• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

సికింద్రాబాద్ మిలిటరీ ఆసుపత్రికి ఈ-కార్ట్ వాహనం

HYD: సికింద్రాబాద్‌ మిలిటరీ హాస్పిటల్లో కల్నల్ ఎస్‌కే ముఖర్జీ ఈ-కార్ట్‌ వాహనం అందించారు. ముఖర్జీ తల్లిదండ్రులు కల్నల్ ఎస్‌కే మిత్రా, ఆర్మీ మెడికల్ కార్ప్ సీనియర్ అనస్థీషియాలజిస్ట్ అరుణ మిత్ర స్మారకంగా దీనిని వారు అందించారు. ఈ-కార్ట్‌ను కమాండెంట్ బ్రిగేడియర్ విశాల్ వీర్ శర్మ స్వీకరించారు. అనంతరం అధికారులు ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

March 19, 2026 / 12:48 PM IST

ఘనంగా ఉగాది పండుగ వేడుకలు

ADB: ఇచ్చోడ మండలం హీరాపూర్ సహా పలు గ్రామాల్లో శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామస్తులు ఉదయాన్నే తీపి వంటకాలు, ఉగాది పచ్చడి తయారు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండుగను పురస్కరించుకుని మండల కేంద్రంలోని రైతులు శుభ ముహూర్తాన వ్యవసాయ పనులను ప్రారంభించారు. పల్లెల్లో పండుగ సందడి నెలకొనగా, నూతన సంవత్సరానికి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు.

March 19, 2026 / 12:46 PM IST

‘హబ్సిగూడ సెక్షన్‌లో విద్యుత్ సమస్యల పై కాల్ చేయండి’

MDCL: హబ్సిగూడ TGSPDCL సెక్షన్ పరిధిలో విద్యుత్ సమస్యలు ఏర్పడితే తమకు కాల్ చేస్తే సమస్యలకు పరిష్కారం చూపుతామని విద్యుత్ అధికారులు తెలిపారు. DE ఆఫీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712471612, FOC హబ్సిగూడ 8712471613, AE 8712471571 నెంబర్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని, కాల్ చేస్తే స్పందిస్తారని పేర్కొన్నారు. SHARE IT

March 19, 2026 / 12:45 PM IST

అమరేశ్వర స్వామి ఆలయంలో పూజలు

PDPL: ధర్మారం మండలంలోని నంది మేడారం శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ఇవాళ ఉదయం నుంచి పూజలు నిర్వహిస్తున్నారు. తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీ పరాభవ నామ సంవత్సరానికి శుభాకాంక్షలు పలుకుతూ పూజలు చేశారు. సంవత్సరం పొడవునా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని పురోహితులు గజవెల్లి ప్రభాకర్ స్వామివారికి అభిషేకం నిర్వహించారు.

March 19, 2026 / 12:42 PM IST

మన్యంకొండ గేటు వద్ద ఉగాది పచ్చడి పంపిణీ

మహబూబ్ నగర్ రూరల్ మండలం మన్యంకొండ దేవస్థానం గేటు వద్ద ఓబులాయపల్లి గ్రామస్తులు గురువారం ఉగాది సందర్భంగా ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. ఉగాది పండుగ సాంప్రదాయం సందర్భంగా ప్రజలకు పచ్చడి పంపిణీ చేశామన్నారు. ప్రజలంతా కూడా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థించామన్నారు.

March 19, 2026 / 12:40 PM IST

చలివేంద్రాన్ని ప్రారంభించిన.. సర్పంచ్

MLG: వెంకటాపూర్ మండలంలోని అడవిరంగాపూర్ గ్రామంలో పరాభవ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని చలివేంద్రాన్ని సర్పంచ్ సర్పంచ్ దొంతరబోయిన లక్ష్మి-కుమారస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఎండ తీవ్రత దృష్టిలో ఉంచుకొని చలివేంద్రాన్ని ప్రారంభించినట్లు సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు తదితరులు ఉన్నారు.

March 19, 2026 / 12:38 PM IST

కెనాల్ కాల్వలో పిచ్చి మొక్కల తొలగింపు పనులు ప్రారంభం

WNP” రేవల్లి మండలం లోని కెనాల్ కాల్వలో పేరుకుపోయిన ముళ్ళపోదలను తొలగించే పనులను గురువారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పర్వతాలు ముళ్లపొదలను తొలగించ కార్యక్రమం చేపట్టారు. కెనాల్ కాల్వలో చెట్లు పిచ్చి మొక్కలు భారీగా పెరిగి నీరు పారకంతో ఇబ్బందులు వస్తున్నాయని రైతుల ఫిర్యాదుతో ఎమ్మెల్యే స్పందించారు. నేడు పనులు ప్రారంభించేందుకు రైతుల కృతజ్ఞతలు తెలిపారు.

March 19, 2026 / 12:36 PM IST

బషీరాబాద్‌లో పండగ పూట నీటి ఎద్దడి

VKB: బషీరాబాద్ మండల్ జీవన్గి గ్రామంలోని ఎస్సీ కాలనీలో నీటి ఎద్దడి తీవ్రత తీవ్ర రూపం దాల్చింది. బిందే నీటి కోసం మహిళలు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. కాలనీలో రెండు బోర్లు ఉండగా ఒక బోరులో పూర్తిగా మీరు అడగండి అరగంటకు ఒకసారి బోరుపోస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన కొన్ని నీటిని పట్టుకుని కాలం గడుపుతున్నట్టు వాపోయారు.

March 19, 2026 / 12:35 PM IST

చికిత్స పొందుతూ ఆటో డ్రైవర్ మృతి

WGL: ఉరుసు కరీమాబాద్‌కు చెందిన ఆటో డ్రైవర్ శ్రీనివాస్ (40) ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్తగా కొన్న ఆటోకు ఈఎంఐలు చెల్లించలేక ఒత్తిడికి గురైన ఆయన, ఈ నెల 16న వరంగల్ బస్టాండ్ సమీపంలో పురుగు మందు తాగాడు. గమనించిన తోటి ఆటో డ్రైవర్లు MGM ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందారు.

March 19, 2026 / 12:32 PM IST

విద్యార్థులకు వాలీబాల్ కిట్లు పంపిణీ

MNCL: కోటపల్లి మండలంలోని పారుపల్లి గ్రామంలో ఉగాది పండుగను పురస్కరించుకుని విద్యార్థులకు సందర్భంగా సర్పంచ్ తోగురు శ్రీనివాస్ విద్యార్థులకు వాలీబాల్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శారీరక, మానసిక ఎదుగుదలకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు.

March 19, 2026 / 12:31 PM IST

ఉగాది పర్వదినం వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

SRD: పటాన్ డివిజన్‌లోని చైతన్య నగర్ హనుమాన్ దేవాలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడి ఆశీస్సులతో సుఖసంతోషాలతో, ఆరోగ్యంతో ఉండాలని కోరుకున్నారు.

March 19, 2026 / 12:29 PM IST

జిల్లా ప్రజలకు ఎస్పీ ఉగాది శుభాకాంక్షలు

NRPT: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా జిల్లా ప్రజలకు ఎస్పీ డా. వినీత్ IPS శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, రైతులు సమృద్ధిగా పంటలు పండించాలని ఆకాంక్షించారు. పండుగను ఆనందంగా జరుపుకుంటూనే, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

March 19, 2026 / 12:28 PM IST

‘జాగ్రత్తగా ప్రయాణించండి’

KNR: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శంకరపట్నం మండల ప్రజలకు ఎస్సై శేఖర్ రెడ్డి పలు సూచనలు చేశారు. పండుగ వేళ ప్రయాణాలు చేసేటప్పుడు రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని కోరారు. పండుగ సంతోషం విషాదంగా మారకుండా స్వీయ నియంత్రణ పాటించాలని పేర్కొన్నారు. అదేవిధంగా పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

March 19, 2026 / 12:27 PM IST

కుటుంబ తగాదాల నేపథ్యంలో యువకుడు ఆత్మహత్య

హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన గోపగాని లక్ష్మణ్ గౌడ్ 30 అనే యువకుడు కుటుంబ తగాదాల నేపథ్యంలో ఇవాళ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇటీవల భార్య గొడవ పెట్టుకుని పిల్లలతో తల్లిగారింటికి వెళ్లడంతో మనస్థాపన చెందిన లక్ష్మణ్ బలవన్మరణానికి పాల్పడ్డారు స్థానిక పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు.

March 19, 2026 / 12:26 PM IST

300 మంది లబ్ధిదారులకు రూ. 1.50 కోట్లు మంజూరు

RR: పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందిగామ, కొత్తూరు, కేశంపేట మండలాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ.. 300 మంది లబ్ధిదారులకు రూ. 1.50 కోట్ల విలువైన చెక్కులు మంజూరయ్యాయన్నారు.

March 19, 2026 / 12:23 PM IST