MNCL: రాయితీపై అందించే డ్రోన్ల కోసం రైతులు దరఖాస్తు చేసుకోవాలని DAO సురేఖ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు 10 వ్యవసాయ డ్రోన్లు కేటాయించారని, ఇందులో మంచిర్యాల, చెన్నూర్ డివిజన్లకు 3, బెల్లంపల్లి, భీమిని డివిజన్లకు 2 చొప్పున కేటాయించామని పేర్కొన్నారు. యంత్ర పరికరాలకు వ్యక్తిగతంగా రైతులు దరఖాస్తు చేసుకునే విధంగా ADAలు, AO లు చర్యలు తీసుకోవాలన్నారు.
HYD: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రేపు HYDకు రానున్నారు. ఇక్కడి నుంచి వికారాబాద్ జిల్లా అనంతగిరిలో జరుగుతున్న DCCల శిక్షణ కార్యక్రమంలో వారితో మాట్లాడనున్నారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై నాయకులకు దిశనిర్దేశం చేయనున్నారు. మరోవైపు రాహుల్ పర్యటన దృష్ట్యా కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేస్తోంది.
కరీంనగర్: హైదరాబాద్ బోయినపల్లిలోని వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో 2026-27 విద్యా సంవత్సరానికి 5 తరగతిలో ప్రవేశాలకు గిరిజన బాలబాలికల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి దివాకర్ రావు తెలిపారు. దీంతో పాటు పలు తరగతులలో ఖాళీగా ఉన్న 21 సీట్లను సైతం భర్తీ చేస్తామన్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 12లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
మహబూబాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ సమక్షంలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. లంబాడీల ఆరాధ్యదైవం సంతులాల్ అని, లంబాడీల్లో జ్ఞానజ్యోతిని వెలిగించిన మహనీయుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జ్యోతి పాల్గొన్నారు.
నల్గొండ జిల్లా మాడుగుల పల్లి మండలం టోల్ ప్లాజా వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లను నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు మిర్యాలగూడ రూలర్ సీఐ పీఎన్‌డీ ప్రసాద్ ఆధ్వర్యంలో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
MDCL: ఉప్పల్ నుంచి చిలుకా నగర్ వెళ్లే మార్గంలో కావేరి నగర్ కామన్ వద్ద పైప్ లైన్ తవ్వకాల్లో భాగంగా మంచినీటి పైప్ లైన్ లీకేజీ జరిగిందని వచ్చిన కథనాలు, స్థానిక కాలనీల ప్రజల ఫిర్యాదులతో జీహెచ్ఎంసీ యంత్రంగా స్పందించింది. వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందజేసి పైప్ లైన్ లీకేజీని అరికట్టినట్లుగా తెలిపారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా పనులు చేస్తామన్నారు.
JGL: ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్‌లో హైందవ స్వరాజ్య సేన ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కనక నగేశ్, హైందవ స్వరాజ్య సేన సభ్యులు గన్నారపు వంశీ, బత్తుల శ్రీనివాస్, మహేందర్, రాజేందర్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
SRD: సిర్గాపూర్ మండలం వంగదాల్‌కు చెందిన సుభాష్ (35) సూసైడ్ చేసుకున్నాడని ఎస్సై మహేష్ నేడు తెలిపారు. సుభాష్ తన సోదరుడు ఇంట్లో ఉంటున్నాడు. ఇంటి నిర్మాణం కోసం సోదరుడు ఇంట్లో ఉంచిన డబ్బు, బంగారం కనిపించలేదు. ఈ నేరం తనపైనే వస్తుందని అనుమానంతో సుభాష్ గ్రామ శివారులో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన భార్య భారతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
GDWL: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సూచించారు. శనివారం ఆయన ఇటిక్యాల మండలం వావిలాలకు నిన్న లిఖిత ఆపరేషన్ కోసం కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల విలువగల LOC ను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అలంపూర్ నియోజకవర్గ ప్రజల సంక్షేమం కొరకు నిరంతరం కృషి చేస్తామని ఆయన అన్నారు.
KMM: వెలుగుమట్ల భూదాన్ భూముల నిర్వాసితుల సర్వేలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు కోసం కలెక్టర్ అనుదీప్ ఆధ్వర్యంలో 22 మంది తహశీల్దార్లు విచారణ చేపట్టారు. మొత్తం 600 మందిలో కేవలం 180 మందే స్థానికులు కాగా, మిగిలిన 420 కుటుంబాలు కొంతమంది ఇతర జిల్లాలు, మరికొంత మంది ఏపీకి చెందినవారని తేలింది.
ADB: జంధాపూర్ గ్రామ ప్రజల చిరకాల కోరికైన స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటుపై జిల్లా కలెక్టర్ రాజర్షి షాకు వినతిపత్రం సమర్పించారు. గ్రామ ప్రధాన రహదారిపై వాహనాలు అతివేగంగా వెళ్తుండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించి వేగ నియంత్రకాలు ఏర్పాటు చేసి ప్రాణనష్టం జరగకుండా చూడాలన్నారు.
HYD: తార్నాక, నారాయణగూడ ప్రాంతాల్లో న్యాచురల్ గ్యాస్ కోసం కార్ల క్యూ లైన్‌లు కనిపించాయి. సీఎన్‌జీ బంకుల వద్ద వాహనదారులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. సరఫరా లోపం కారణంగా వాహనాలు పెద్ద ఎత్తున వరుసగా నిలిచిపోయాయి. ఉద్యోగాలు, కార్యాలయాలకు వెళ్లే వారికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. అధికారులు సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలన్నారు.
NRPT: ఈనెల 3న మంగళవారం హోలీ పండుగను నిర్వహించుకోవాలని విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ నాయకులు అనిల్ కుమార్ రెడ్డి, కానుగంటి వెంకటేష్, కుమ్మరి రాజులు తెలిపారు. సోమవారం రాత్రి కామ దహనాన్ని నిర్వహించి మంగళవారం హిందూ సోదరులు హోలీ పండుగను ప్రకృతి సిద్ధమైన రంగులతో నిర్వహించుకోవాలని కోరారు.
BHPL: ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష(AISSEE) ఫలితాల్లో చిట్యాల మండలం బౌసింగ్ పల్లికి చెందిన చిందం గౌతమ్ సత్తా చాటారు. 9వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ జాతీయ స్థాయి పరీక్షలో గౌతమ్ రికార్డు స్థాయి ర్యాంకులతో జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. జిల్లా స్థాయిలో మొదటి ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంక్ సాదించాడు.
HYDలోని పలు ప్రాంతాల్లో కలుషిత నీటి సరఫరా కలకలం రేపుతోంది. బాగ్‌లింగంపల్లి, సుందరయ్య విజ్ఞాన కేంద్రం,సైబర్ హుడ్ కాలనీ వంటి చోట్ల తాగునీటిలో డ్రైనేజీనీరు కలిసి వస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్యాపుల్లో మురుగు వాసనతో కూడిన నల్లటి నీరు వస్తుండటంతో ప్రజలు రోగాలబారిన పడే ప్రమాదం ఉందని ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించాలని కోరారు.