద్రం మున్సిపాలిటీ నూతన వైస్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైన అల్లం రమ-నాగేశ్వరరావును ఆదివారం ఉదయం 6వ వార్డు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన వైస్ ఛైర్మన్‌ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కళ్ళెం శ్రీనివాస్ రెడ్డి, 6వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కుమారస్వామి ఉన్నారు.

February 22, 2026 / 11:25 AM IST

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి MLA భూమి పూజ

ASF: కాగజ్ నగర్ పట్టణంలోని బాలాజీనగర్ 11వ వార్డులో ఆదివారం మన్నె యాదగిరికి మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి MLA హరీష్ బాబు భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా MLA మాట్లాడుతూ.. నిర్ణిత గడువులోగా ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని తెలిపారు. అర్హులైన ప్రతిఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తామని పేర్కొన్నారు.

February 22, 2026 / 11:22 AM IST

దేవాలయానికి రూ. 1,30,000 మహా విరాళం

RR: లక్ష్మీ దేవునిపల్లి గ్రామంలో జరుగుతున్న గణపతి, అభయ ఆంజనేయ, శివాలయ, ధ్వజస్తంభ, నాభి శిల బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి షాద్‌నగర్ మూడవ వార్డు కౌన్సిలర్ అశోక్ రూ.1,30,000 విరాళంగా అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ఆలయ నిర్మాణం, ప్రతిష్ట మహోత్సవ ఏర్పాట్లు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఈ విరాళం ఎంతో తోడ్పాటుగా నిలుస్తుందని తెలిపారు.

February 22, 2026 / 11:21 AM IST

NAC ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ

NZB: NAC ఆధ్వర్యంలో నిరుద్యోగ మైనార్టీ యువత కోసం ల్యాండ్ సర్వేలో 3 నెలల ఉచిత శిక్షణ ఇస్తామని జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ లింబాద్రి తెలిపారు. ఈ శిక్షణ ఈ నెల 27 నుంచి ప్రారంభమవుతుందన్నారు. 18-35 సంవత్సరాలలోపు ఉండాలన్నారు. ఇంటర్మీడియట్, లేదా ITI సివిల్ చదివినవారు అర్హులన్నారు. వీరికి స్టేషనరీ, యూనిఫామ్ ఉచితం అని, గ్యారెంటీ ప్లేస్‌మెంట్ కల్పిస్తామని పేర్కొన్నారు.

February 22, 2026 / 11:20 AM IST

ఏప్రిల్ 10 నుంచి SA-II పరీక్షలు

MDK: ఉమ్మడి మెదక్ జిల్లాలోని పాఠశాలల్లో 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 10 నుంచి 20 వరకు సమ్మేటివ్-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉమ్మడి మెదక్ జిల్లా విద్యాధికారులు తెలిపారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసినట్లు వెల్లడించారు. విద్యార్థులు సమగ్రంగా సన్నద్ధం కావాలన్నారు.

February 22, 2026 / 11:19 AM IST

కుక్కల బెడద నుంచి కాపాడాలి’

VKB: పట్టణంలోని 26వ వార్డు ఇస్తా ఖాన్‌భాగ్ కాలనీలో కుక్కలు గుంపులుగా స్వైర విహారం చేస్తున్నాయి. ఎక్కడపడితే అక్కడ ప్రజలను కరిచి గాయాలపాలు చేస్తున్నాయి. కుక్కల బెడదతో బయటికి రావాలంటే భయాందోళనకు గురవుతున్నామని కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుక్కలను నిర్మూలించి రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.

February 22, 2026 / 11:17 AM IST

గంగమ్మ ఆలయ ప్రతిష్టలో పాల్గొన్న మంత్రి

JGL: ధర్మపురి పట్టణంలోని గోదావరి నది ఒడ్డున నూతనంగా నిర్మించిన గంగమ్మ తల్లి ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి బోరుబావి, ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు సమకూర్చుతానని ఆయన హామీ ఇచ్చారు.

February 22, 2026 / 11:15 AM IST

లింగేశ్వర స్వామి ఆలయంలో మున్సిపల్ నూతన ఛైర్మన్

KNR: ఆబాది జమ్మికుంట శ్రీ మహాదేవ లింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో మున్సిపల్ నూతన ఛైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు కౌన్సిలర్లు, ఆలయ అర్చకులు ఘనంగా సన్మానం చేశారు. ఆలయ పరిసరాల సమస్యలపై కమిటీ సభ్యులు వినతిపెట్టగా, పరిష్కరిస్తామని ఛైర్మన్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు.

February 22, 2026 / 11:15 AM IST

గచ్చిబౌలిలో సైక్లింగ్ ఈవెంట్

HYD: సైక్లింగ్ ఈవెంట్ విజయవంతంగా ముగిసింది. ఆదివారం ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 400 మంది సైక్లిస్టులు పాల్గొన్నారు. రాయదుర్గం ట్రాఫిక్ పోలీసులు మార్గమంతా పర్యవేక్షిస్తూ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఫిట్ నెస్, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ఈ ఈవెంట్ సాఫీగా పూర్తయింది.

February 22, 2026 / 11:14 AM IST

​మండేపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరం

SRCL: తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామ సర్పంచ్ గాధగోని సాగర్ ఆధ్వర్యంలో ఆదివారం రెడ్డి సంఘం భవనంలో కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో అన్ని రకాల కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు సర్పంచ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

February 22, 2026 / 11:14 AM IST

జిల్లాలోని 248 GPలకు నిధులు మంజూరు

BHPL: భూపాలపల్లి జిల్లాలోని 248 గ్రామాలకు ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. గ్రామపంచాయతీ ఎన్నికల అనంతరం తొలిసారిగా రూ.4.65 కోట్లు విడుదల చేసినట్లు DPO శ్రీలత ఇవాళ తెలిపారు. 2011 జనాభా ఆధారంగా ఒక్కో వ్యక్తికి రూ.865 చొప్పున లెక్కించి నేరుగా పంచాయతీ ఖాతాల్లోకి జమ చేశామని DPO వెల్లడించారు.

February 22, 2026 / 11:12 AM IST

టోల్ ప్లాజా వద్ద పోలీసుల తనిఖీలు

KMR: బిక్కనూరు మండల పరిధిలోగల టోల్ ప్లాజా వద్ద ఆదివారం పోలీసులు ముమ్మరంగా వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఎస్సై ఆంజనేయులు ఆధ్వర్యంలో పలు వాహనాలను ఆపి తనిఖీలు చేశారు. వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని సూచించారు. రోడ్డు నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

February 22, 2026 / 11:12 AM IST

రైస్ మిల్‌ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే

NLG: మిర్యాలగూడ మండలం ఆలగడపలో నూతనంగా ఏర్పాటు చేసిన RSN రైస్ మిల్‌ను మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఇవాళ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ ఆధారంగా ఉన్న మన ప్రాంతంలో రైస్ మిల్లుల స్థాపన రైతులకు ఎంతో ఉపయోగకరమన్నారు. మిల్ యాజమాన్యాన్ని అభినందిస్తూ, వ్యాపారం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.

February 22, 2026 / 11:11 AM IST

బరంపూర్ గుట్ట బ్రహ్మోత్సవాలకు వెళ్లొద్దామా..!

ఆదిలాబాద్: తలమడుగు మండలం బరంపూర్ గ్రామం సమీపంలో చుట్టూ అందమైన కొండల మధ్యలో గుట్టపై వెలసిన పురాతన వేంకటేశ్వర స్వామి ఆలయం ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తోంది. ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడంతో ఈ ఆలయానికి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్ర నుంచి సైతం భక్తులు తరలివస్తున్నారు. కాగా, నేడు లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల చివరి రోజు.

February 22, 2026 / 11:10 AM IST

ఆధ్యాత్మికతతో ముందుకు పయనించాలి: MLA

ADB: గ్రామస్తులు కలిసికట్టుగా ఉండి ఆధ్యాత్మికతతో ముందుకు పయనించాలని అభివృద్ధి సాధించాలని MLA అనిల్ జాదవ్ అన్నారు. ఆదివారం బోథ్ మండలంలోని కౌట గ్రామంలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు డప్పుల చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, బీఆర్ఎస్ నాయకులు తదితరులున్నారు.

February 22, 2026 / 11:09 AM IST