• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

కోయగూడలో చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్

MULG: ఏటూరునాగారం మండలం కోయగూడ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ పోరిక సరిత గురువారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసి ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గాంధీ, వార్డ్ సభ్యులు గద్దె జయకృష్ణ, నాగవత్ శ్రీకాంత్, ఫీల్డ్ అసిస్టెంట్ ముకుందరావు తదితరులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

March 19, 2026 / 11:46 AM IST

ప్రజలకు మంత్రి పొన్నం ఉగాది శుభాకాంక్షలు

SDPT: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని, కొత్త ఏడు ఆశయాల సాకారం, సుఖసంతోషాలను ఇవ్వాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు పండి ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన ప్రార్థించారు.

March 19, 2026 / 11:46 AM IST

జాతీయ పోటీల్లో తేజు సత్తా

NLG: హాలియాకు చెందిన చింతలచెరువు తేజు జాతీయ స్థాయి ఫుట్‌బాల్లో ప్రతిభ చాటుతున్నాడు. చిన్న వయసులోనే క్రమశిక్షణతో సాధన చేస్తూ ముందుకు సాగుతున్నాడు. హరియాణాలో జరిగిన అండర్-17 జాతీయ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ సందర్భంగా స్థానికులు తేజును అభినందిస్తున్నారు.

March 19, 2026 / 11:45 AM IST

తిరుమల ఆలయంలో నేడు సాయంత్రం పంచాంగ శ్రవణం

NZB: నర్సింగ్ పల్లిలోని ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రం ఆలయంలో గురువారం సాయంత్రం 6 గంటలకు పంచాంగ శ్రవణ కార్యక్రమం ఉంటుందని ఆలయ ప్రధాన ధర్మకర్త శ్రీమాన్ నరసింహారెడ్డి తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకుడు రోహిత్ కుమార్ ఆచార్య పంచాంగ శ్రవణం చేయనున్నారు. మన శాస్త్రాల ప్రకారం ఉగాది పర్వదినాన సాయంత్రం ఆలయాల్లో ఉత్తరాభిముఖంగా కూర్చొని పంచాంగ శ్రవణం చేయడం ఆనవాయతీ.

March 19, 2026 / 11:45 AM IST

కాంగ్రెస్‌లోకి రంగాపూర్ సర్పంచ్

RR: ఉగాది పర్వదినాన షాద్‌నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్‌కు భారీ షాక్ తగిలింది. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సమక్షంలో రంగాపూర్ గ్రామ సర్పంచ్ అంజమ్మ, ఉప సర్పంచ్ బసవయ్యల ఆధ్వర్యంలో పలువురు వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పని అయిపోయిందన్నారు.

March 19, 2026 / 11:44 AM IST

ఉప్పల్ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ ఫీడర్ సర్వీస్ పనులు

MDCL: ఉప్పల్, హబ్సిగూడ ప్రాంతాల్లో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అధికారులు ఎక్కడికక్కడ ఫీడర్ సర్వీస్ సేవలు కొనసాగిస్తున్నారు. హనుమాన్ టెంపుల్, నాచారంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతుల సమస్యల సైతం కొనసాగిస్తున్నట్లు వివరించారు. వేసవికాలంలో విద్యుత్ డిమాండ్ తగ్గట్లుగా, ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా చర్యలు చేపడుతున్నారు.

March 19, 2026 / 11:43 AM IST

ఈ నెల 31 వరకు ఉచిత వైద్య శిబిరాలు

KMM: జిల్లాలో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 31 వరకు 20 స్పెషలిస్ట్ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 9 శిబిరాలు పూర్తికాగా, మిగిలిన చోట్ల స్త్రీ, శిశు, కంటి వైద్య నిపుణులు ఉచిత పరీక్షలు చేసి మందులు అందజేస్తారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ డి. రామారావు కోరారు.

March 19, 2026 / 11:42 AM IST

మ్యారేజి రిజిస్ట్రేషన్లలో మహబూబ్ నగర్‌కు మొదటి స్థానం

MBNR: మ్యారేజి రిజిస్ట్రేషన్‌లలో మహబూబ్ నగర్ మొదటి స్థానంలో నిలిచింది. మహబూబ్ నగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయ పరిధిలో 2025 వ సంవత్సరంలో 1330 హిందువులు 35 మంది ఇతరులు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇక ప్రస్తుతం 2026వ సంవత్సరంలో 123 మంది హిందువులు ఒకరు ఇతరులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అట్టడుగు స్థానంలో ఉమ్మడి జిల్లాలోని ఆత్మకూరు నిలిచింది.

March 19, 2026 / 11:40 AM IST

హనుమాన్ జయంతి ఏర్పాట్లు ఘనంగా ప్రారంభం

NRML: నర్సాపూర్ జీ మండలంలోని టెంబుర్ని గ్రామంలో రాబోయే హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ శుభ్రపరిచే పనులు, సంప్రదాయ అలంకరణలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో దేవాలయాన్ని తీర్చిదిద్దుతూ ప్రత్యేక పూజల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పండుగను వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు కొనసాగుతుండగా, గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

March 19, 2026 / 11:40 AM IST

నేటి నుంచి ప్రారంభమైన శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు

BDK: భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఇవాళ నుంచి శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 2 వరకు సాగే ఈ వేడుకల్లో భాగంగా 27న మహోన్నతమైన తిరుకళ్యాణ, 28న శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఉగాది పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, రక్షాబంధనం నిర్వహించనున్నారు. సాయంత్రం అంకురార్పణతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు.

March 19, 2026 / 11:31 AM IST

‘స్తంభాలకు ఎల్ఈడి బల్బులు ఏర్పాటు’

SRD: సిర్గాపూర్ మండలం గైరాన్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని లొంక తండా గ్రామంలో పలుచోట్ల విద్యుత్ స్తంభాలకు ఎల్ఈడి బల్బులను నేడు అమర్చారు. ఈ పనులను స్థానిక సర్పంచ్ వినోద్ రాథోడ్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ పంచాయతీ పరిధిలోని మూడు తండాల్లో కూడా వీధి స్తంభాలకు కొత్త బల్బులు అమర్చుతున్నట్లు చెప్పారు.

March 19, 2026 / 11:31 AM IST

అప్పుల బాధతో ఒక వ్యక్తి ఆత్మహత్య

MDK: అప్పుల బాధ తాళలేక ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజాంపేట మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండలానికి చెందిన పంజ సత్తయ్య (48) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు తనకున్న భూమిని అమ్మి ఇద్దరు కుమార్తెల పెళ్లిళ్లు చేశాడు. అనంతరం కొత్త ఇంటి నిర్మాణం కోసం బ్యాంకులో 5 లక్షలు, బయట వ్యక్తుల వద్ద 10 లక్షల అప్పు చేశాడు.

March 19, 2026 / 11:25 AM IST

కుప్పకూలిన మార్కెట్లు.. రేపు ఫుల్ లాభాలంటూ ఎర..!

MDCL: నేడు స్టాక్ మార్కెట్‌లో కుప్పకూలిన నేపథ్యంలో రేపు భారీ లాభాలు అర్జించే అవకాశం ఉంటుందని పలువురు ఫేక్ ఇన్వెస్టర్లు ఉప్పల్, నాచారం ప్రాంతాలకు చెందిన ట్రేడర్లకు కాల్స్, మెసేజెస్ చేస్తున్నట్లుగా తెలిపారు. అలాంటి మెసేజెస్ నమ్మితే తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుందని, వాటికి దూరంగా ఉండటం మేలని సైబర్ పోలీస్ అధికారులు తెలిపారు.

March 19, 2026 / 11:22 AM IST

ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్, ఎస్పీ

వనపర్తి జిల్లా ప్రజలకు కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీత రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తీపి, పులుపు, చేదు, వగరు, ఉప్పు, కారంతో తయారు చేసిన ఉగాది పచ్చడిలాగే మనిషి జీవితంలో ఎదురయ్యే కష్టాసుఖాలు, ఆనందం బాధలన్నింటికీ ఉగాది పచ్చడి ప్రతీక అన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.

March 19, 2026 / 11:20 AM IST

పోచంపల్లిలో ఉగాది వేల ధరలు పెరుగుదల…

BHNG: పోచంపల్లిలో ఉగాది సందడి నెలకొంది. మార్కెట్లో కుండలు, మామిడాకులు, మామిడికాయలు, వేపాకు వేప పువ్వు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.. పెరిగిన ధరలతో పండుగ కొనుగోళ్ల భారంగా మారాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు మాత్రం అమ్మకాలు బాగున్నాయి చెబుతున్నారు.

March 19, 2026 / 11:19 AM IST