• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది: MP

HNK: ధర్మసాగర్ మండలంలోని ముప్పారం గ్రామంలో VO. భవన నిర్మాణ పనులకు స్థానిక ఎంపీ కడియం కావ్య భూమి పూజ చేశారు. మహిళా సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ప్రభుత్వ పథకాలను అర్హులైన మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా లబ్ధి పొందాలని ఎంపీ కడియం కావ్య పిలుపునిచ్చారు. అనంతరం స్థానికులతో ఎంపీ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

February 28, 2026 / 04:44 PM IST

మహిళలకు అధికంగా వచ్చే క్యాన్సర్లు ఇవే..!

HYD: తెలంగాణలో ప్రతి ఏటా సుమారు 55 నుంచి 60 వేల క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. మహిళల్లో కనిపించే క్యాన్సర్లలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌లో రెండో స్థానంలో ఉందని, రాష్ట్రంలో ఏటా దాదాపు 3,200 మందిని ప్రభావితం చేస్తున్నట్లు HYD MNJ క్యాన్సర్ హాస్పిటల్ టీం తెలిపింది. ఈ నేపధ్యంలోనే HPV వాక్సినేషన్ ప్రారంభించారు. అయితే, మొదటి స్థానంలో బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది.

February 28, 2026 / 04:44 PM IST

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు: ఛైర్పర్సన్

WGL: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నర్సంపేట మున్సిపల్ ఛైర్పర్సన్ పెండెం శ్రీ లక్ష్మీ రామానంద్ అన్నారు. 5వ వార్డులో స్థానిక నేతలతో కలిసి ఛైర్పర్సన్ పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నర్సంపేట పట్టణ పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేలా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తామన్నారు.

February 28, 2026 / 04:43 PM IST

పదో తరగతి విద్యార్థులు సమయాన్ని వృధా చేయవద్దు: దేవా

WGL: నల్లబెల్లి (M) కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో శనివారం HM వసంత ఆధ్వర్యంలో ‘స్ఫూర్తి’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య ముఖ్యఅతిథిగా రిటైర్డ్ MEO దేవా హాజరై, మాట్లాడారు. విద్యార్థులు మత్తు పానీయాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షల దృష్ట్యా సమయాన్ని వృథా చేయకూడదన్నారు.

February 28, 2026 / 04:41 PM IST

భవనంపై నుంచి దూకి ఉద్యోగి ఆత్మహత్య

KMR: నస్రుల్లాబాద్ మండలం దుర్కి శివారులోని SRNK డిగ్రీ కళాశాలలో శనివారం విషాదం చోటుచేసుకుంది. కళాశాలలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న షేక్ అహమ్మద్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడు కొంతకాలంగా కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.

February 28, 2026 / 04:40 PM IST

ఉప్పల్ PHCలో నిత్యం బీపీ, షుగర్ పరీక్షలు..!

MDCL: ఉప్పల్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో ప్రతిరోజూ బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచే వచ్చే రోగులకు ఉచితంగా రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలను పరీక్షించి వైద్యులు అవసరమైన సలహాలు అందిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులను ముందుగానే గుర్తించి నియంత్రణలో ఉంచేందుకు ఈ సేవలు ఉపయోగపడుతున్నాయి.

February 28, 2026 / 04:34 PM IST

కుల గణన సర్వే రెమ్యూనరేషన్ చెల్లించాలని విన్నపం

సంగారెడ్డి: 2024 నవంబర్‌లో కుల గణన సర్వే చేపట్టిన ఉపాధ్యాయులకు రెమ్యూనరేషన్ వెంటనే విడుదల చేయాలని సిర్గాపూర్ PRTU మండల శాఖ ఆధ్వర్యంలో MPDO ఆఫీసులో సూపరింటెండెంట్‌కు శనివారం వినతి పత్రం అందించారు. విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించాలని మండల శాఖ అధ్యక్షులు కర్ర నర్సింగ్ చౌహాన్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 

February 28, 2026 / 04:31 PM IST

‘మిషన్ భగీరథ పైప్ లైన్ మరమ్మతు చేసి నీళ్లు ఇవ్వాలి’

వనపర్తి పట్టణం 9వ వార్డు కలెక్టర్ ఆఫీస్ రోడ్డులో పాడైన మిషన్ భగీరథ పైప్ లైన్ మరమ్మతు చేసి నీళ్లు ఇవ్వాలని బిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి కుమార్ మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం సమర్పించారు. డ్రైనేజీల నిర్మాణం సందర్భంగా ఏడాది క్రితం పైప్ లైన్ పగిలిపోయి నీళ్లు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే పైప్ లైన్ మరమ్మత్తు చేసి తాగునీరు అందించాలని కోరారు.

February 28, 2026 / 04:30 PM IST

ఇమాంపూర్‌లో పౌర హక్కుల దినోత్సవం

MDK: తూప్రాన్ మండలం ఇమాంపూర్ గ్రామంలో సివిల్ రైట్స్ డే రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గ్రామస్తులు అందరికీ వెనుకబడిన తరగతుల కులాలకు సంబంధించి వారికి ఉన్న హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించారు. సర్పంచ్ బక్క స్వరూప, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.

February 28, 2026 / 04:30 PM IST

సర్పంచుల సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం

NLG: జిల్లాలో సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశోక్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి శంకర్ నాయక్‌లకు సర్పంచులు శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దేవరకొండ మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు కొర్ర రాంసింగ్ నాయక్ మాట్లాడుతూ.. SSR రేట్లను పెంచాలని కోరారు. గౌరవ వేతనం రూ. 10 వేలకు పెంచాలన్నారు.

February 28, 2026 / 04:29 PM IST

యువత పాత్ర అత్యంత కీలకం: మేయర్

KNR: స్థానిక ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపల్ కే.రామకృష్ణ అధ్యక్షతన ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన “50 సంవత్సరాల అత్యవసర పరిస్థితి-నేర్చుకోవలసిన పాఠాలు” అంశంపై వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 జిల్లాస్థాయి ఉపన్యాస ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న KNR మేయర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. వికసిత్ భారత్ లక్ష్యసాధనలో యువత పాత్ర కీలకమన్నారు.

February 28, 2026 / 04:29 PM IST

ఘనంగా బుగులు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

JN: చిల్పూర్ గుట్ట శ్రీ బుగులు వెంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవాన్ని నేడు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవానికి ఎంపీ కడియం కావ్య హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిల్పూర్ గుట్ట ఆలయం ప్రాంత ప్రజలకే కాకుండా పరిసర జిల్లాల భక్తులకు కూడా ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోందని, ఆలయ అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తానన్నారు.

February 28, 2026 / 04:29 PM IST

కాంగ్రెస్‌లో చేరిన BRS నాయకులు

PDPL: గోదావరిఖని పట్టణం 8వ కాలనీకి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం భాగ్యలక్ష్మి- తిరుపతి యాదవ్ ఆధ్వర్యంలో BRS పార్టీకి చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో శనివారం చేరారు. రామగుండం MLA రాజ్ ఠాకూర్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.

February 28, 2026 / 04:28 PM IST

పేరుకు మాత్రమే పేదల పార్టీ.. చేతల్లో మాత్రం రాక్షస పార్టీ: ఈటల

KMM: కనీస కనికరం లేకుండా పేదల ఆవాసాలను కూల్చివేసి తప్పు జరిగినందుకు ముఖ్యమంత్రి బేషరతుగా బాధితులకు క్షమాపణ చెప్పాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. పేదలు ఓట్లు వేస్తే గద్దెనెక్కిన ఈ పార్టీ పేరుకు మాత్రమే పేదల పార్టీ అని చేతల్లో మాత్రం రాక్షస పార్టీ అని విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి బాధితులకు సత్వర న్యాయం చేయాలని పేర్కొన్నారు.

February 28, 2026 / 04:28 PM IST

శాయంపేటలో వార్డు మెంబర్లకు శిక్షణ కార్యక్రమం..

HNK: శాయంపేట రైతు వేదికలో పలు గ్రామాల వార్డు మెంబర్లకు 24వ తేదీ నుండి నేటి వరకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధిలో వార్డు మెంబర్ల పాత్ర, ఇతర అంశాలపై ఐదు రోజులపాటు వార్డ్ మెంబర్లకు అధికారులు ట్రైనింగ్ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న వార్డు మెంబర్లకు నేడు మండల అధికారులు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు.

February 28, 2026 / 04:27 PM IST