SRD: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు ముఖం చాటేస్తున్నాడని బాధితురాలు అమీన్పూర్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగింది. పోలీసుల కథనం ప్రకారం.. అమీన్పూర్‌కు చెందిన యువతికి, మయూరినగర్ నివాసి అరవింద్‌కు జిమ్లో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. యువతి వివాహం చేసుకోవాలని కోరగా అతను నిరాకరించి దూరం పెడుతున్నాడని, తనకు న్యాయం చేయాలని ఆమె పోలీసులను ఆశ్రయించింది.
KMM: అమరవీరుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు రాము, వెంకట్రామయ్య అన్నారు. బుధవారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఖమ్మం పాత బస్టాండ్ వద్ద అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు అమరవీరులకు నివాళులర్పించారు. మాదిగల హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పోరాడాలని పేర్కొన్నారు.
NRPT: జిల్లాలో రైతుల ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ 65.03 శాతం పూర్తయ్యింది. మొత్తం 1,84,713 మంది పట్టాదారుల్లో 1,20,120 మంది ఇప్పటికే నమోదు చేసుకోగా, ఇంకా 64,593 మంది రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా 13 మండలాల్లో 4,59,000 ఎకరాల భూమి ఉండగా, అందులో 4,25,000 ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉన్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు.
BDK: అశ్వాపురం మండలం మల్లెలమడుగులో నిమ్స్ హాస్పిటల్ భద్రాచలం వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని ప్రముఖ వైద్యులు డాక్టర్ మోహన్ రావు, మల్లెల మడుగుమడుగు సర్పంచ్ మచ్చా నరసింహారావు ప్రారంభించారు. ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వారితోపాటు మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి ఉన్నారు.
MHBD: మరిపెడ మండలం నీలికుర్తి శివారు భజన తండాలో రైతులు వ్యవసాయ భూములకు వెళ్లే దారిని సత్తిరెడ్డి అనే భూస్వామి అక్రమించారని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దారికి అడ్డంగా కందకం తవ్వి రైతుల రాకపోకలను నిలిపివేశారని ఆరోపించారు. దీంతో రైతులు వ్యవసాయ భూములకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. వెంటనే అధికారం స్పందించాలన్నారు.
మహబూబ్‌నగర్ MVS డిగ్రీ కళాశాలలోని డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ విద్యార్థులకు ఈ నెల 4 నుంచి 3వ సెమిస్టర్ సైన్స్, కంప్యూటర్స్ ప్రయోగ తరగతులు ప్రారంభం కానున్నాయి. 80 శాతం హాజరు ఉన్న వారినే అనుమతిస్తామని ప్రిన్సిపల్ డా. కే. పద్మావతి తెలిపారు. ఇతర వివరాలకు 7382929609 నంబర్ సంప్రదించాలని కోఆర్డినేటర్ సత్యనారాయణ గౌడ్ సూచించారు.
HNK: ఎస్సీ వర్గీకరణ పోరులో అసువులు బాసిన మాదిగ అమరవీరులకు ముల్కనూర్ అంబేద్కర్ కూడలి వద్ద ఎమ్మార్పీఎస్, ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల నేతలు నివాళులర్పించారు. మాదిగ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని, మాదిగ అమరవీరుల ఆశయసాధనకు ప్రతి ఒక్కరం కృషి చేద్దామని ఎమ్మార్పీఎస్ నేతలు పిలుపునిచ్చారు.
BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయం ఈనెల 3న సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 7:00 వరకు నిత్య కైంకర్యాలు నిర్వహించి, ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో భవాని శంకర్ తెలిపారు. మరుసటి రోజు 4న ఉదయం 3:30 నుంచి సంప్రోక్షణ నిర్వహించి నిత్య కైంకార్యాలు యధావిధిగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే హోలీ ఉత్సవం ముందు రోజు నిర్వహిస్తున్నారు.
MLG: వెంకటాపూర్ రామానుజాపూర్లో ఇవాళ నూతన డ్రైనేజీ పనుల ప్రారంభోత్సవం జరిగింది. రాష్ట్ర మంత్రి సీతక్క, DCC జిల్లా అధ్యక్షులు అశోక్ సూచనల మేరకు పంచాయతీరాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజా ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.
SDPT: మాదిగ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఆదివారం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు బెజ్జంకి మండల శాఖ ఆధ్వర్యంలో అంబేడ్కర్ కూడలిలో కార్యక్రమం నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ సాధన కోసం ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన మాదిగ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి చిత్రపటాలకు పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు.
వరంగల్ ట్రైసిటీలోని చికెన్ షాపుల వ్యర్థాల సేకరణ, తరలింపు వ్యవహారాల్లో సిండికేట్ దందా కొనసాగుతోందని సమాచారం. HNKకు చెందిన ఓ లీడర్ ఈ సిండికేట్‌కు బాస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 3 వేల చికెన్ షాపుల నుంచి రోజుకు లక్షన్నర KGల వ్యర్థాలను సేకరించి, చేపల దాణాగా APకి తరలిస్తున్నారు. తక్కువ ధరకు టెండర్లు దక్కించుకుని ఎక్కువ లాభాలు పొందుతున్నట్లు సమాచారం
BHPL: గీసుకొండ మండలం కొమ్మాలలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర హోలీ సందర్భంగా ఏటా వైభవంగా జరుగుతుంది. వివిధ గ్రామాల నుంచి ప్రభ బండ్లతో భక్తులు తరలివస్తారు. గిరిజనులు పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవడం, స్వామివారికి ఎడ్లు-మేకలు కానుకగా ఇవ్వడం ఆనవాయితీ. గతేడాది జాతర రాజకీయ ప్రదర్శనలతో హోరెత్తింది. జాతరకు 2 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.
BDK: వేసవికాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ఆలయానికి పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కలిగించేందుకు ఆలయం పరిసర ప్రాంతంలో ఉచిత మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని ఆదివారం ఈవో దామోదర్ రావు ప్రారంభించారు.
KMM: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచంద్రరావు ఖమ్మం చేరుకున్నారు. ఆయనకు పార్టీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు, జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు కార్యకర్తలు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం భారతరత్న మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. అక్కడి నుంచి భూదాన్ భూముల బాధితులను పరామర్శించనున్నారు.
MNCL: మందమర్రి చెరువు కట్టపై వాకింగ్ ట్రాక్, మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటుకు రూ. కోటి నిధులు మంజూరు చేసిన మంత్రి వివేక్‌కి వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బండి సదానంద్ కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం మాట్లాడుతూ గతంలో చెరువు కట్టను పరిశీలించిన మంత్రి అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం సంతోషంగా ఉందన్నారు. వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.