• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో వసతుల లేమి..!

NZB: ధర్పల్లి మడల కేంద్రంలో పంపిణీ చేసిన 48 డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మౌలిక వసతుల కొరత వేధిస్తోంది. రెండు నెలల క్రితం ఇళ్లు కేటాయించగా, ఇటీవల గృహప్రవేశం చేసిన లబ్ధిదారులకు తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోందని, అధికారులు వెంటనే స్పందించి వసతులు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

February 21, 2026 / 12:15 PM IST

మీడియా అక్రిడేషన్ కమిటీ ఏర్పాటుకు చర్యలు: కలెక్టర్

MDK: జిల్లాలోని మీడియా ప్రతినిధులకు 2026-28 సంవత్సరాలకు కొత్త అక్రిడిటేషన్‌ల జారీ కోసం నూతన జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ (DMAC) ఏర్పాటుకు చర్యలు ప్రారంభించినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సంఘాలు తమ ప్రతినిధి పేరును లెటర్ ప్యాడ్‌పై రాసి ఈనెల 23న ఉదయం 11 గంటలలోపు అందజేయాలని సూచించారు.

February 21, 2026 / 12:14 PM IST

వ్యవసాయ బావిలో మృతదేహం లభ్యం

JGL: కోరుట్ల పట్టణ శివారు డీ- 40 కెనాల్ సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో ఓ మృతదేహం లభించింది. ఆ మృతదేహం మేడిపల్లి మండలం కంట్లకుంట గ్రామానికి చెందిన గుండంపల్లి శంకర్‌గా పోలీసులు గుర్తించారు. కాగా శంకర్ ఈ నెల 13న మెట్‌పల్లిలో అత్తగారింటికి వెళ్తానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరి రాలేదని, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చిరంజీవి తెలిపారు.

February 21, 2026 / 12:11 PM IST

అగ్రికల్చర్ జేడీ నివాసంలో ఏసీబీ దాడులు

SRPT: గరిడేపల్లి మండలం పొనుగోడులో ఇవాళ అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ సుందర్ కిరణ్ కుమార్ (మాజీ DRDA PD) నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో ఆయన స్వగృహం, కార్యాలయాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.

February 21, 2026 / 12:10 PM IST

DDU-GKYలో ఉచిత నర్సింగ్ శిక్షణ

మహబూబ్ నగర్లో DDU-GKY & స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ద్వారా నిరుద్యోగ యువతులకు నర్సింగ్ అసిస్టెంట్ కోర్సులో ఉచిత శిక్షణ అందిస్తున్నారని కో-ఆర్డినేటర్ రవికుమార్ తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులు. ఎంపికైన వారికి ఉచిత శిక్షణ, వసతి, భోజన సదుపాయం కల్పిస్తారు. దరఖాస్తులు ఈ నెల 23వ తేదీకి ముందే చేయాలని, 9949698592లో సంప్రదించాలని ఆయన సూచించారు.

February 21, 2026 / 12:09 PM IST

హోలీ పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లు

HNK: హోలీ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలు సర్వీసులను ప్రకటించింది. కాజీపేట జంక్షన్ మీదుగా చర్లపల్లి-దానాపూర్ మార్గంలో మొత్తం 12 ప్రత్యేక రైళ్లను ఫిబ్రవరి 23, 25, 27, 28, మార్చి 1, 3, 5, 7, 9వ తేదీల్లో నడవనున్నాయి. ఈ రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ ఉన్నాయి.

February 21, 2026 / 12:05 PM IST

మహిళా సమాఖ్య భవనానికి MLA శంకుస్థాపన

ASF: బెజ్జూర్ మండలం రెబ్బెనలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద ‌రూ.10 లక్షల అంచనాతో మంజూరైన మహిళా సమాఖ్య భవనానికి MLA హరీష్ బాబు శనివారం శంకుస్థాపన చేశారు. MLA మాట్లాడుతూ.. ప్రతి గ్రామపంచాయతీకి మహిళా సమాఖ్య భవనం, ప్రతి మండలంలో రూ.30 లక్షల అంచనాతో గిడ్డంగి నిర్మాణం చేపట్టనున్నామని తెలిపారు. సర్పంచ్ నందిపేట రాజయ్య, మహిళా సమాఖ్య సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

February 21, 2026 / 12:02 PM IST

మున్సిపల్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన బండారి అనూష

ADB: ఆదిలాబాద్ మున్సిపల్ ఛైర్మన్‌గా బండారి అనూష శనివారం ఆమె కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. మొదటగా వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆమెకు ఆశీర్వచనాలు అందజేశారు. బాధ్యతలు చేపట్టిన ఆమెకు వైస్ ఛైర్మన్ రోహిత్, కాంగ్రెస్ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి, గండ్రత్ సుజాత శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

February 21, 2026 / 11:59 AM IST

హుజూర్ నగర్‌లో జాతీయ జెండా దిమ్మె ధ్వంసం..!

SRPT: హుజూర్ నగర్ పట్టణంలోని స్థానిక మండల ప్రజా పరిషత్ (MPP) కార్యాలయ ఆవరణలోని జాతీయ జెండా దిమ్మెను గుర్తుతెలియని ఆగంతుకులు ధ్వంసం చేశారు. శనివారం ఉదయం ఈ విషయాన్ని గమనించిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణంలోనే ఈ ఘటన జరగడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

February 21, 2026 / 11:57 AM IST

దేవాలయంలో మొక్కులు చెల్లించుకున్న నూతన పాలకవర్గం

RR: షాద్‌నగర్ పట్టణంలోని 23వ వార్డు మైసమ్మ దేవాలయంలో నూతన ఛైర్మన్ బసవేశ్వర్, వైస్ ఛైర్మన్ అందేమోహన్, కౌన్సిలర్లు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సాయి మిత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు సత్యనారాయణ వారికి అభినందనలు తెలిపారు. వారు మాట్లాడుతూ.. నూతన పాలకవర్గం సమస్యలను పరిష్కరిస్తారని ప్రజలు భావిస్తున్నారన్నారు.

February 21, 2026 / 11:56 AM IST

బాధితులకు CMRF చెక్కు పంపిణీ

BHNG: మోత్కూరు మండలం పనకబండకు చెందిన మారుపాక మమత అనారోగ్యంతో HYDలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారి పరిస్థితిని ఉప సర్పంచ్ మల్లేశం, తుంగతుర్తి నియోజకవర్గ ఇంఛార్జ్ కడియం రామచంద్రయ్య దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో CMRF నిధుల కోసం దరఖాస్తు చేయించి చెక్కును అందజేశారు.

February 21, 2026 / 11:53 AM IST

రోడ్ల గండం.. ప్రయాణం నరకం..!

SRPT: నాగారం మండలం పస్తాల, పసునూరు స్టేజి మరియు రావులపల్లి ఎక్స్ రోడ్ రహదారులు గుంతలమయమై వాహనదారులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు. ఏళ్లు గడుస్తున్నా, గతంలో నిధులు మంజూరయ్యాయని చెబుతున్నా.. నేటికీ పనులు ప్రారంభం కాలేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి ఈ రోడ్ల మరమ్మతులకు ప్రత్యేక నిధులు కేటాయించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

February 21, 2026 / 11:52 AM IST

రేపు దేవరకొండలో గురుకుల ప్రవేశ పరీక్ష

NLG: దేవరకొండలోని తెలంగాణ గిరిజన మహిళా డిగ్రీ కళాశాలలో VTG-CET 2026, గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశానికి ఆదివారం అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.హరిప్రియ తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థిని, విద్యార్థులు తమ హాల్ టికెట్‌తో పాటు ఆధార్, తదితర ఐడీ కార్డులతో కళాశాలకు ఉదయం 9 గంటల వరకు చేరుకోవాలని సూచించారు.

February 21, 2026 / 11:51 AM IST

రైతు వేదికలో వార్డు సభ్యులకు పరీక్షలు

MNCL: జన్నారం మండల కేంద్రంలోని రైతు వేదికలో వార్డు సభ్యులకు అధికారులు పరీక్షను నిర్వహించారు. పంచాయతీ రాజ్ చట్టంపై అవగాహన కల్పించేందుకు జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు నిర్వహిస్తున్న శిక్షణ శనివారం కొనసాగింది. పంచాయతీరాజ్ చట్టం, పంచాయతీ విధులు, నిధులు, బాధ్యతలు, తదితర అంశాలపై వారికి శిక్షణ ఇచ్చి పరీక్షను నిర్వహించారు.

February 21, 2026 / 11:50 AM IST

అధికారులను ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమించబోం: హరీశ్ రావు

MDK: BRS పార్టీ రెండేళ్లలో మళ్లీ అధికారంలోకి వస్తుందని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తూ, BRS నాయకులపై అక్రమ కేసులు బనాయించిన పోలీసులను ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమించబోమని హెచ్చరించారు. ఈసారి KCR కాళ్లు మొక్కైనా సరే అతిగా ప్రవర్తించిన అధికారులను వదిలేది లేదని స్పష్టం చేశారు.

February 21, 2026 / 11:50 AM IST