MBNR: సాంప్రదాయబద్ధంగా హోలీ వేడుకలను నిర్వహించుకోవాలని మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్ కార్పొరేటర్ గుండా సంతోష్ అన్నారు.హోలీ పండుగను పురస్కరించుకుని మంగళవారం తెల్లవారుజామున కామ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు చిన్నారులు రసాయనిక రంగులు జల్లుకోకుండా సాంప్రదాయ బద్ధమైన రంగులను చల్లుకోవాలని సూచించారు.
WNP: గోపాల్ పేట మండలంలోని 15 గ్రామ పంచాయతీల వార్డు సభ్యులకు శిక్షణ శిబిరం ప్రారంభమైంది. సోమవారం ఎంపీడీవో ఆయుష్ అంజుమ్ కార్యాలయంలో శిక్షణ ప్రారంభమైంది. వార్డు సభ్యులు తమ వార్డులలో పథకాలు ప్రజలకు ఎలా చేరవేయాలో నేర్చుకుంటున్నారు. ఎంపీడీవో, గ్రామ కార్యదర్శి మరియు వార్డు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
SRD: ఉపాధ్యాయులకు కుల గణన రెమ్యూనరేషన్ వెంటనే చెల్లించాలని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని సంఘ భవనంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు రెమ్యూనరేషన్ చెల్లించకపోవడం సరి కాదన్నారు. అధికారులు స్పందించకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
NZB: ఐటీఐ మైదానంలో మంగళవారం హోలీ వేడుకలు మిన్నంటాయి. వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో వాకర్లందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సంగీతానికి అనుగుణంగా నృత్యాలు చేస్తూ కేరింతలు కొట్టారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
NLG: జిల్లాలో రబీ సీజన్లో సాగు చేసిన పంటలు నీరందక ఎండిపోతున్న తరుణంలో నీటిపారుదల శాఖ అధికారులు సానుకూల నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి డీ-25 కాలువ గేట్లను మూసివేయడంతో, కాలువ కింద ఉన్న పొలాలు బీటలు వారుతున్నాయి. రైతుల విజ్ఞప్తులు, పంటల పరిస్థితిని గమనించిన నీటిపారుదల శాఖ అధికారులు, డీ-25 కాలువ ద్వారా రేపటి నుంచి నీటిని వదలనున్నారు.
VKB: బొంరాస్‌పేట మండలం రేగడిమైలారం కార్యదర్శి నాగరాజు, తుంకిమెట్ల కార్యదర్శి రాజేష్ బదిలీపై వెళ్లారు. గత నాలుగు సంవత్సరాలుగా గ్రామాలల్లో విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందారు. కార్యదర్శి నాగరాజు సూర్యాపేట జిల్లాకు, కార్యదర్శి రాజేష్ నల్లగొండ జిల్లాకు బదిలీ అయినట్లు అధికారులు వెల్లడించారు. ఆయా గ్రామాల ప్రజలు వారు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
గద్వాల జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన రిజ్వాన్ బాషా షేక్‌కు సోమవారం సీనియర్ సిటిజన్ ఫోరం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. మోహన్ రావు, రామన్ గౌడ్, కలీమ్ తదితరులు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధికి అందరూ సహకరించాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి కలిసి పనిచేయాలని కలెక్టర్ కోరారు.
KMM: ఖమ్మం నగరంలోని శ్రీ భక్తరామదాసు కళాక్షేత్రంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన పరీక్షల సంసిద్ధత కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవితంలో పదవ తరగతి అత్యంత కీలకమని, విద్యార్థులు భయం వీడి ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరుకావాలని సూచించారు.
JGL: బుగ్గారం మండల కేంద్రానికి చెందిన కొడిమ్యాల రాజయ్య తన కొడుకులు పట్టించుకోవడం లేదని జగిత్యాలలో నిర్వహించిన ప్రజావాణిలో సోమవారం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు. తన భార్య 2020లో మృతి చెందిందని, ఆమె మరణించిన తర్వాత 6 నెలలు చూసుకుని తన పెద్ద కుమారుడు ఇంటి నుంచి గెంటేశాడని, చిన్న కొడుకు వద్దకు వెళ్తే కోడలు బూతులు తిడుతుందని తెలిపారు.
KNR: రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి పొన్నం ప్రభాకర్ పండుగ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ పండుగ మన సంస్కృతిలో స్నేహం, సౌహార్దం, ఆనందానికి ప్రతీక అని అన్నారు. రంగులలా మన జీవితాలు ఆ సంతోషాలతో నిండాలని, ప్రతి ఇంట్లో ఐక్యత, శాంతి, సుఖసమృద్ధులు నెలకొనాలని ఆకాంక్షించారు. మన రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న ఈ సందర్భంలో,అందరం కలిసికట్టుగా సామరస్యంతో ఉండాలన్నారు.
SRD: భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆలయాన్ని ద్వారబంధము చేశారు. చంద్రగ్రహణం సందర్భంగా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి గ్రామంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానంలో స్వామివారికి, అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ఆలయాన్ని మూసివేశారు. బుధవారం ఆలయ సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తారు.
NLG: చిట్యాల పట్టణంతో పాటు మండల పరిధిలోని గ్రామాల్లో హోలీ సంబరాలు మిన్నంటాయి. కులమతాలకు అతీతంగా ప్రజలందరూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ముఖ్యంగా చిట్యాల మున్సిపల్ పారిశుధ్య మహిళా సిబ్బంది ఉత్సాహంగా రంగులు పూసుకుంటూ ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి వీధి రంగులమయంగా మారింది..
NZB: డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన ఇద్దరికి ఒక్కొక్కరికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ హైమద్ మొయినుద్దీన్ సోమవారం తీర్పు వెల్లడించారని NZB ట్రాఫిక్ CI పబ్బ ప్రసాద్ తెలిపారు. అలాగే 39 మందికి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.3.90 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.
PDPL: మంథని మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు గంగాపురి గ్రామానికి చెందిన పులి శ్రీపాద శ్రీజ సీఎం కప్ 2026 రాష్ట్రస్థాయి (వెయిట్ లిఫ్టింగ్ ) క్రీడా పోటీలో స్టేట్ ఫస్ట్ (గోల్డ్, సిల్వర్) పతకాలు సాధించింది. ప్రతిభ కనబరిచిన విద్యార్థిని శ్రీపాద శ్రీజను 4వ వార్డ్ కౌన్సిలర్ మద్దికట్ల స్రవంతి అభినందించారు. అనంతరం వారి స్వగృహంలో శాలువాతో సన్మానించారు.
MNCL: వికారాబాద్ జిల్లా అనంతగిరిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డీసీసీ అధ్యక్షుల పది రోజుల శిక్షణా శిబిరం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంచిర్యాల డీసీసీ అధ్యక్షులు పిన్నింటి రఘూనాథ్ కుటుంబ సభ్యులతో కలిసి రాహుల్ గాంధీని కలిశారు. జిల్లాలో పార్టీ బలోపేతంపై చర్చించారు.