• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

రోడ్డు భద్రతా పనులపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

KMM: ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి నగరంలోని బైపాస్ రోడ్డు, కొత్త బస్టాండ్ వంటి ప్రాంతాలలో రోడ్డు భద్రతా పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో గుర్తించిన 30 బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదాల నివారణకు జీబ్రా క్రాసింగ్‌లు, సోలార్ బ్లింకర్స్, సైన్ బోర్డులను వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

February 26, 2026 / 07:13 AM IST

కలెక్టర్ కార్యాలయం ముందు జెండాలతో నిరసన

HNK: కుమ్మెర GPలోని జరిగిన కుల వివక్షత దాడిపై రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని PDSU నాయకులు నిన్న సాయంత్రం కలెక్టర్ కార్యాలయం ముందు నల్ల జెండాలతో నిరసన తెలియజేశారు. అనంతరం PDSU (C) మహేష్ మాట్లాడుతూ.. అభం శుభం తెలియని పశు గుడ్డును తొక్కి చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

February 26, 2026 / 07:12 AM IST

రుణాల లక్ష్యాలను మించి పనిచేయాలి: అదనపు కలెక్టర్

VKB: జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన బ్యాంకర్ల జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ సుధీర్ మాట్లాడుతూ.. బ్యాంకులు ప్రభుత్వ పథకాల అమలుకు ప్రాధాన్యతనిస్తూ నిర్దేశిత రుణ లక్ష్యాలను అధిగమించాలని సూచించారు. అర్హులైన నిరుపేదలు, స్వయం సహాయక సంఘాలు, చిన్న వ్యాపారులకు సులభంగా రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

February 26, 2026 / 07:12 AM IST

నిరుద్యోగులకు అలర్ట్.. లాస్ట్ డేట్ ఇదే..!

PDPL: రామగుండం ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో శిక్షకులుగా పనిచేయడానికి అర్హత గలవారు మార్చి 3లోగా అప్లై చేసుకోవాలని ప్రిన్సిపల్ సురేందర్ తెలిపారు. సీఎస్‌సి ఆపరేటర్, ఎలక్ట్రికల్ వెహికల్ సర్వీస్ టెక్నీషియన్, త్రీడీ ప్రింటింగ్ ఆపరేటర్, జూనియర్ ప్లంబర్ కోర్సులలో 3 నెలలు నైపుణ్య శిక్షణ ఇచ్చుటకు అర్హులైన అభ్యర్థులు పూర్తి బయోడేటాతో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.

February 26, 2026 / 07:08 AM IST

చేతివేళ్లు విరిగాయి.. అయిన పరీక్షకు..!

MDK: జిల్లాలో ‘స్టాలిన్’ మూవీ సీన్ రిపీట్ అయింది. చేతివేళ్లు విరిగినప్పటికీ ఓ విద్యార్థిని ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షకు హాజరైంది. రామాయంపేట జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న హర్షితకు ఇటీవల ప్రమాదంలో చేతి వేళ్లు విరగడంతో సర్జరీ జరిగింది. పరీక్ష రాసే వీలు లేకపోవడంతో, అధికారుల అనుమతి తీసుకొని మరో విద్యార్థి సహాయంతో బుధవారం పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది.

February 26, 2026 / 07:07 AM IST

9 నెలల గర్భిణిని హత్య చేసిన భర్త

NZB: ఇందల్వాయి మండలం గన్నారంలో 9 నెలల నిండు గర్భిణిని కట్టుకున్న భర్తే గొంతు నులిమి హత్య చేశాడు. డిచ్‌పల్లి సీఐ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. గన్నారం గ్రామానికి చెందిన నాగేశ్ పది సంవత్సరాల క్రితం సుమలత(31)ను పెళ్లి చేసుకున్నాడు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అనుమానంతో తరచూ నాగేశ్ భార్యతో గొడవ పడేవాడు. ఈ నెల 22న అర్ధరాత్రి భార్యను హత్య చేశాడు.

February 26, 2026 / 07:05 AM IST

మనూలో దరఖాస్తుల ఆహ్వానం

HYD: గచ్చిబౌలిలోని మనూలో బీఏ, బీఈడీ, బీఎస్సీ బీఈడీ, బీకామ్ బీఈడీ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్( NCET)లో వచ్చిన స్కోర్ల ఆధారంగా అడ్మిషన్లు ఇస్తామని మనూ అడ్మిషన్స్ డైరెక్టరేట్ డైరెక్టర్ ప్రొఫెసర్ వనజ తెలిపారు. ఆసక్తి ఉన్నవారు మార్చి 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు.

February 26, 2026 / 07:05 AM IST

కాలం చెల్లిన పదార్థాలు వాడొద్దు: కలెక్టర్

SDPT: విద్యార్థులకు అందించే భోజనం నాణ్యంగా ఉండాలని, రాజి పడొద్దని, కాలం చెల్లిన వస్తువులు వాడద్దని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సిద్దిపేట రూరల్ మండలం కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని మధ్యాహ్నం భోజన సమయంలో సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్ వెరిఫై చేసి పొంతన లేకుండా ఉండటంతో ఎసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్యలు తీసుకోవాలన్నారు.

February 26, 2026 / 07:04 AM IST

ఎస్పీని కలిసిన మజ్లిస్ జిల్లా కార్యదర్శి

KMR: బాన్సువాడలో ఇటీవల చోటుచేసుకున్న సామాజిక ఉద్రిక్తతలకు సంబంధించి నమోదైన కేసులను పునఃసమీక్షించాలని AIMIM జిల్లా కార్యదర్శి సయ్యద్ ఖాన్ కోరారు.  SP రాజేష్ చంద్రను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ ఘటనలో అనేక మంది నిరపరాధులు, మైనర్లు కేసుల్లో ఇరుక్నుని అరెస్టు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారిని విడుదల చేయాలన్నారు.

February 26, 2026 / 07:02 AM IST

సోనియాగాంధీని కలిసిన Dy.CM భట్టి విక్రమార్క

KMM: Dy.CM భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో కలిసి సీపీపీ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 5న హైదరాబాద్‌లో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహానికి విచ్చేసి ఆశీర్వదించాలని కోరుతూ వివాహ పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు.

February 26, 2026 / 07:01 AM IST

ఆత్మకూరులో ఇంటర్ పరీక్షలకు 8 మంది గైర్హాజరు

WNP: ఆత్మకూరు మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షలకు 8 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సైదులు తెలిపారు. మండలంలో రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 304 మందికి గాను 296 మంది పరీక్షలకు హాజరయ్యారు.

February 26, 2026 / 07:01 AM IST

వేములవాడలో శివ కళ్యాణ మహోత్సవం ఎప్పుడంటే..?

SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో మార్చి 6వ తేదీన పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు 5 రోజుల పాటు నిర్వహించనున్న ఉత్సవాల భాగంగా రెండవ రోజు పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి కళ్యాణం నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. 1వ తేదీ ఆదివారం సాయంత్రం కామదహహనం, ఉంటుందన్నారు.

February 26, 2026 / 07:00 AM IST

కెనాల్లో గుర్తుతెలియని మృతదేహం

KNR: చొప్పదండి మండల పెద్ద కురుమపల్లి గ్రామ శివారు ప్రాంతంలోని జంగముని కుంట పక్కన ఎస్సారెస్పీ కెనాల్లో బుధవార గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని ఎస్సై నరేష్ రెడ్డి తెలిపారు. వయసు సుమారు 40-50 సంవత్సరాలు, ఎత్తు సుమారు 5 అడుగుల 6 అంగుళాలు ఉంటుందని, డెడ్ బాడీ గుర్తు తెలియని విధంగా ఉందన్నారు.

February 26, 2026 / 07:00 AM IST

ఈఎస్ఐ ఆసుపత్రిని సందర్శించిన ఎంపీ, కలెక్టర్

WGL: నగరంలోని ESI ను నిన్న సాయంత్రం వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, జిల్లా కలెక్టర్ డా. సత్య శారద సందర్శించారు. ఆసుపత్రిలోని అవుట్‌పేషెంట్ విభాగం, ఇన్‌పేషెంట్ వార్డులు, ల్యాబ్ సేవలు, మందుల నిల్వలు, వైద్య సిబ్బంది పనితీరును పరిశీలించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ… ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.

February 26, 2026 / 06:54 AM IST

అక్రమ ఇసుక రవాణాపై దాడి..

JN: రఘునాథపల్లి మండలంలోని శివాజీనగర్ శివారులో గురువారం ఉదయం అనుమతులు లేకుండా ఆకేరు వాగు నుంచి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం వాహనాన్ని స్వాధీనం చేసుకుని డ్రైవర్ పులి రాజు అలియాస్ రంజిత్ (25), యజమాని బంధువు చిరంజీవి (41)లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు.

February 26, 2026 / 06:52 AM IST