JGL: మెట్‌పల్లి మండల విద్యా అధికారిగా జిల్లా పరిషత్ హైస్కూల్ (బాలికల) పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు కనకతారను నియమిస్తూ విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యా ప్రమాణాల అభివృద్ధి, పాఠశాలల పర్యవేక్షణ, విద్యార్థుల హాజరు, బోధన నాణ్యత మెరుగుపరిచే దిశగా ఆమె సేవలు అందించనున్నారు.
MNCL: చెక్ బౌన్స్ కేసులో ఓ వ్యక్తికి ఏడాది జైలు శిక్ష, చెల్లించవల్సిన మొత్తం చెల్లించాలని జిల్లా జడ్జి నిరోష తీర్పునిచ్చారు. 2018లో జైపూర్ మండలంకి చెందిన నరసింహారెడ్డి వద్ద మంచిర్యాలకు చెందిన మధుసూదన్ రూ. 7.75 లక్షలు అప్పు చేశాడు. తిరిగి చెల్లించే క్రమంలో చెక్కు ఇవ్వగా అది బౌన్స్ అయ్యింది. దీంతో బాధితుడు కోర్టును ఆశ్రయించగాపై విధంగా తీర్పునిచ్చారు.
NZB: ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీ పథకం 40 పాఠశాలలకు కింద మంజూరు చేసిన నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. కలెక్టరేట్‌లో బుధవారం ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థల హెచ్ఎంలు, ప్రిన్సిపల్స్‌తో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
NLG: మిర్యాలగూడలో అర్హత లేకుండా డాక్టర్లుగా చలామణి అవుతున్న ఐదుగురు నకిలీ వైద్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. 5 కంటి ఆసుపత్రిలో ఎలాంటి మెడికల్ సర్టిఫికెట్లు లేకుండా వీరు చికిత్స అందిస్తున్నట్లు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తనిఖీల్లో తేలింది. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి పూర్తి వివరాలను డీఎస్పీ రాజశేఖర్ వెల్లడించారు.
WGL: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి తడవకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి కే. సురేఖ సూచించారు. మార్కెట్‌లో మొత్తం 46 షెడ్లు ఉండగా, వాటిలో సుమారు 50 వేల నుంచి 80 వేల బస్తాల వరకు నిల్వ చేసే సామర్థ్యం ఉందని తెలిపారు. వర్షం సంభవించిన ధాన్యంపై కప్పుకునేందుకు పర్దాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
KMM: ఖమ్మం పోలీస్ ప్రధాన కార్యాలయంలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ అవగాహన సదస్సులో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలపై కీలక సూచనలు చేశారు. ప్రమాదాల నివారణకు ప్రతి డ్రైవర్ క్రమశిక్షణతో వ్యవహరించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
సిద్దిపేట జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు 40 గ్రామాల్లోని 1,998 మంది రైతులు నష్టపోయారు. మొత్తం 3,887 ఎకరాల్లో మొక్కజొన్న (2,356 ఎకరాలు), సన్ఫ్లవర్ (1,531 ఎకరాలు)పంటలు దెబ్బతిన్నాయి.తొగుట మండలంలో డీఏవో స్వరూప రాణి క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని పరిశీలించారు. ఈ నివేదికను కలెక్టర్కు సమర్పించి, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బాధితులను ఆదుకుంటామని తెలిపారు.
RR: కొత్తగూడ ఇజ్జత్ నగర్ హైటెక్స్ గేట్ నుంచి మెహదీపట్నం, సికింద్రాబాద్ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సు సర్వీస్ పునరుద్ధరించాలని అక్కడ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఆర్టీసీ బస్సు సర్వీసు ఉండేదని ఇటీవల నిలిపివేయడంతో జీహెచ్ఎంసీ ఉద్యోగులు, తదితరులు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పుకొచ్చారు. వెంటనే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
MHBD: బయ్యారం మండల కేంద్రంలో పోలీసులు ఓ 17 ఏళ్ల బాలికను నిబంధనలకు విరుద్ధంగా గర్భస్రావం చేసిన కేసులో ఇద్దరు వైద్యులు, నలుగురు ఆసుపత్రి సిబ్బందిని బుధవారం అరెస్ట్ చేశారు. బాలికపై గతంలో లైంగిక దాడి జరిగి ఆమెకు గర్భం వచ్చింది. ప్రైవేటు ఆసుపత్రిలో నిబంధనలకు విరుద్ధంగా గర్భస్రావం చేయించారని కుటుంబ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తిరుపతి వెల్లడించారు.
HYD: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ లక్ష సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు, పారదర్శక పాలన అందించాలనే లక్ష్యంతో ఈ ఉద్యమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి కాలనీ, ప్రతి వీధిలోకి వెళ్లి ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నారు.
ADB: ఉమ్మడి జిల్లా ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించానున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా బోరజ్ మండలం హత్తిఘాట్ పంప్ హౌస్ వద్దకు చేరుకున్న మంత్రి, అక్కడ చేపట్టిన వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం, అభివృద్ధి పనులపై ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమావేశమై సమీక్ష నిర్వహించానున్నారు.
HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి పనులు జెట్ స్పీడ్‌లో జరుగుతున్నట్లు డివిజనల్ రైల్వే మేనేజర్ ఏ.కే.గోపాలకృష్ణన్ తెలిపారు. ఆధునిక టెర్మినల్, విస్తరించిన ప్లాట్‌ఫారమ్‌లు, ఎస్కలేటర్లు, లిఫ్టులు, డిజిటల్ డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యమని చెప్పారు.
KNR: ప్రయోగాల ద్వారానే విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, ప్రశ్నించే తత్వం పెరుగుతాయని ఏంఈవో కట్టా రవీంద్రచారి అన్నారు. వెన్కేపల్లి హైస్కూల్లో భౌతిక, జీవశాస్త్ర టీచర్స్ కి ‘బెలూన్ కార్ ఛాలెంజ్’పై అవగాహన కల్పించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో ఈ కార్యక్రమం జరుగుతోందన్నారు. ప్రయోగాత్మక బోధనతో పిల్లలు సులభంగా నేర్చుకుంటారన్నారు.
NZB: భీమ్‌గల్ మండలం పల్లికొండకు చెందిన గంగం అజయ్ (25)కి చెవి సర్జరీ చేస్తుండగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో వైద్యుల నిర్లక్ష్యం ఆరోపణల నేపథ్యంలో ఆస్పత్రి యాజమాన్యం బాధిత కుటుంబంతో రూ.23 లక్షలకు బేరం కుదుర్చుకున్నట్లు సమాచారం. రూ.5 లక్షలు నగదు చెల్లించగా, మిగిలిన రూ.18 లక్షలకు చెక్ ఇచ్చినట్లు సమాచారం.
WGL: గీసుగొండ మండలం సూర్యతండా సర్పంచ్ బానోత్ రాఘవేంద్ర బుధవారం ఎస్సారెస్పీ కెనాలో జరిగిన అక్రమమట్టి తవ్వకంపై కలెక్టర్‌కి ఫిర్యాదు చేశారు. అనుమానించబడిన 10కి పైగా ట్రాక్టర్ల ద్వారా మట్టి తరలించబడినప్పటికీ, పోలీసులు కేవలం 3 ట్రాక్టర్లపై మాత్రమే కేసులు నమోదు చేసారని తెలిపారు. ప్రజాప్రతినిధిగా తన ప్రశ్నలపై సీఐ అవమానకరంగా ప్రవర్తించి, బెదిరించారని ఆరోపించారు.