GDWL: జిల్లాలో బాలికలపై అకృత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత రెండు నెలల్లో ఏకంగా 14 పోక్సో కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. తాజాగా పాఠశాల వద్ద బైక్‌పై దింపుతామని నమ్మించి విద్యార్థినిపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. పోలీసులు నిందితులను వెంటనే అరెస్ట్ చేశారు. బాలల భద్రత అందరి బాధ్యతని, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
VKB: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9:40 గంటలకు శంషాబాద్ నుంచి బయలుదేరి 10 గంటలకు జిల్లాకు చేరుకుంటారు. అనంతరం అనంతగిరిలోని హరిత రిసార్ట్స్ నిర్వహించనున్న డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరంలో సాయంత్రం 4:20 వరకు పాల్గొంటారు. ఈ సందర్భంగా ఏఐసీసీ, పీసీసీ ముఖ్య నేతలు వీరికి స్వాగతం పలకనున్నారు.
SRPT: ముస్లింల రంజాన్ ఉపవాస దీక్షలు విజయవంతం కావాలని కోదాడ మున్సిపల్ ఛైర్‌పర్సన్ కుసుమ ఆకాంక్షించారు. ఆదివారం రాత్రి కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని సాలార్జంగ్ పేటలో విశ్రాంత ఉపాధ్యాయుడు షేక్ బాలేమియా నివాసంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందును ఆమె ప్రారంభించారు. ఇఫ్తార్ విందులు ఇవ్వడం పుణ్యకార్యమని ఆమె పేర్కొన్నారు.
SRCL: వేములవాడ మున్సిపాలిటీలో నూతనంగా విలీనమైన శాత్రాజుపల్లి గ్రామం 2వ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికైన ఏనుగు జ్యోతి తిరుపతి రెడ్డికి గౌడ సంఘం, రజక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా సంఘాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు శాలువాతో సత్కరించి, పూలమాలలతో అభినందించారు. వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని కౌన్సిలర్ ఏనుగు జ్యోతి తెలిపారు.
MNCL: పంట పొలాల్లో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్ వద్ద రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలని తాండూర్ మండల విద్యుత్ AE జాన్ ప్రకటనలో సూచించారు. ఇటీవల ట్రాన్స్ ఫార్మర్లోని విలువైన రాగి తీగ, అల్యుమినియం దొంగలించే ముఠాలు ఎక్కువయ్యాయన్నారు. పలుచోట్ల చోరీలకు పాల్పడ్డాయన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ వద్ద గస్తీ కాయడం, CC కెమెరాల ఏర్పాట్లు లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
MHBD: హోలీ పండుగ వేళ జిల్లాలో బాటసారులు, వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. ఈనెల 3న హోలీ నేపథ్యంలో మహిళలు, చిన్నపిల్లలు ప్రధాన రహదారులు, గ్రామాల్లోని రోడ్లపై ముళ్లచెట్లు, బండరాళ్లను రోడ్డుకు అడ్డంగా పెట్టడంతో బాటసారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డుపై ముళ్ళ చెట్లు, బండరాళ్లు పెట్టకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
PDPL: గోదావరిఖని సింగరేణి స్టేడియం సమీపంలో సంస్థ ఏర్పాటు చేసిన RO వాటర్ ప్లాంట్ నిర్వహణ సరిగా లేకపోవడంతో పరిసర ప్రాంతాలకు చెందిన కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవి ప్రారంభంలోనే మంచినీటి కోసం అవస్థలు పడుతున్నారు. ఈ పంపు ఎప్పుడు వస్తుందో తెలియదు. క్యాన్లు, బిందెలు పట్టుకొని రావడం, తిరిగి వెళ్లడం జరుగుతుంది. బాగు చేయాలని కోరుతున్నారు.
SRD: పటాన్ చెరులో భర్త భార్య, కొడుకుపై కత్తితో దాడి చేశాడు. మామిడిపల్లికి చెందిన ఆనందరావు ముత్తంగి శ్రీనివాసరెడ్డి కాలనీలో నివసిస్తున్నాడు. భార్యపై అనుమానంతో తరచూ గొడవపడేవాడు. ఫిబ్రవరి 24న మద్యం మత్తులో వచ్చి భార్య కవిత, అడ్డుకున్న కుమారుడు ధీరజ్‌పై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
HYD శివారు నారపల్లిలో CPRI ప్రాంతీయ కేంద్రం కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కేంద్రం ద్వారా విద్యుత్ పరికరాల పరీక్షలు, క్వాలిటీ సర్టిఫికేషన్, షార్ట్ సర్క్యూట్ పరీక్షలు, మీటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, కేబుల్స్ వంటి సామగ్రి నాణ్యత నిర్ధారణ జరుగుతాయి. విద్యుత్ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు తమ ఉత్పత్తులను మార్కెట్‌లోకి విడుదల చేసే ముందు CPRI టెస్ట్ చేస్తుంది.
MDCL: రోడ్డు పై వాహనదారుల డ్రైవింగ్, ట్రాఫిక్ నియమ నిబంధనలపై తేడా వచ్చిందా..? వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. కూకట్ పల్లి, KPHB, బాలానగర్ ప్రాంతాల్లో నెంబర్ ప్లేట్ కనిపించకుండా డ్రైవింగ్ చేయడం, హెల్మెట్ ధరించకపోవడం లాంటి వారిపై చర్యలు తీసుకుంటూ హెచ్చరించారు. ఎవరైనా హెల్మెట్ ధరించకపోయినా 9490617346 వాట్సప్ చేయండి.
ADB: నార్నూర్ మండలంలోని కొత్తపల్లి(H) దీక్షభూమి వద్ద లంబాడీ భక్తులు గత నెల 15వ తేదీన 41 రోజుల సేవాలాల్ దీక్షకు స్వీకరించారు. దీన్ని పురస్కరించుకొని ఈ నెల 19న దీక్షగురు ప్రేమ్ సింగ్ మహారాజ్ ఆధ్వర్యంలో కొత్తపల్లి నుంచి MHలోని కాశి పౌరాగఢ్ వరకు సుమారు 360 కి.మీ పాదయాత్రగా వెళ్లనున్నట్లు ఆలయ కమిటీ సభ్యుడు దేవేందర్ రాథోడ్ తెలిపారు.
NRPT: మక్తల్ మండలం జౌలాపురం గ్రామంలో జక్లేర్‌కు వెళ్లే ప్రధాన రహదారి దెబ్బతినడంతో మరమ్మతు పనులకు శ్రీకారం చుట్టారు. సర్పంచ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు లక్ష్మీకాంత్ రెడ్డి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి పనులు చేపట్టామని, గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని నాయకులు తెలిపారు.
NLG: కనగల్ మండలానికి చెందిన కంబాల శివలీలకు ‘కళామతల్లి ముద్దు బిడ్డ’ ఆత్మీయ సత్కారం వరించింది. గత కొన్నేళ్లుగా ఆమె చేస్తున్న సామాజిక సేవలు, కళా రంగంలో కృషిని గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేశారు. నేడు హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో జరిగే కార్యక్రమంలో ఆమె ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.
మహబూబ్‌నగర్‌లోని ఓ సంస్థ మేనేజర్ మధుకర్ రెడ్డిపై ఉద్యోగం కోసం వచ్చిన మహిళను వేధించాడన్న ఆరోపణల నేపథ్యంలో బీసీ సమాజ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యుడిపై తక్షణ చర్యలు తీసుకుని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ అంశంపై సోమవారం మెట్టుగడ్డలోని సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ సాగర్ తెలిపారు.
ADB: బేల మండలంలోని సాంగ్వి గ్రామంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. యువతను క్రీడల్లో రాణించాలనే లక్ష్యంతో నిర్మించిన క్రీడలు, ఆట పోటీలు నేర్చుకునే స్థలం కేవలం బోర్డుకే పరిమితమైంది. ఇలా ఉంటే ఏమాత్రం పిల్లలు ఆటలు నేర్చుకుంటారని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి దీన్ని వినియోగానికి తిసుకురావాలని ప్రజలు కొరారు.