ADB: ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు చేసుకోవాలని దిశ కమిటీ ఛైర్మన్, ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం అనేక పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తుందని, దీంతో పాటే రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి పనులను కూడా వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.
MDK: జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ. 257 నుంచి రూ. 260 మధ్య ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ కేజీ ధర రూ. 292 నుంచి రూ. 300 వరకు పలుకుతోంది. గత వారంతో పోలిస్తే రూ. 20 వరకు పెరిగింది.
VKB: జిల్లాలో యాసంగి సాగు గణనీయంగా పెరిగింది. జిల్లాలో సుమారుగా 3,34,627 మంది రైతులు ఉన్నారు. జిల్లావ్యాప్తంగా అత్యధికంగా రైతులు వరి పంటను పండిస్తున్నారు. జిల్లాలో ఇదివరకు సాధారణ సాగు 75,838 ఎకరాల్లో ఉండేది. ప్రస్తుతం 93,116 ఎకరాలు పెరిగింది. జిల్లాలో అన్ని పంటలు కలుపుకుని ప్రస్తుతం 1,45,241 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు.
నేడు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ గిరిజన భవన్‌లో శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజు జయంతి ముగింపు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని గిరిజన విద్యార్థి సేవా సంఘం అధ్యక్షులు రవి రాథోడ్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమానికి గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు హనుమాన్ నాయక్ ముఖ్యఅతిథిగా వస్తారన్నారు. నేడు అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు.
GDWL: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సూచించారు. శనివారం ఇటిక్యాల మండలం వావిలాలలో లివర్ ఆపరేషన్ కోసం బాధిత కుటుంబానికి రూ.5 లక్షల విలువైన LOC అందజేశారు. నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చంద్రగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
BDK: కరకగూడెం మండలంలోని అశ్వారావుపాడు వలస ఆదివాసీ గ్రామంలో కోవాసి వెంకటేష్ అనే గిరిజనుడు దారుణ హత్యకు గురయ్యాడు. శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు అతడిని హతమార్చినట్లు సమాచారం. ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై నాగేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
SRD: నారాయణఖేడ్ పట్టణంలోని వీరశైవ పంచ ఆచార్య జంగమ భవన ప్రాంగణంలో ఆదివారం ఆది జగద్గురు రేణుకాచార్యుల జయంతి కార్యక్రమం వీరశైవ జంగమ, లింగాయత్ సమాజ్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. తాలూకా జంగమ సమాజ్ అధ్యక్షులు శివకుమార్ స్వామి, మనూర్ మాజీ ఎంపీపీ శంకరయ్య స్వామి రేణుక చార్యుల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
SRCL: వేములవాడ సబ్ డివిజనల్ పోలీసు అధికారిగా ఏ. శ్రీనివాసులు నియమితులయ్యారు. హైదరాబాద్ సిటీ సీపీటీసీలో ఏసీపీగా పనిచేస్తున్న ఆయనను వేములవాడ డీఎస్పీగా బదిలీ చేస్తూ డీజీపీ కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ ఏఎస్పీగా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి సాయి రుత్విక్ ను ఉట్నూర్ ఏఎస్పీగా బదిలీ చేసినట్లు సమాచారం.
వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో వంద శాతం ఆస్తి పన్ను వసూలు చేయాలని మున్సిపల్ ఛైర్‌పర్సన్ మిడిదొడ్డి మాధవి అన్నారు. ఈ అంశంపై శనివారం మున్సిపల్ కార్యాలయంలో వార్డు అధికారులు, ఆర్పీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మార్చి 31లోగా పన్ను వసూళ్లు పూర్తిచేయాలని, అవసరమైతే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి లక్ష్యాన్ని సాధించాలని సూచించారు.
KNR: వీణవంక మండలం పరిధిలోని చల్లూరు గ్రామంలో అక్రమంగా ఇసుక రవాణా కేసులో పరారీలో ఉన్న నిందితుడు శివరాత్రి మహేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 25న అనుమతి పత్రాలు లేకుండా ఇసుక రవాణా చేస్తూ కానిస్టేబుల్‌ను ట్రాక్టర్‌తో ఢీకొట్టి గాయపరిచి పరారయ్యాడు. గాలింపు అనంతరం అరెస్ట్ చేసి హుజూరాబాద్ కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్సై తెలిపారు.
KMM: చింతకాని మండల పరిధిలోని నాగులవంచ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందాడు. చిన్న మండవ మున్నేరు వాగు నుంచి ఇసుకను తరలిస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
MLG: మల్లూరులోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఈనెల 3న చంద్రగ్రహణం సందర్భంగా మూసివేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు ఇవాళ తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి ఆలయం మూసివేసి, గ్రహణానంతరం మార్చి 4న సంప్రోక్షణ పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 7 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తారు. గ్రహణ సమయంలో ఎలాంటి పూజలు ఉండవని, భక్తులు గమనించాలని నిర్వాహకులు కోరారు.
KNR: వీణవంక మండలం ఎలబాక గ్రామానికి చెందిన బావు వేదశ్విని(18) కాలేయ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెకు హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి కన్నుమూసింది. వేదశ్విని అకాల మరణంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
BHPL: జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు వివిధ కోర్సుల్లో ఉచిత నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా పరిశ్రమల శాఖ GM సిద్ధార్థ తెలిపారు. DEET, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సహకారంతో వైఎస్కే ఇన్ఫోటెక్ ఈ శిక్షణను అందిస్తుంది. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉద్యోగ గ్యారంటీ ఉంటుందని ఆయన వెల్లడించారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 22లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
RR: యాసంగి పంట సాగుకు యూరియా బస్తాల పంపిణీ ఇవాళ ఉంటుందని కందుకూరు వ్యవసాయ శాఖ తెలిపింది. కందుకూరులోని సొసైటీ ఆఫీస్ వద్ద ఉదయం10 గంటలకు రైతులకు యూరియా బస్తాలు పంపిణీ చేయనున్నారు. రైతులు యూరియా (ఫెర్టిలైజర్) ఆప్‌లో బుక్ చేసుకుని తర్వాత తమ పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కార్డు తీసుకురావాలంటూ తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.