• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు: ఎమ్మెల్యే

SRD: వీరారెడ్డిపల్లిలో రూ.25 లక్షల విలువైన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇందులో మొల్లగూడెం పాఠశాల ప్రహరీ గోడకు రూ.10 లక్షలు, రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రూ.15 లక్షలు కేటాయించినట్లు ఆయన తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

February 27, 2026 / 12:31 PM IST

కౌన్సిలర్ సతీమణిని పరామర్శించిన మాజీ ఎంపీ

MHBD: కేసముద్రం మున్సిపాలిటీ 7వ వార్డు కౌన్సిలర్ రావుల వినయ్ సతీమణి రావుల మనీషా అనారోగ్యంతో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. విషయం తెలుసుకున్న మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోత్ కవిత ఇవాళ వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

February 27, 2026 / 12:29 PM IST

చికిత్స పొందుతున్న బాధితుని పరామర్శించిన మంత్రి

NRPT: మక్తల్ పట్టణంలో 16వ వార్డుకు చెందిన వల్లంపల్లి లక్ష్మణ్ తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా శుక్రవారం ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తన కుటుంబాన్ని పరామర్శించారు. బాధితునికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు మంత్రి సూచించారు. ప్రభుత్వం తరుఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

February 27, 2026 / 12:27 PM IST

అచ్చంపేట పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా: ఎమ్మెల్యే

NGKL: అచ్చంపేట పట్టణంలో ఈరోజు ఉదయం స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ పలు ప్రాంతాలను సందర్శించారు. అనంతరం లింగాల చౌరస్తాలో అడ్డా కూలీలతో మాట్లాడుతూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బస్ స్టాండ్ సమీపంలో నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించి. త్వరగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌కు తెలిపారు.

February 27, 2026 / 12:24 PM IST

దేవాలయంలో ఏకాదశి ప్రత్యేక పూజలు

JGL: జగిత్యాల పట్టణంలోని చింతకుంట ప్రాంతంలో ఉన్న శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయంలో ఫాల్గుణ మాస శుక్ల పక్ష శుక్రవారం ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాతలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన నిర్వహించారు. అలాగే భక్తిశ్రద్ధలతో లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేశారు.

February 27, 2026 / 12:22 PM IST

‘వార్డు సభ్యులు కీలకపాత్ర పోషించాలి’

MNCL: గ్రామాల అభివృద్ధి వార్డు సభ్యుల చేతుల్లోనే ఉందని లక్షెట్టిపేట, జన్నారం మండలాల ఎంపీడీవోలు సరోజ, ఉమర్ షరీఫ్ అన్నారు. లక్షెట్టిపేట, జన్నారం మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో వార్డు సభ్యులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం శుక్రవారం కొనసాగింది.. ఈ సందర్భంగా గ్రామస్థాయిలో అభివృద్ధి ప్రణాళికలపై వార్డు సభ్యులకు అధికారులు అవగాహన కల్పించారు.

February 27, 2026 / 12:22 PM IST

విమానాశ్రయానికి అదనపు భూసేకరణ

ADB: జిల్లాలో విమానాశ్రయ నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. సైనిక అవసరాలతో పాటు పౌర విమానయానానికి అనుకూలంగా మార్చడంతో 3KM రన్‌వే కోసం అదనంగా 249.80 ఎకరాల భూసేకరణ అనివార్యమైంది. దీనిపై అధికారులు రైతులతో చర్చలు జరిపి త్వరలోనే ప్రధానమంత్రి చేతులమీదుగా శంకుస్థాపన చేయించాలని ఎంపీ, ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఈ మేరకు పనులు వేగమందుకోవాలని చేయాలని కలెక్టర్‌ను కోరారు.

February 27, 2026 / 12:15 PM IST

అంధకారంలో మహారాజుల కాలనీ

ADB: ఆదిలాబాద్‌లోని రాంపూర్ మహారాజుల కాలనీ విద్యుత్ దీపాలు లేక అంధకారంలో మగ్గుతోంది. రాంపూర్ మున్సిపాలిటీలో విలీనమైనా తమ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రుళ్లు వీధి దీపాలు లేక రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని, విష పురుగుల భయం వెంటాడుతోందని వాపోతున్నారు.

February 27, 2026 / 12:13 PM IST

కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన చిత్రా మిశ్రా

KNR: జిల్లా నూతన కలెక్టర్‌గా చిత్రా మిశ్రా శుక్రవారం కలెక్టరేట్ ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చిత్రా మిశ్రాను కలెక్టర్ ఛాంబర్‌లో కలిసిన అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీవో మహేశ్వర్, ఏవో సుధాకర్ పలువురు జిల్లా అధికారులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు

February 27, 2026 / 12:13 PM IST

‘ఆస్తిపన్ను బకాయిలు చెల్లించండి’

RR: షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో 2025-26 సంవత్సరానికి గాను పురపాలక సంస్థకు చెల్లించాల్సిన ఆస్తి పన్నుతో పాటు నీటి పన్నును చెల్లించాలని పురపాలక శాఖ అధికారులు తెలిపారు. పన్నులు చెల్లించని వారిపై పురపాలక సంస్థ చట్టం-2019 ప్రకారం ఆస్తి జప్తు చేయడం జరుగుతుందన్నారు. నీటి పన్ను బకాయిలు చెల్లించని వారి కలెక్షన్ తొలగించడం జరుగుతుందని పేర్కొన్నారు.

February 27, 2026 / 12:09 PM IST

ప్లాట్లుగా మారుతున్న ప్రభుత్వ స్థలాలు

BDK: చండ్రుగొండ మండలం తుంగారం పంచాయతీలో ప్రభుత్వ స్థలాలను ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారని ఆరోపణలు వెలువడుతున్నాయి. కొంతమంది ప్రభావశీలుల అండతో నిర్మాణాలు కూడా సాగుతున్నట్లు సమాచారం. ఫిర్యాదులపై స్పందన లేకపోవడంతో స్థానికుల్లో అనుమానాలు పెరుగుతున్నాయి. అధికారులు తక్షణమే సర్వే నిర్వహించి భూములను రక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

February 27, 2026 / 12:06 PM IST

జిల్లాలో నేటితో ముగిసిన FLN శాంపుల్ సర్వే

NRML: SCERT తెలంగాణ ఆధ్వర్యంలో జిల్లాలోని 53 పాఠశాలల్లో FLN శాంపుల్ సర్వే శుక్రవారం పూర్తైంది. 2వ తరగతి విద్యార్థులకు మూడు రోజుల పాటు టాంజెరిన్ యాప్ ద్వారా అసెస్మెంట్ నిర్వహించారు. పిల్లల సామర్థ్యాల స్థాయిని అంచనా వేయడమే లక్ష్యమని జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న సందర్భంగా తెలిపారు.

February 27, 2026 / 12:03 PM IST

మేజిక్బస్ ఇండియా ఫౌండేషన్‌తో కేయూ ఒప్పందం

HNK: KU మేజిక్బస్ ఇండియా ఫౌండేషన్‌లో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సంవత్సరం కాలం ఉండే ఈ ఎంఓయూపై రిజిస్ట్రార్ వి.రామచంద్రం, డిప్యూటీ జనరల్ మేనేజర్ శేఖరబాబు సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో ఆర్థికంగా వెనుకబడిన బలహీన వర్గాల యువతకు స్కిల్ డెవలప్‌మెంట్, కెరీర్ మార్గదర్శకం, జాబ్ ఓరియెంటెడ్ శిక్షణ,ప్లేస్‌మెంట్ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.

February 27, 2026 / 12:02 PM IST

వనపర్తిలోని 31వ వార్డులో పారిశుద్ధ్య పనులు

WNP: పరిసరాలు శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం సిద్ధిస్తుందని వనపర్తి 31వ వార్డు కౌన్సిలర్ బండారు విజయలక్ష్మి అన్నారు. శుక్రవారం బసవన్నగడ్డ కాలనీలో మున్సిపల్ కార్మికులతో కలిసి ఆమె పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. మురుగు కాలువలు, రోడ్లపై పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగింపజేశారు. పరిశుభ్రత విషయంలో కాలనీవాసులు సహకరించాలని ఆమె కోరారు.

February 27, 2026 / 12:01 PM IST

మూడో రోజు ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు

MHBD: జిల్లా వ్యాప్తంగా ఇంటర్‌మీడియట్ పరీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడమే కాకుండా, ఎలాంటి అవకతవకలు జరగకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. విద్యార్థులు సమయానికి కేంద్రాలకు చేరుకుని పరీక్షలు రాస్తున్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది.

February 27, 2026 / 12:01 PM IST