• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఉగాది వేళ ఎమ్మెల్యేకు నాయకుల శుభాకాంక్షలు

MDCL: ఉగాది పండుగ సందర్భంగా మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, చిన్న యాదవ్, జేఏసీ వెంకన్న, తుపాకుల జనార్ధన్ కలిసి మల్కాజ్‌గిరి స్థానిక ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు సుఖశాంతులు కలగాలని ఆకాంక్షించారు.

March 19, 2026 / 12:23 PM IST

గోదావరి జలంతో దేవతలకు జలాభిషేకం

NZB: ముప్కాల్ మండల కేంద్రంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు గోదావరి జలంతో దేవతలకు గురువారం భక్తిశ్రద్ధలతో జలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయాల్లో పంచాంగ శ్రవణం విని, ఉగాది పచ్చడిని స్వీకరించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలిపారు. పాత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ గంగాజలంతో అభిషేకం చేయడం విశేషం.

March 19, 2026 / 12:20 PM IST

జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ

JGL: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కొత్త సంవత్సరం అందరికీ ఆనందం, ఆరోగ్యం, శాంతి, శ్రేయస్సు తీసుకురావాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా పండుగ జరుపుకోవాలని సూచించారు. ప్రజల భద్రత కోసం పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుందని తెలిపారు.

March 19, 2026 / 12:17 PM IST

‘ఆహార భద్రత ప్రమాణాలు పాటించాలి’

SRCL: వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని నిత్యాన్నదాన ప్రసాదాల తయారీ కేంద్రంలో విధులు నిర్వహించే ఉద్యోగులు ఆహార భద్రత ప్రమాణాలను పాటించాలని జిల్లా ఫుడ్ ఇన్స్‌పెక్టర్ అనూష అన్నారు. రాజన్న ఆలయంలోని నిత్యాన్నదాన, ప్రసాదాల తయారీ కేంద్ర ఉద్యోగులకు, సిబ్బందికి ఫుడ్ సేఫ్టీపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు.

March 19, 2026 / 12:16 PM IST

సామూహిక ఉగాది పచ్చడి పంపిణీ

ADB: ఉట్నూర్‌లోని రామమందిరంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని సామూహిక ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అర్చకుడు సంతోశ్ దుబే ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పాశ్చాత్య ధోరణులకు లోనుకాకుండా మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని కోరారు. ఉగాది విశిష్టతను చాటిచెప్పేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన వివరించారు.

March 19, 2026 / 12:14 PM IST

భవాని మందిరం జాతర ఉత్సవాల్లో ఎమ్మెల్యే

SRD: ఖేడ్ పట్టణం పరిధి మంగళ్ పేట్ భవాని మందిరం ఆలయాన్ని ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆయన సతీమణి అనుపమ రెడ్డి గురువారం సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఇక్కడ జరుగుతున్న జాతర ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్, కౌన్సిలర్లు ఉన్నారు.

March 19, 2026 / 12:14 PM IST

FLASH: త్వరలో ఉప్పల్ రింగ్ రోడ్డు బంద్..!

HYD: ఉప్పల్ రింగ్ రోడ్డు త్వరలో బంద్ కానుంది. రామంతపూర్ నుంచి ఉప్పల్ మీదుగా వరంగల్ హైవే వైపు వెళ్లే మార్గంలో నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణపు పనుల్లో భాగంగా ఉప్పల్ రింగ్ రోడ్డు సెంటర్‌లో పిల్లర్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ అధికారుల బృందం పూర్తిగా స్టడీ చేసింది. త్వరలోనే రింగ్ రోడ్డు బంద్ చేసి, ట్రాఫిక్ మళ్లించనున్నారు.

March 19, 2026 / 12:10 PM IST

మొగిలిపాకలో చత్రపతి శివాజీ విగ్రహ భూమి పూజ

BHNG: వలిగొండ మండలం మొగిలిపాక గ్రామంలో గ్రామ సర్పంచ్ జడిగే బుచ్చయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ విగ్రహం భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన మాజీ ఛైర్మన్ మొగిలిపాక ముద్దసాని కిరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు శివాజీ యొక్క గొప్ప పనులను స్మరించుకున్నారు. గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

March 19, 2026 / 12:06 PM IST

మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వరరావుకు ఘన నివాళులు

KNR: మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వరరావు 7వ వర్ధంతి సందర్భంగా బొమ్మకల్లోని మున్నూరు కాపు వసతి గృహంలో ఘనంగా నివాళులర్పించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. చల్ల హరిశంకర్, సత్తినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.

March 19, 2026 / 12:04 PM IST

పర్యావరణ పరిరక్షణకు వ్యాపారి వినూత్న ప్రచారం

PDPL: పర్యావరణ పరిరక్షణలో తనవంతు బాధ్యతగా మంథనిలో ఓ కూరగాయల వ్యాపారి వినూత్న ప్రచారానికి తెరలేపారు. ఇంటి నుంచి చేతి సంచి (జూట్ లేదా కాటన్ బ్యాగ్) తెచ్చుకున్న వినియోగదారులకు సదరు వ్యాపారి ఒక కొత్తిమీర కట్టను ఉచితంగా అందజేశారు. “పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. పాలిథిన్ కవర్లను నిషేధించి, ప్రతి ఒక్కరూ ఇంటి నుంచే సంచి తెచ్చుకునేలా చేస్తున్నారు.

March 19, 2026 / 12:04 PM IST

గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు

ఆసిఫాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఇటీవల కురిసిన వర్షాలకు ఉష్ణోగ్రతలో వ్యత్యాసం ఏర్పడింది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. ఆసిఫాబాద్ 30.8°C, వాంకిడి 30.7, కాగజ్ నగర్ 30.6, జైనూర్ 30.6, కెరమెరి 30.4, రెబ్బెన 30.2, సిర్పూర్(యూ) 30.2, సిర్పూర్ (టి) 29.6, తిర్యాణిలో 28.2, ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

March 19, 2026 / 12:01 PM IST

‘రైతు మహోత్సవనికి హాజరు కావాలి’

KMR: ఈ నెల 20వ తేదీ నుంచి 22వ తేదీ వరకు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రైతు మహోత్సవానికి రైతులు పెద్ద సంఖ్యలో హాజరై కావాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కోరారు. వ్యవసాయ, ఉద్యానవన రంగాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు.

March 19, 2026 / 12:01 PM IST

వేసవిలో కొబ్బరి బోండాలకు డిమాండ్

NLG: వేసవి ఎండలు ముదురుతుండడంతో హాలియా పరిసర ప్రాంతాల్లో కొబ్బరి బోండాలకు విపరీతమైన గిరాకీ పెరిగింది. రోడ్ల పక్కన విక్రయాలు జోరుగా సాగుతుండగా, ఒక్కో బోండా ధర రూ.30 నుంచి 50 పలుకుతోంది. లీటర్ బాటిల్ కొబ్బరి నీరు రూ.100 వరకు విక్రయిస్తున్నారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు సూచించడంతో ప్రజలు వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

March 19, 2026 / 11:57 AM IST

ముఖ్యమంత్రికి ఆహ్వానం అందజేసిన భద్రాచలం అర్చకులు

BDK: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి‌ను భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం తరపున అర్చకులు ఇవాళ ఆహ్వానం అందజేశారు. శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈ.వో దామోదర్ రావు, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు.

March 19, 2026 / 11:48 AM IST

భక్తిశ్రద్ధల మధ్య ఉగాది పండుగ

MNCL: జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో ఉగాది పండుగను నిర్వహించుకున్నారు. ఉగాది సందర్భంగా గురువారం జన్నారంతో పాటు వివిధ గ్రామాలలో ఉన్న దేవాలయాలను భక్తులు, ప్రజలు సందర్శించి స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జన్నారంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నిర్వాహకులు ప్రజలకు ఉగాది పచ్చడిని అందజేశారు.

March 19, 2026 / 11:47 AM IST