• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

అక్రమ గంజాయి పట్టివేత

BDK: భద్రాచలం ఆర్టీఏ చెక్‌పోస్ట్ వద్ద ఎక్సైజ్ అధికారులు వాహన తనిఖీల్లో గంజాయి రవాణాను అడ్డుకున్నారు. సీలేరు–మోతుగూడెం నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకుని, సుమారు 20 కేజీల గంజాయి, కారు, బైక్, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను కోర్టుకు తరలించారు. సీజ్ చేసిన గంజాయి విలువ రూ.11 లక్షలు ఉంటుందన్నారు.

March 1, 2026 / 10:48 AM IST

తవ్వాకాల్లో బయటపడ్డ విగ్రహం

NZB: భీంగల్ మండలం ముచ్కూర్ పెద్దగుట్టపై వందల ఏళ్ల నాటి నర్సింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. దారి మూసుకుపోయిన ఈ ప్రాచీన ఆలయాన్ని తెరిపించేందుకు గ్రామస్తులు, వేద పండితులు తవ్వకాలు చేపట్టారు. ఈ క్రమంలో స్వామివారి తొలి అవతారమైన వరాహ స్వామి విగ్రహం బయటపడింది. దీంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు.

March 1, 2026 / 10:46 AM IST

తైక్వాండో పోటీలు ప్రారంభించిన మేయర్

NZB: జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో తైక్వాండో జిల్లా ఛాంపియన్షిప్ పోటీలు నగరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ ఉమారాణి రమేష్ పాల్గొని ప్రారంభించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ.. కరాటే, తైక్వాండో రెండు కూడా ఆత్మరక్షణ కోసం ఉపయోగపడుతుందని, విద్యార్థి దశ నుండే శిక్షణ తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాజిద్, అజ్మత్ పాల్గొన్నారు.

March 1, 2026 / 10:43 AM IST

ప్లాస్టిక్ కవర్లు స్వాధీనం చేసుకున్న సర్పంచ్

BDK: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ నిషేధానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, బయోడిగ్రేడబుల్ బ్యాగులను వాడాలని సర్పంచ్ గూగులోతు జానకిరామ్ సూచించారు. సుజాతనగర్ మండలం సీతంపేట బంజారా గ్రామ పంచాయతీ పరిధిలో ప్లాస్టిక్ కవర్లను వినియోగించవద్దని కోరారు. ఆదివారం పలు కిరాణా షాపులను తనిఖీ చేసి, ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు.

March 1, 2026 / 10:42 AM IST

ప్రేమను నిరాకరించడంతో బాలిక సూసైడ్!

SDPT: చిన్నకోడూరు మండలం కమ్మర్లపల్లిలో ప్రేమ వ్యవహారం ఓ బాలిక ప్రాణం తీసింది. అదే గ్రామానికి చెందిన యువకుడిని ప్రేమించగా, వరుసకు అన్నాచెల్లెలు కావడంతో పెద్దలు నిరాకరించారు. దీంతో మనస్తాపం చెందిన బాలిక FEB 23న పురుగుల మందు తాగింది. జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది.

March 1, 2026 / 10:38 AM IST

వీటితో గుండె పదిలం.. డాక్టర్ల సూచనలు

HYD: ఆరోగ్యకర జీవనానికి ఫైబర్ అధికంగా ఉండే ఆహారం ఎంతో అవసరం అని రామంతపూర్ డా.అంబికా తెలిపారు. ఫైబర్ రిచ్ ఫుడ్స్ శరీరంలో కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. అరటి, యాపిల్, పియర్, అవకాడో, బ్లాక్ బీన్స్, శనగలు, మినుములు వంటి పదార్థాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఆకుకూరలు, పప్పుధాన్యాలు, విత్తనాలు ఆహారంలో చేర్చితే గుండె ఆరోగ్యం మెరుగవుతుందన్నారు.

March 1, 2026 / 10:38 AM IST

అన్నపురెడ్డిపల్లిలో బ్రహ్మోత్సవాల సందడి

BDK: ఆదివారం అన్నపురెడ్డిపల్లిలో శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు రెండో రోజు కొనసాగాయి. అగ్ని ప్రతిష్ఠ ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహించగా గరుడ సేవకు భక్తులు భారీగా తరలివచ్చారు. గరుడ ప్రసాదం స్వీకరిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందనే విశ్వాసంతో భక్తులు మొక్కులు చెల్లించారు.

March 1, 2026 / 10:34 AM IST

ప్లాస్టిక్ వద్దు.. పర్యావరణం ముద్దు

HYD: ‘ప్లాస్టిక్ వద్దు.. పర్యావరణం ముద్దు’ అనే నినాదంతో ఆదివారం పర్యావరణ వేత్తలు, సామాజిక కార్యకర్తలు పెద్దఎత్తున ముందుకొచ్చారు. ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, కీసర చెరువుల పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను స్వచ్ఛందంగా శుభ్రం చేశారు. రణవీర్ సింగ్, శ్రీకాంత్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వల్ల నీటి వనరులు కలుషితమవుతున్నాయన్నారు.

March 1, 2026 / 10:33 AM IST

సైన్స్ వేడుకల్లో పాల్గొన్న DMHO

WGL: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నర్సంపేట మైనార్టీ బాలికల పాఠశాలలో శనివారం అంతర్జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను (DMHO) డా. సాంబశివరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాస్త్ర విజ్ఞానం మన జీవితంలో కీలకమని అన్నారు. విద్యార్థులు సైన్స్ పరిజ్ఞానం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని విద్యార్థులకు సూచించారు.

March 1, 2026 / 10:32 AM IST

నేడే ఎస్సీ ఎస్టీ సర్కిల్ ప్రవేశ పరీక్షలు

జగిత్యాల ఎస్సీ స్టడీ సర్కిల్లో అందించే 5 నెలల ఉచిత శిక్షణ కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డైరెక్టర్ నరేశ్ తెలిపారు. ఈరోజు ఉదయం 11 నుంచి ఒంటి గంట వరకు జగిత్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ & పీజీ కాలేజీలో ఆఫ్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసిన అభ్యర్థులు హాల్ టికెట్, ఆధార్ కార్డుతో హాజరుకావాలన్నారు.

March 1, 2026 / 10:32 AM IST

యూనివర్సిటీ టాపర్‌గా తల్లాడ విద్యార్థిని

KMM: తల్లాడ మండలం మల్లవరం గ్రామానికి చెందిన షేక్ ఆయేషా విద్యారంగంలో సత్తా చాటారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్ అమితి యూనివర్సిటీ టాపర్‌గా నిలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. శనివారం జరిగిన కాన్వొకేషన్‌లో ఛత్తీస్‌గఢ్ గవర్నర్ రామెన్ దేకా చేతుల మీదుగా ఆమె ఈ గోల్డ్ మెడల్‌ను అందుకున్నారు. గోల్డ్ మెడల్ అందుకున్న ఆమెను పలువురు అభినందిస్తున్నారు.

March 1, 2026 / 10:31 AM IST

జిల్లాలో జాబ్ మేళా

VKB: జిల్లా నిరుద్యోగ యువతకు ‘శుభ గృహ ఇన్ఫ్రాస్ట్రక్చర్’ సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, మేనేజర్ పోస్టుల భర్తీకి మార్చి 5న ఉదయం 10:30 గంటలకు వికారాబాద్ ఐటీఐ క్యాంపస్‌లో జాబ్ మేళా ఉంటుందని జిల్లా ఉపాధి కల్పన అధికారి షేక్ అబ్దుస్ సుభాన్ తెలిపారు. 30కి పైగా ఉన్న ఉద్యోగాలకి 10th, ఇంటర్, డిగ్రీ, ITI, డిప్లొమా, B.Tech, MBA, దీనికి అర్హులన్నారు.

March 1, 2026 / 10:28 AM IST

స్వయం వృత్తితో మహిళల సాధికారత సాధ్యం: సుధాకర్

MDCL: స్వయం వృత్తితోనే మహిళల సాధికారత సాధ్యమని సామాజిక జన చైతన్య శాఖ ప్రెసిడెంట్ సుధాకర్ అన్నారు. మౌలాలిలో నిర్వహించిన ఉమెన్ ఎంపవర్‌మెంట్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబులు కావాలని, స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

March 1, 2026 / 10:28 AM IST

దాడిపై మంత్రి స్పందించాలని డిమాండ్

WNP: కుమ్మెర గ్రామంలో మల్లన్న స్వామి దర్శనానికి వెళ్లిన చాకలి కులస్తులపై జరిగిన దాడి ఘటనపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఇప్పటివరకు స్పందించకపోవడం బాధాకరమని ధర్మ సమాజ్ పార్టీ వనపర్తి జిల్లా ఉపాధ్యక్షుడు అశోక్ శనివారం విమర్శించారు. వెంటనే స్పందించి నిందితులపై రాజ్యాంగబద్ధంగా కఠిన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

March 1, 2026 / 10:27 AM IST

పోలీస్ స్టేషన్‌లో 10వ తరగతి పరీక్ష పత్రాల భద్రత

KNR: హుజురాబాద్ మండలంలోని 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన 4 పరీక్ష కేంద్రాల పరీక్ష పత్రాలను హుజురాబాద్ పోలీస్ స్టేషన్లో భద్రపరిచినట్టు ఎంఈఓ విడపు శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రూట్ ఆఫీసర్ రామయ్య, అసిస్టెంట్ రూట్ ఆఫీసర్ మురళి మనోహర్, పరీక్ష కేంద్రాల సూపరిండెంట్స్ సమ్మిరెడ్డి సత్య ప్రసాద్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు.

March 1, 2026 / 10:27 AM IST