• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఎల్ఎల్‌బీ 5వ సెమిస్టర్ పరీక్షలు.. ఒకరు గైర్హాజరు..!

NZB: తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ఎల్ఎల్‌బీ ఐదో సెమిస్టర్ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా కొనసాగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 28 మంది విద్యార్థులకు 27 మంది హాజరుకాగా, ఒక్కరు గైర్హాజరైనట్లు వెల్లడించారు. విద్యార్థులు ఎటువంటి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడలేదని తెలిపారు.

February 27, 2026 / 05:38 PM IST

సబ్ స్టేషన్ పనులకు భూమిపూజ చేసిన మంత్రి

NRPT: మాగనూర్ మండలం వాడ్వాట్లో రూపుదిద్దుకోనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్జెస్టేషన్ నిర్మాణానికి మంత్రి వాకిటి శ్రీహరి శుక్రవారం భూమిపూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. సబ్జెస్టేషన్ అందుబాటులోకి వస్తే వోల్టేజ్ సమస్యలు తొలగి, రైతులకు, ప్రజలకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా అందుతుందన్నారు. గ్రామీణాభివృద్ధిలో విద్యుత్ కీలకమని పేర్కొన్నారు.

February 27, 2026 / 05:37 PM IST

తెలంగాణ సమస్యలపై మాట్లాడిన ఎంపీ

NZB: తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం ఎంపీ KR.సురేశ్ రెడ్డి రాజ్య సభలో మాట్లాడారు. తెలంగాణకు సంబంధించిన పలు సమస్యలపై ఆయన ప్రస్తావించారు. 2025-26లో రైతు సమస్యలు, యూరియా కొరత, పంట బీమా లోపాలు, కృష్ణా-గోదావరి జలాలు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, మైనారిటీ హక్కులు, వక్స్ బిల్లు గురించి మాట్లాడారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు న్యాయం చేయాలని ఆయన కోరారు.

February 27, 2026 / 05:36 PM IST

‘JNUలో జరిగిన దాడి అమానుషం’

NLG: దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో విద్యార్థులు, అధ్యాపకులపై జరిగిన అమానుష దాడిని ఎస్‌ఎఫ్‌ఐ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. శుక్రవారం దేవరకొండలో డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

February 27, 2026 / 05:34 PM IST

సాయుధ సిబ్బందికి క్రమశిక్షణ తప్పనిసరి: SP

ADB: సాయుధ సిబ్బందికి విధులలో క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరిగా ఉండాలని జిల్లా SP అఖిల్ మహాజన్ తెలిపారు. పట్టణంలోని పోలీసు ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో సాయుధ సిబ్బందికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విశ్రాంతి గదిని వాహనాల రక్షణ నిమిత్తం ఏర్పాటు చేసిన షెడ్డును SP శుక్రవారం ప్రారంభించారు. AR DSP ఇంద్రవర్ధన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు వెంకటి, మురళి తదితరులున్నారు.

February 27, 2026 / 05:34 PM IST

రేపు పిట్లంకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ రాక

KMR: జుక్కల్ మండలంలోని అన్ని గ్రామాల MRPS కార్యకర్తలు ‘హలో మాదిగ-చలో పిట్లం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని MRPS మండల అధ్యక్షుడు మారుతి పిలుపునిచ్చారు. రేపు రాష్ట్ర SC, ST కమిషన్ ఛైర్మన్ భక్కి వెంకటయ్య పిట్లం రానున్నట్లు చెప్పారు. ఎమ్మార్పీఎస్ తరఫున తమ సమస్యలు తెలిపేందుకు అందరూ తరలి వెళ్లాలన్నారు. పిట్లం మార్కెట్ యార్డ్‌లో ఉదయం 11 గంటలకు హాజరు కావాలని ఆయన కోరారు.

February 27, 2026 / 05:32 PM IST

మిడ్జిల్ మండల సర్పంచులకు ముగిసిన శిక్షణ

MBNR: మిడ్జిల్ మండలంలోని 24 గ్రామపంచాయతీలకు చెందిన నూతన సర్పంచులకు గత 5 రోజులుగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని దుర్గాబాయి దేశ్ ముఖ్ మహిళా ప్రాంగణంలో శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ శిబిరం ఈరోజు ముగిసింది. సర్పంచులకు అధికారులు సర్టిఫికెట్ అందజేశారు. సర్పంచులు మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి అధికారుల శిక్షణ తమకు సంతృప్తిని కలిగించిందన్నారు.

February 27, 2026 / 05:32 PM IST

రసవత్తరంగా బండ లాగుడు పోటీలు.. వీక్షించిన ఎమ్మెల్సీ

RR: కేశంపేట మండలం బైర్ ఖాన్ పల్లి గ్రామంలో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బండ లాగుడు పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి హాజరై పోటీలను వీక్షించారు. పోటీలలో ఎవరికి వారు విజేతలుగా నిలవాలని పెద్ద ఎత్తున పాల్గొనడంతో పోటీలు రసవత్తరంగా సాగాయి.

February 27, 2026 / 05:27 PM IST

చిల్లంచర్ల వరలక్ష్మి కన్నుమూత

SRPT: తెలంగాణ సాయుధ రైతంగ పోరాట యోధుడు, అమరజీవి చిల్లంచర్ల రఘునాథం సతీమణి వరలక్ష్మి (94) శుక్రవారం అనారోగ్యంతో కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె మునగాలలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. సాయుధ పోరాట కాలం నుంచి భర్త అడుగుజాడల్లో నడిచిన వరలక్ష్మి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

February 27, 2026 / 05:23 PM IST

గుత్ప GP నూతన కార్యదర్శిగా రామ గౌడ్ బాధ్యతలు

NZB: ఆలూర్ మండలం గుత్ప GPకి బదిలీపై వచ్చిన రామ గౌడ్ శుక్రవారం నూతన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. గ్రామ ప్రజల సహకారంతో పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటానని రామ గౌడ్ తెలిపారు. హౌసింగ్ ఏఈ ప్రశాంత్, నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు శశి కుమార్, తదితరులు పాల్గొన్నారు.

February 27, 2026 / 05:21 PM IST

క్రికెట్ ఆడిన కేయూ వీసీ ప్రతాపరెడ్డి

HNK: కాకతీయ యూనివర్సిటీలో ఏబీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్‌ను నేడు కేయూ వైస్ ఛాన్సలర్ ప్రతాపరెడ్డి సందర్శించి కాసేపు విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడారు. క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుందని, విద్యార్థులు, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడల్లో రాణించాలని వైస్ ఛాన్సలర్ అన్నారు. కార్యక్రమంలో పలువురు నేతలు ఉన్నారు.

February 27, 2026 / 05:21 PM IST

‘క్రీడల్లో యువత తమ శక్తి సామర్థ్యాలను వినియోగించాలి’

BDK: నేటి యువత క్రీడల్లో తమ శక్తి సామార్థ్యాలతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ మండల పరిధిలోని నారాయణరావుపేటలో యర్రపోతు పుల్లయ్య మెమోరియల్ కప్, సంతోష్ కుమార్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాల్వంచ, మండల స్థాయి క్రీడా పోటీలను శుక్రవారం ప్రారంభించారు.

February 27, 2026 / 05:20 PM IST

‘కొండమల్లేపల్లిని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం’

నల్గొండ జిల్లాలోని కొండమల్లేపల్లిని ప్రధాన అభివృద్ధి కేంద్రంగా మారుస్తామని సర్పంచ్ యుగంధర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల ఆయన పాలకవర్గ సభ్యులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిని సందర్శించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. వాణిజ్య, నివాస రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు.

February 27, 2026 / 05:19 PM IST

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

NZB: నవీపేట్ మండలం పాల్దా-జన్నెపల్లి రహదారిపై కొండూర్ కమాన్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వాహనం, ఎక్సెల్ స్కూటీని ఢీకొట్టింది. బీహార్‌కు చెందిన వ్యవసాయ కూలీలు పరశురాం, హరిచరణ్ తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. వారికి 108 ఈఎంటీ నవీన్, పైలట్ మురళీ కృష్ణ ప్రథమ చికిత్స చేసి నిజామాబాద్ జిల్లా ఆస్పత్రి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 27, 2026 / 05:18 PM IST

పాతబస్తీలో ఐక్య రాజ్య సమితి పర్యాటక సంస్థ సెక్రటరీ జనరల్

HYD: ఐక్య రాజ్య సమితి పర్యాటక సంస్థ సెక్రటరీ జనరల్ ప్రత్యేక సలహాదారుగా పనిచేస్తున్న అనితా మెండిరట్ట శుక్రవారం హైదరాబాద్ సందర్శించారు. చారిత్రాత్మక భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం పాతబస్తీలో పూసలు, గాజులు విక్రయించారు. వీటితోపాటు ఫేమస్ హైదరాబాద్ ఇరానీ ఛాయ్ ఆస్వాదించారు.

February 27, 2026 / 05:17 PM IST