KNR: ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పెద్దపల్లి జిల్లా కన్వీనర్‌గా కొలిపాక శ్రీనివాస్ ను నియమించినట్లు రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజి రెడ్డి ప్రకటించారు. ఈ నియామకం తక్షణ ప్రభావంతో అమల్లోకి వచ్చిందని, పార్టీ బలోపేతం లక్ష్యంగా ఈ నియామకం చేపట్టినట్లు పేర్కొన్నారు. మండల, పట్టణ, గ్రామ స్థాయి కమిటీలను సమన్వయం చేసి పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేయాలన్నారు.
PDPL: మంథని JNTU ఇంజనీరింగ్ కళాశాలలో బీ-జోన్ క్రికెట్ పోటీలు రెండో రోజు రసవత్తరంగా సాగాయి. కొత్తగూడెం అకిట్స్ ఇంజనీరింగ్ కళాశాల రెండు విజయాలతో సెమీఫైనల్కు అర్హత సాధించింది. బిట్స్పై లక్ష్యాన్ని ఛేదించి గెలిచిన అకిట్స్ జట్టు, ట్రినిటీపై కూడా ఆధిపత్యం చాటింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను సింగరేణి ఆర్జీ3 ఏరియా పర్యావరణాధికారి రాజిరెడ్డి ప్రదానం చేశారు.
SRCL: గంభీరావుపేట మండలంలోని రైతులను యూరియా ‘యాప్’ కష్టాలు వెంటాడుతున్నాయి. సాంకేతిక ఇబ్బందులతో యూరియా దొరక్క అన్నదాతలు అల్లాడుతున్నారు. స్మార్ట్ ఫోన్లు లేకపోవడం ఒక సమస్య అయితే, పట్టాదారు పాస్బుక్కులకు ఫోన్ నంబర్లు అనుసంధానం కాకపోవడం మరో అడ్డంకిగా మారింది. యాప్ ద్వారా ఎరువులు ఎలా పొందాలో తెలవక ఇబ్బందులు పడుతున్నారు.
KNR: కౌమార విద్య, HIV, AIDS పైన విద్యార్థులలో అవగాహన కల్పించుటకు జిల్లా స్థాయిలో నిర్వహించిన పోస్టర్ మేకింగ్ పోటీలలో కరీంనగర్ ప్రభుత్వ పురాతన ఉన్నత పాఠశాల 9th విద్యార్థి కుంచం అక్షయ్ కుమార్ ద్వితీయ బహుమతి సాధించారు. జిల్లా అదనపు పరిపాలనాధికారి అశ్వినీ తానాజీ వాకడే, క్వాలిటీ కో ఆర్డినేటర్ అశోక్ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి చేతుల మీదుగ అందుకున్నారు.
SRCL: సోషల్ మీడియా పరిచయం పెళ్లి మోసానికి దారి తీసిన ఘటన వేములవాడ పట్టణంలో చోటుచేసుకుంది. శుక్రవారం పట్టణ సీఐ బి. వీరప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన ఓ మహిళకు విజయవాడకు చెందిన వంశీ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమై పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. అనంతరం ఇద్దరూ వేములవాడకు వచ్చి ఓ లాడ్జ్‌లో గది తీసుకున్నారు.
JGL: కోరుట్ల పట్టణానికి చెందిన సీనియర్ వైద్యులు, డాక్టర్ వై. అనూప్ రావు భారతీయ జనతా పార్టీలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అర్వింద్, JGL అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబుల సమక్షంలో శుక్రవారం చేరారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చేపట్టిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పార్టీ కండువా కప్పుకున్నారు.
KNR: చొప్పదండి మండలం పెద్దకుర్మపల్లె అంగన్వాడీ సెంటర్‌లో ఐసీడిఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం సభ నిర్వహించారు. సర్పంచ్ మవురం సుగుణ అధ్యక్షత వహించగా సీడీపీఓ నర్సింగరాణి హాజరై మాట్లాడుతూ.. ఎత్తుకు, వయసుకు తగ్గ బరువు లేని పిల్లలకు పౌష్టికాహారం అందించాలని తల్లులకు వివరించారు. అనంతరం గర్భిణీలకు సీమంతాలు నిర్వహించి మహిళా సాధికారత గురించి తెలిపారు.
ఆదిలాబాద్ రైల్వే స్టేషన్, రిమ్స్ పరిసరాల్లో సెల్ ఫోన్లు లాక్కొంటున్న ఆరుగురు దోపిడీ దొంగల ముఠాను టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 15న జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి సీఐ నాగరాజు ఆధ్వర్యంలో నిందితులను పట్టుకున్నారు. వారిలో ఒకరు బాల నేరస్తుడు ఉన్నాడు. నిందితుల నుంచి 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గతంలో వీరిపై కేసులు నమోదైనట్లు తెలిపారు.
జగిత్యాల రూరల్ మండలం తక్కల్లపల్లి గ్రామంలో ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామ వీధుల గుండా భక్తిశ్రద్ధలతో సాగిన ఊరేగింపులో మహిళలు బోనాలు సమర్పిస్తూ పాల్గొన్నారు. డప్పులు, పూజా కార్యక్రమాలతో గ్రామం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. అనంతరం ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి విగ్రహాన్ని ప్రతిష్టించారు.
MBNR: సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ చెస్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు పాలమూరు యూనివర్సిటీ చెస్ పురుషుల జట్టు తమిళనాడులోని భారతీదాసన్ యూనివర్సిటీ తిరుచిరాపల్లికి బయలుదేరింది. వీసీ శ్రీనివాస్ క్రీడాకారులకు క్రీడా దుస్తులు అందజేసి, క్రమశిక్షణతో సాధన చేసి విజయాలు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్ బాబు, పీడీ డా. శ్రీనివాస్ పాల్గొన్నారు.
SRD: పదో తరగతిలో విద్యార్థులు మంచి మార్కులు సాధించాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. కంది మండలం కాశీపూర్ కస్తూర్బా పాఠశాలను శుక్రవారం తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్షలు దగ్గర పడుతున్నందున విద్యార్థులు ఏకాగ్రతతో చదవాలని చెప్పారు. పరీక్షల ముగిసే వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు.
RR: తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ (TGIRD) ఆధ్వర్యంలో జిల్లా సర్పంచ్‌ల కోసం నిర్వహించిన ఐదు రోజుల ‘జనరల్ ఓరియంటేషన్’ శిక్షణా కార్యక్రమం ముగిసింది. ముచ్చింతల్‌లోని స్వర్ణభారతి ట్రస్ట్ వేదికగా జరిగిన ఈ శిక్షణలో షాద్‌నగర్ నియోజకవర్గంలోని 6 మండలాలకు చెందిన సర్పంచ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి సర్పంచులకు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.
VKB: రబీ సీజన్ వరి ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజేశ్వరి అధికారులకు ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లో వరి ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లకు 129 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
NGKL: కల్వకుర్తి పట్టణంలోని మోడల్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై స్వామి వివేకానంద సేవా బృందం ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. హాజరైన జిల్లా యువజన అధికారి కోట నాయక్ మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.
KNR: జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో కొనసాగుతున్న రైతు ప్రగతి ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం (FPO)కు 2025 సం. గాను NCDC భారత ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం “కోఆపరేటివ్ ఎక్సలెన్స్ & మెరిట్-2025″ అవార్డు లభించింది. ఈ అవార్డును HYDలోని TGCAB కార్యాలయంలో వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి చేతుల మీదుగా తీసుకున్నారు.