• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

టైలర్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

NZB: జిల్లా మేరు సంఘం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘టైలర్స్ డే’ వేడుకల్లో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. సాదాసీదా వస్త్రానికి చక్కని ఆకారాన్ని ఇచ్చి, సమాజంలో మన అందాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడే శిల్పులు టైలర్లు అని కొనియాడారు. వారి వృత్తి నైపుణ్యం అభినందనీయమన్నారు.

February 28, 2026 / 02:02 PM IST

‘ఇంటి వద్దకే భద్రాచలం తలంబ్రాలు’

NLG: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ముత్యాల తలంబ్రాలను ఇంటి వద్దకే అందించేందుకు ఆర్టీసీ ప్రత్యేక సేవలను తెచ్చినట్లు దేవరకొండ డిపో మేనేజర్ విజయకుమారి శనివారం తెలిపారు. ఈ మేరకు పోస్టర్ విడుదల చేశారు. భక్తులు రూ. 151 చెల్లిస్తే ఇంటి వద్దకు అందించడమే లక్ష్యమని తెలిపారు. బుకింగ్ కోసం ఆర్టీసీ కార్గోలో సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

February 28, 2026 / 02:02 PM IST

జన్నారంలో జాతీయ సైన్స్ దినోత్సవం

MNCL: జన్నారం మండలంలోని పలు గ్రామాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ సివి.రామన్ ఆవిష్కరణ రామన్ ఎఫెక్ట్ ప్రపంచానికి పరిచయం చేసిన రోజు సందర్భంగా శనివారం జన్నారం మండలంలోని అక్కపెల్లిగూడా, తదితర గ్రామాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు.

February 28, 2026 / 02:01 PM IST

జామాయిల్ తోటలో చెలరేగిన మంటలు

MHBD: ఇనుగుర్తి మండలంలోని చిన్న నాగారం కంపార్ట్మెంట్ 1139 ఆటవిలోని జామాయిల్ తోటలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగాయి. దీంతో తోటలో దట్టమైన పొగతో మంటలు వస్తుండగా, సమీపంలోని లాలు తండా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించిన అటవీశాఖ అధికారులు మంటలను ఆర్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

February 28, 2026 / 01:53 PM IST

కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన బోథ్ ఎమ్మెల్యే

ADB: గుడిహత్నూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శనివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 51 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

February 28, 2026 / 01:40 PM IST

ఇసుక బహిరంగ వేలంపాట..!

MDK: రామాయంపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద శనివారం ఇసుక బహిరంగ వేలం పాట నిర్వహించారు. ఇటీవల స్వాధీనం చేసుకున్న 16 ట్రాక్టర్ల ఇసుక బహిరంగ వేలం పాట నిర్వహించగా 8 మంది వ్యాపారులు ఈ వేలంపాటలో పాల్గొన్నారు. రూ.43 వేలకు స్థానిక ఇసుక వ్యాపారి మల్లారెడ్డి ఇసుకను స్వాధీనం చేసుకున్నట్లు డిప్యూటీ తహసీల్దార్ నవీన్ కుమార్ తెలిపారు.

February 28, 2026 / 01:39 PM IST

MALDలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుక

GDWL: గద్వాల మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ (MALD) డిగ్రీ కళాశాలలో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వైస్ ప్రిన్సిపాల్ డా. కె. చంద్రమోహన్ అధ్యక్షతన సర్ సీవీ రామన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించి, ఆయన విజ్ఞాన రంగంలో చేసిన కృషిని స్మరించుకున్నారు. సైన్స్ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

February 28, 2026 / 01:39 PM IST

‘న్యాయవాదుల రక్షణకు చట్టం తీసుకురావాలి’

GDWL: అలంపూర్ నుంచి హైదరాబాద్‌కు న్యాయవాదులు తలపెట్టినా మహా పాదయాత్ర నేటితో ముగిసిందని ఆలంపూర్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నరసింహ అన్నారు. మహా పాదయాత్రతో సెక్రటేరియట్కు చేరుకున్న న్యాయవాదులు అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రతి చోటా న్యాయవాదులపై దాడులు జరుగుతున్నాయని నరసింహ పేర్కొన్నారు.

February 28, 2026 / 01:38 PM IST

సందర్శకులను ఆకట్టుకున్న ఆవిష్కరణలు

RR: జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని పామెన శివారులో ఉన్న ఓ పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు రూపొందించిన వివిధ శాస్త్రీయ నమూనాలు, ప్రయోగాలు, సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించారు. పునరుత్పాదక శక్తి వనరులు, పర్యావరణ పరిరక్షణ, స్మార్ట్ సిటీ నమూనాలు, సైన్స్ ఆధారిత ఆవిష్కరణలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.

February 28, 2026 / 01:37 PM IST

మల్లన్న ఆలయానికి భక్తుడి విరాళం

MBNR: బాలానగర్ మండలం నందారంలో నిర్మిస్తున్న మల్లన్న స్వామి ఆలయానికి చెన్నారెడ్డి అనే భక్తుడు రూ.51,116 విరాళంగా అందజేశారు. హిందూ సంప్రదాయాల పరిరక్షణకు ఆలయాల అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

February 28, 2026 / 01:35 PM IST

అంగన్వాడీ కేంద్ర భవనానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

JGL: ధర్మపురి నియోజకవర్గంలోని కిష్టంపేట గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో నూతన అంగన్వాడీ కేంద్ర భవన నిర్మాణానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేతుల మీదుగా భూమిపూజ జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సీడీపీవో మమత, ఎంపీడీవో చిరంజీవి, ఎంపీ ఓ సుష్మ, ఏఈ ప్రసాద్, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

February 28, 2026 / 01:35 PM IST

ఘనంగా శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన

జగిత్యాల రూరల్ మండలం తక్కలపల్లిలో శ్రీ రేణుకా ఎల్లమ్మ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన, బోనాల పండుగ, పట్నాల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. గౌడ సంఘం సభ్యులు, గ్రామ నాయకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. మహిళలు బోనాలు సమర్పించారు.

February 28, 2026 / 01:34 PM IST

తొమ్మిదే నెలల్లో ‘ఫ్యూచర్ సిటీ’ నైటౌట్

HYD: రేంజ్ మారిపోతోంది బాబోయ్! 765 చదరపు కిలోమీటర్ల భారీ విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న ‘ఫ్యూచర్ సిటీʼకి సర్కార్ డెడ్ లైన్ ఫిక్స్ చేసింది. కేవలం 9 నెలల్లోనే పూర్తిస్థాయి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని టెండర్‌లో స్పష్టం చేసింది. 56 గ్రామాలను కలుపుతూ గ్లోబల్ కంపెనీలు, యూనివర్సిటీలే లక్ష్యంగా ఈ నగరం నిర్మిస్తున్నారు.

February 28, 2026 / 01:34 PM IST

రైతుబంధుకు డబ్బులు లేవా సీఎం: హరీష్ రావు

SDPT: కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుందని ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. జనగామలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఫూట్ బాల్ ఆడటానికి, విలాసవంతమైన కార్యాలయం కట్టుకోవడానికి పైసలు ఉంటాయి కానీ, రైతులకు రైతుబంధు ఇవ్వడానికి డబ్బులు లేవా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.

February 28, 2026 / 01:34 PM IST

రాజ్యసభ రేసులో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే

NGKL: ఏఐసీసీ కార్యదర్శి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి రాజ్యసభ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. జాతీయ స్థాయిలో పార్టీకి అందిస్తున్న సేవలను గుర్తించి ఆయనకు అవకాశం ఇవ్వాలని పలువురు నేతలు సీఎం రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. త్వరలో రాష్ట్రం నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

February 28, 2026 / 01:33 PM IST