MDK: తూప్రాన్ మండలం ఇమాంపూర్ గ్రామంలో సివిల్ రైట్స్ డే రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గ్రామస్తులు అందరికీ వెనుకబడిన తరగతుల కులాలకు సంబంధించి వారికి ఉన్న హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించారు. సర్పంచ్ బక్క స్వరూప, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.