• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

జుక్కల్ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్ష

KMR: జుక్కల్‌ సమగ్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై MLA లక్ష్మీకాంతారావు గురువారం సమీక్షించారు. జిల్లా కలెక్టరేట్‌ ఛాంబర్‌లో కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్, అదనపు కలెక్టర్‌ విక్టర్‌తో కలిసి వివిధ శాఖల పురోగతిపై చర్చించారు. ముఖ్యంగా వైద్యం, గృహ నిర్మాణం, సాగునీరు, అటవీ, పర్యాటక రంగాల్లో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

February 26, 2026 / 08:33 PM IST

కాలువలో పడి యువకుడి మృతి

KNR: హుజురాబాద్ పట్టణంలోని వరంగల్ రోడ్డులో గల కాకతీయ కాలువలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. కాలువలో మృతదేహం కొట్టుకుపోతుండగా గుర్తించిన పోలీసులు, HNKలోని ఎల్కతుర్తి శివారులో దానిని బయటకు తీశారు. మృతుడు హుజురాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లికి చెందిన పల్లకొండ గణేష్‌గా గుర్తించారు. ప్రమాదవశాత్తు నీటిలో పడ్డాడా లేదా, ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

February 26, 2026 / 08:30 PM IST

బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పరిశీలించారు. గోదావరి తీర ప్రాంతం, దేవాలయ ప్రాంగణం, కళ్యాణ మండపం, కోనేరు ప్రాంతాల్లో జరుగుతున్న పనులను సమీక్షించారు. మిగిలిన పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు.

February 26, 2026 / 08:30 PM IST

ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి: SP

ADB: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని SP అఖిల్ మహాజన్ తెలిపారు. గురువారం పట్టణంలోని జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో ఖాకీ కిడ్స్ ద్వారా సైబర్ క్రైమ్, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో గంజాయి లేకుండా, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని SP అఖిల్ మహాజన్ సూచించారు.

February 26, 2026 / 08:30 PM IST

యూరియా కొరత సమస్యపై న్యాయ పోరాటం

KMR: యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులపై నాగిరెడ్డిపేట మాజీ జడ్పీటీసీ మనోహర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ విధానాన్ని రద్దు చేసి, యూరియాను ప్రత్యక్షంగా సరఫరా చేయాలని కోరుతూ న్యాయ పోరాటం చేసేందుకు ఆయన ఫోరం సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ సమస్యపై సీనియర్ న్యాయవాది రచనరెడ్డితో చర్చించి, ఆన్‌లైన్ విధానంలోని సాంకేతిక లోపాలు, నెట్వర్క్ సమస్యల గురించి వివరించారు.

February 26, 2026 / 08:29 PM IST

మహాత్మాగాంధీ రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ అంజిరెడ్డి

న‌ల్గొండ‌లోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ కొప్పుల అంజిరెడ్డి నియ‌మితుల‌య్యారు. వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తా హుస్సేన్ గురువారం నియామక పత్రం అందజేశారు. అంజిరెడ్డి ప్రస్తుతం యూనివర్సిటీలో సోషల్ సైన్స్ విభాగం డీన్‌గా, ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నారు.

February 26, 2026 / 08:29 PM IST

కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరిక

SRPT: కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఆకర్షితులయే పార్టీలో చేరికలు మొదలయ్యాయని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. గురువారం కోదాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మోతే మండలానికి చెందిన పలువురు పార్టీలో చేరగా, వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

February 26, 2026 / 08:26 PM IST

ఆశ్రమ పాఠశాల విద్యార్థికి సర్పంచ్ రక్తదానం

ASF: వాంకిడి మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న గిరిజాబాయికి అత్యవసరంగా A+ రక్తం అవసరమైంది. విషయం తెలిసిన వెంటనే వాంకిడి సర్పంచ్ చూనార్కర్ సతీశ్ స్పందించారు. సమాజ సేవలో భాగంగా ఆసిఫాబాద్ రక్తనిధి కేంద్రానికి వెళ్లి గురువారం రక్తదానం చేశారు. కాగా రక్తదానం చేసిన సర్పంచ్ సేవాభావాన్ని గ్రామస్థులు అభినందించారు.

February 26, 2026 / 08:22 PM IST

చోరీలకు పాల్పడిన నిందితుడు అరెస్ట్

MNCL: మందమర్రిలోని యాపల్‌ ప్రాంతంలో గత నెల 30న సెగ్గం మధు, దుర్గం నాగలక్ష్మి ఇళ్లలో వరుస చోరీలకు పాల్పడిన జాడి అభిరామ్ ను గురువారం అరెస్ట్ చేసినట్లు ఎస్సై జి. నరేష్ తెలిపారు. స్థానిక సీఈఆర్ క్లబ్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుడి వద్ద నుండి 14.4 గ్రాముల బంగారం, 14 తులాల వెండి పట్టీలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

February 26, 2026 / 08:22 PM IST

“ప్రాధాన్యత రంగాలకు రుణాలు మంజూరు చేయడమే లక్ష్యం”

BHPL: జిల్లా ఐడీవోసీ కార్యాలయంలో లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో MLA గండ్ర, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రాధాన్యత రంగాలకు 2971.20 కోట్ల రుణాలు మంజూరు చేయడం లక్ష్యమని, డిసెంబర్ నాటికి 1937.21 కోట్లు అందించినట్లు MLA గండ్ర తెలిపారు. లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లకు సూచించారు.

February 26, 2026 / 08:22 PM IST

మున్సిపల్ ఛైర్మన్‌కు జర్నలిస్టుల సన్మానం

PDPL: మంథని మున్సిపాలిటీలో అవినీతి రహిత పాలన అందిస్తామని, పట్టణ అభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలని మున్సిపల్ ఛైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్, వైస్ ఛైర్మన్ ముసుకుల సహేందర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం మంథని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌లను జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు.

February 26, 2026 / 08:21 PM IST

రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం

SRCL: ఇల్లంతకుంట మండలం అనంతారంలో ఎస్సై సిరిసిల్ల అశోక్ ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం ప్రాణాపాయానికి దారి తీస్తుందని ఆయన హెచ్చరించారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం, ట్రాఫిక్ నిబంధనల పాటింపు తప్పనిసరి అన్నారు. ట్రిపుల్ రైడింగ్, అతివేగం, మైనర్లకు వాహనాలు ఇవ్వడం ప్రమాదాలకు కారణమన్నారు.

February 26, 2026 / 08:20 PM IST

కన్మనూర్ ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం

NRPT: మంత్రి డా.వాకిటి శ్రీహరి, డీసీసీ అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు కన్మనూర్ గ్రామంలో పలువురి ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం నిర్వహించారు. ఇల్లు లేని వారికి కోరిక నెరవేరినందుకు సంతోషంగా ఉన్నారని నాయకులు తెలిపారు. అర్హులైన వారికి పార్టీలకు అతీతంగా మంజూరు చేస్తామని తెలిపారు.

February 26, 2026 / 08:17 PM IST

ముగ్గురు కమిషనర్లు.. ఎక్కడికక్కడ పర్యటన..!

HYD: జీహెచ్ఎంసీ పరిధి మూడు భాగాలుగా విభజించబడిన తర్వాత పరిపాలన వేగం పెరిగింది. మల్కాజ్‌గిరి కార్పొరేషన్ కమిషనర్ కృష్ణారెడ్డి, సైబరాబాద్ కార్పొరేషన్ కమిషనర్ సృజన, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వరుస పర్యటనలు చేపడుతున్నారు. నగరంలోని సమస్యలపై క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేస్తూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు.

February 26, 2026 / 08:15 PM IST

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ

NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీలోని 3, 12 వార్డులలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు గురువారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బృంగి ఆనంద్ కుమార్ భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో ఇల్లు లేని నిరుపేదలకు మంజూరు చేయిస్తామని తెలిపారు.

February 26, 2026 / 08:14 PM IST