• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

పసుపు రైతులకు ముఖ్య గమనిక

NZB: అకాల వర్షాల కారణంగా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు పసుపు రైతులకు పలు సూచనలు చేశారు. మంగళవారం పసుపు వ్యాపార లావాదేవీలు మూసివేయనున్నట్లు తెలిపారు. యార్డులో సరైన స్థలం లేకపోవడంతో మంగళవారం పసుపు రైతులు ఎవరూ తీసుకురావద్దని సూచించారు. బుధవారం నుంచి కనుగోళ్లు యథావిధిగా ఉంటాయన్నారు.

February 24, 2026 / 08:27 AM IST

రాష్ట్రస్థాయి వాలీబాల్‌లో రన్నర్స్‌గా జిల్లా జట్టు

KMR: సీఎం కప్ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో కామారెడ్డి జిల్లా జట్టు రన్నర్స్‌గా నిలిచింది. బీబీపేట్ మండలం తుజాల్‌పూర్‌కు చెందిన సుంకరి విష్ణు తేజగౌడ్ అద్భుత ప్రదర్శన చేశారు. రాష్ట్రస్థాయి పోటీల్లో రెండో బహుమతి సాధించిన జట్టును గ్రామస్తులు, స్నేహితులు అభినందనలు తెలిపారు. ఈ విజయం యువ క్రీడాకారులకు ప్రేరణగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.

February 24, 2026 / 08:26 AM IST

ధర్వేశిపురంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దివ్యదర్శనం

NLG: కనగల్ మండలం ధర్వేశిపురంలో స్వయంభుగా వెలసిన శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారు మంగళవారం భక్తులకు దివ్యదర్శనం ఇచ్చారు. ఆలయ పూజారి నాగోజు మల్లాచారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, మంగళహారతులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను అందజేశారు.

February 24, 2026 / 08:25 AM IST

జిల్లా లో మూడు రోజుల పాటు మిషన్ భగీరథ నీటి నిలిపివేత

SRPT: ఇమాంపేట శుద్ధి కేంద్రంలో అత్యవసర మరమ్మతుల దృష్ట్యా ఫిబ్రవరి 24 ఉదయం నుండి 27వ తేదీ వరకు సూర్యాపేట, కోదాడ మున్సిపాలిటీలు చిలుకూరు, కోదాడ, అనంతగిరి, మునగాల, నడిగూడెం, పెన్పహాడ్ మండలాల్లో నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు నీటిని నిల్వ చేసుకుని, పొదుపుగా వాడుకోవాలని మిషన్ భగీరథ EE విజ్ఞప్తి చేశారు.

February 24, 2026 / 08:17 AM IST

ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్

WGL: కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదు స్వీకరించినట్లు వెల్లడించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజావాణి ఫిర్యాదులపై జిల్లా ఉన్నత అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని అధికారుల ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు.

February 24, 2026 / 08:13 AM IST

విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేసిన మున్సిపల్ కమిషనర్

KMM: ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య చొరవతో చిమ్మపూడి ప్రభుత్వ పాఠశాలకు చెందిన 200 మంది విద్యార్థులకు ఉచితంగా పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు అందించే చిన్న ప్రోత్సాహం వారి పెద్ద కలలను నిజం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు.

February 24, 2026 / 08:12 AM IST

మార్చి 1 నుంచి ‘ఖేల్ మహోత్సవ్

KNR: క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు మార్చి 1 నుంచి 7 వరకు ‘సంసద్ ఖేల్ మహోత్సవ్’ నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. మార్చి 1-3 తేదీల్లో అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ప్రాథమిక పోటీలు, 5-7 తేదీల్లో KNR కేంద్రంలో ఫైనల్స్ ఉంటాయన్నారు. ఆసక్తి గల వారు ఈ నెల 25 నుంచి 27 వరకు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.

February 24, 2026 / 08:12 AM IST

జిల్లాలో ఇంటర్ పరీక్షలకు అంతా సిద్ధం

VKB: జిల్లాలో రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా నోడల్ అధికారి శంకర్ నాయక్ తెలిపారు. నిన్న జిల్లాలోని పరీక్షా కేంద్రాలను ఆయన స్వయంగా పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 28 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.

February 24, 2026 / 08:12 AM IST

సీసీ రోడ్డు మరమ్మతులు చేయించిన కౌన్సిలర్

BHNG: భువనగిరి 28వ వార్డు మీనానగర్లో దెబ్బతిన్న రోడ్డుకు కౌన్సిలర్ సూదగాని సరిత రాజు సొంత నిధులతో మరమ్మతులు చేయించారు. వినూత్న హాస్పిటల్ నుంచి కేజేఆర్ టాకీస్ వరకు రహదారి శిథిలావస్థకు చేరి వాహనదారులు నెలలుగా ఇబ్బంది పడుతున్నారు. అధికారుల నిధుల కోసం వేచి చూడకుండా, ప్రజా సౌకర్యార్థం ఆమె తక్షణ చర్యలు చేపట్టారు. ఈ చొరవ పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు

February 24, 2026 / 08:10 AM IST

ఖమ్మంలో నేటి కూరగాయల ధరలు ఇలా..

ఖమ్మం ఇంటిగ్రేటెడ్ రైతు మార్కెట్‌లో మంగళవారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. KG టమాటా రూ.16, వంకాయ రూ.26, బెండకాయ రూ.40, పచ్చిమిర్చి రూ.46, కాకర రూ.36, బీరకాయ రూ.36, సొరకాయ రూ.16, దొండకాయ రూ.36, క్యాబేజీ రూ.20, ఆలుగడ్డ రూ.22, చామగడ్డ రూ.46, క్యారెట్ రూ.26, కీరదోస రూ.36, బీన్స్ రూ.56, క్యాప్సికం రూ.56, ఉల్లిగడ్డలు రూ.25, కోడిగుడ్లు(12) రూ.75గా ఉన్నాయి.

February 24, 2026 / 08:10 AM IST

ప్రభుత్వ సలహాదారుడుని కలిసిన నూతన మున్సిపల్ ఛైర్‌పర్సన్

NZB: బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డిని ఆర్మూర్ మున్సిపల్ నూతన ఛైర్పర్సన్ గోనే లహరి రఘు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 26న జరగనున్న ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరుకావాలని ఆమె ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ వినయ్ రెడ్డి, వైస్ ఛైర్మన్ కాటిపల్లి వెంకట్ రెడ్డి ఉన్నారు.

February 24, 2026 / 08:10 AM IST

నేడు హుజూర్నగర్లో మంత్రి ఉత్తమ్ పర్యటన

SRPT: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవ్వాళ హుజూర్నగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుంచి బయలుదేరి 9 గంటలకు హుజూర్‌నగర్ చేరుకుని రామస్వామి గుట్ట వద్ద నిర్మాణంలో ఉన్న హౌజింగ్ కాలనీని పరిశీలించనున్నారు. అనంతరం చింతలపాలెం మండలం దొండపాడు, పాలకవీడు మండలం జాన్పహాడ్లోని లిఫ్ట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

February 24, 2026 / 08:07 AM IST

నేడు వీడనున్న ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ!

HYD: ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై నేడు హైకోర్టులో జరుగనున్న విచారణకు ఎన్నికల కమిషన్ హాజరు కానున్నది. దీంతో ఎన్నిక ఎప్పుడు నిర్వహించాలనే అంశం నేడు తేలనున్నది. ఇప్పటికే తాను ఛైర్మన్‌గా ఎన్నికైనందున వెంటనే తనను ఛైర్మన్‌గా ప్రకటించాలని ఇప్పటికే సుదర్శన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

February 24, 2026 / 08:04 AM IST

వృద్ధుడి ఆత్మహత్య

JGL: పెగడపల్లి మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన రాచకొండ ధర్మయ్య అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై కిరణ్ కుమార్ పేర్కొన్నారు. ధర్మయ్య కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ.. దవాఖానలో చికిత్స చేయించుకున్నట్లు తెలిపారు. అయినప్పటికీ వ్యాధి నయం కాకపోవడంతో సోమవారం ఇంట్లోనే దూలానికి ఊరు వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు

February 24, 2026 / 08:04 AM IST

రాష్ట్రంలో హిందువులకు రక్షణ లేదు: బ్రహ్మానంద్

ADB: తెలంగాణ రాష్ట్రంలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగి బ్రహ్మానంద్ అన్నారు. బాన్స్ వాడలో హిందువులపై జరిగిన దాడిని ఖండిస్తూ పట్టణంలో నిన్న నిరసన కార్యక్రమం చేపట్టారు. రానున్న రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

February 24, 2026 / 08:03 AM IST