BHNG: తుర్కపల్లి మండలం తిరుమలాపురం గ్రామానికి చెందిన సీనియర్ రిపోర్టర్ అరె నరసింహాలు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వెంటనే స్పందించి, బాధితుడిని పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితుని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
PDPL: ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా సింగరేణి ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లాలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్జీ-3 జీఎం డి. లలిత్ కుమార్ మాట్లాడుతూ.. పిచ్చుకల సంఖ్య తగ్గిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణ సమతుల్యతకు పిచ్చుకలు ముఖ్యమని, వాటి సంరక్షణకు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
BHPL: మహదేవపూర్ సిద్దేశ్వరాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ జడ్పీటీసీ అరుణ శ్రీనివాస్ మాట్లాడుతూ.. దేవుళ్ళ అనుగ్రహంతో మహదేవపూర్ గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, గ్రామ ప్రజలు పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలన్నారు.
SRCL: యాసంగి సీజన్‌లో జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగర్వాల్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో యాసంగి సీజన్ కొనుగోళ్లపై అధికారులు, రైస్ మిల్లర్లు, ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్లతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. సుమారు జిల్లాలో 2,70,000 నుంచి 3 లక్షల మెట్రిక్ ధాన్యం ఈనెల కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
SRCL: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో పట్టణ మున్సిపాలిటీకి రావాల్సిన ఆస్తిపన్ను బకాయిలను వంద శాతం వసూలు చేయాలని వేములవాడ మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ సంపత్ ఆధ్వర్యంలో ఛైర్మన్ మాట్లాడుతూ.. నెలాఖరు వరకు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి కృషి చేయాలన్నారు.
SRPT: పిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని మునగాల మండల ఎస్సై ప్రవీణ్ కుమార్ తల్లిదండ్రులను కోరారు. శుక్రవారం పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు ముగిసిపోయాయని, పాఠశాలలకు ఒంటిపుటబడులు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు కాలవలు, చెరువులు, బావులకు వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉందన్నారు.
ADB: రైతులు దళారులను నమ్మకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద తమ శనగ పంటను అమ్ముకోవాలని ఆత్మ కమిటీ ఛైర్మన్ గిమ్మ సంతోష్ రావు అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో శనగ కొనుగోళ్లను ఆయన ప్రారంభించారు. రైతులు తమ పంటను ఆరబెట్టి, తేమ శాతం లేకుండా తీసుకువచ్చి ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర పొందాలని సూచించారు.
WNP: రేవల్లి, ఏదుల మండలాలలో నూతనంగా నిర్మించిన భవనాలలోకి తహసీల్దార్ కార్యాలయాలను తరలించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ఆయా మండలాలలో ప్రారంభత్సవాలకు సిద్ధంగా ఉన్న భవనాలను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. భవనాల నిర్మాణ నాణ్యత, సౌకర్యాలు ఆయన పరిశీలించారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని త్వరలో ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.
MDK: తూప్రాన్ మండలం ఘనపూర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న కమ్యూనిటీ సోప్ ఫిట్ నిర్మాణ పనులను జిల్లా పరిషత్ సీఈవో ఎల్లయ్య పరిశీలించారు. ఎంపీడీవో సతీష్, సర్పంచ్ వెంకటేష్‌లతో కలిసి పాఠశాలను సందర్శించారు. కమ్యూనిటీ సోప్ ఫిట్ పనులను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శి సంగమేశ్వర్, వార్డు సభ్యులు ఉన్నారు.
HYD: మే 4వ తేదీ నుంచి హజ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో రాష్ట్ర హజ్ కమిటీ ఛైర్మన్ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మే 4 నుంచి మే 21 వరకు యాత్ర కొనసాగనుంది. రాష్ట్రం నుంచి మొత్తం 11,757 మంది దరఖాస్తు చేసుకోగా, ప్రస్తుతానికి 9,500 మందికి అనుమతి లభించినట్లు అధికారులు వెల్లడించారు.
WGL: 2022-23 బ్యాచ్‌కు చెందిన శరదృతి, ముత్తినేని అంకిత 2025 నీట్‌లో ఉత్తమ ర్యాంకులు సాధించి ఎంబీబీఎస్ సీట్లు పొందారు. శరదృతి కాకతీయ మెడికల్ కాలేజీ, అంకిత ఆదిలాబాద్ రిమ్స్‌లో ప్రవేశం పొందారు. ఈ మేరకు ఇవాళ పాఠశాల డైరెక్టర్ జావేద్ విద్యార్థులను సన్మానించి అభినందించారు. విద్యార్థులు పట్టుదలతో, క్రమశిక్షణతో విద్యలో రాణించినట్లు ఉపాధ్యాయులు తెలిపారు.
MHBD: తొర్రూరు మండలంలోని పలు గ్రామాల్లో పేరుకు మాత్రమే కిరాణా దుకాణాలు నిర్వహిస్తూ.. లోపల మాత్రం దర్జాగా మద్యం వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి దాకా షాపులు తెరిచి ఉండడంతో మద్యం తాగి యువకులు, పెద్దలు గొడవలకు దిగుతున్నారు. దీనిని అరికట్టాల్సిన సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
NLG: కేతపల్లి మండలం కొండకింది గూడెం గ్రామంలో జేసీబీలతో అక్రమంగా మట్టి తవ్వి టిప్పర్ల ద్వారా నకిరేకల్ ప్రాంతానికి తరలిస్తూ దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ కొనసాగుతోంది. దీనిని అడ్డుకున్న స్థానికులపై దాడులకు దిగుతున్నారని ఆరోపిస్తున్నారు. రెవెన్యూ, పోలీసుశాఖ అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
KMM: సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు మార్చి 23 దేశవ్యాప్తంగా జాతీయోద్యమ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమాని విజయవంతం చేయాలని రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల సంయుక్త సమావేశంలో నాయకులు ఇవాళ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వలసవాద ధోరణిని మార్చుకోవాలని అన్నారు. ఈ నెల 23న జరగనున్న కార్యక్రమంలో వ్యవసాయ కార్మికులు భాగస్వామ్యం కావాలని కోరారు.
BHNG: భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చిన్నాన్న సుధాకర్ రెడ్డి అనారోగ్యంతో గురువారం సాయంత్రం మరణించారు. శుక్రవారం వలిగొండ పట్టణంలో ఆయన పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని దుఃఖ సంద్రంలో మునిగారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నరు.