• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

రూ. 5 వేలు పెట్టుబడి పెడితే.. గంటలో రూ. 25 వేలు

HYD: రూ. 5 వేలు పెట్టుబడి పెడితే గంటలోనే రూ. 25 వేలు లాభం వస్తుందని “స్టాక్ మార్కెట్ తెలుగు ట్రేడర్ గ్రూప్”పై సైబర్ పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. ఈమేరకు అలాంటివి నమ్మొద్దని, ఇలాంటి ఫేక్ ట్రేడింగ్ గ్రూపులు సోషల్ మీడియా ద్వారా ప్రజలను మోసం చేస్తున్నాయని పోలీసులు హెచ్చరించారు. అధిక లాభాల పేరుతో వచ్చే సందేశాలను నమ్మొద్దని, అనుమానాస్పద లింకులు క్లిక్ చేయొద్దన్నారు.

March 19, 2026 / 10:44 AM IST

మామిడి ఆకుల కోసం యువకుల ఆరాటం

NLG: మర్రిగూడ మండలంలో ఉగాది సందర్భంగా మామిడి ఆకుల కోసం యువకులు ఆరాటపడ్డారు. సరంపేట శివారులోని శ్రీ లక్ష్మీనరసింహ ఆలయం వద్ద జేసీబీ సహాయంతో ఆకులు కోశారు. వాతావరణ ప్రభావంతో చెట్ల ఆకులు మాడిపోవడంతో కొరత ఏర్పడిందని తెలిపారు.

March 19, 2026 / 10:41 AM IST

సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచుతాం

BDK: అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో నిఘా పెంచామని, గడిచిన నెల రోజుల్లోనే సుమారు 6,000 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు బుధవారం కలెక్టర్ అంకిత్‌తో కలిసి వెల్లడించారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. తనిఖీలను మరింత ముమ్మరం చేయాలని, కేసుల వివరాలను ఎప్పటికప్పుడు నివేదించాలని ఆదేశించారు.

March 19, 2026 / 10:38 AM IST

అంగన్వాడీ కేంద్రంలో అన్నప్రాసన కార్యక్రమం

SRCL: కోనరావుపేట మండలం భూక్య రెడ్డి తండాలోని అంగన్వాడి కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే 99 రోజుల ప్రత్యేక కార్యచరణలో భాగంగా చిన్నారులకు బుధవారం అన్నప్రసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నరేష్ నాయక్, ఎంపీవో హరీష్ ఉపసర్పంచ్ రాజు నాయక్, సూపర్వైజర్ గంగ లక్ష్మి, అంగన్వాడీ టీచర్ సంతోష, జీపీ కార్యదర్శి ముక్తర్ భాష, తదితరులు పాల్గొన్నారు.

March 19, 2026 / 10:38 AM IST

పెంపుడు పిల్లి లేదని విద్యార్థిని సూసైడ్

HYD: పెంపుడు పిల్లి మరణాన్ని తట్టుకోలేక బీఎస్సీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మీర్‌పేట్ PS పరిధిలో చోటుచేసుకుంది. బడంగ్‌పేట్‌లో నివసిస్తున్న హిమబిందు (20) తాను ఎంతో ఇష్టంగా పెంచుకున్న పెంపుడు పిల్లి మృత్యువాత పడింది. ఇది తట్టుకోలేక పురుగు మందు తాగి హిమబిందు ఆత్మహత్యకు పాల్పడింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

March 19, 2026 / 10:33 AM IST

RTC బస్సుల ఫ్లోర్ ఎత్తు పెంచుతున్నారు..!

RR: AIAS-153 నిబంధనల సవరణ జరిగిన నేపథ్యంలో HYD ఆర్టీసీ బస్సుల ఫ్లోర్ ఎత్తు పెంచుతున్నారు. ఇప్పటికే నగరంలో 300 బస్సులకు పైగా ఫ్లోర్ ఎత్తు పెంచినట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. దీంతో ఒక మెట్టు సైతం పెరుగుతుంది. ఉప్పల్, రాజేంద్రనగర్ సహా మిగతా బస్సుల్లోనూ ఇదేవిధంగా జరగనుంది.

March 19, 2026 / 10:33 AM IST

బోడుప్పల్ సర్కిల్ చెరువుల్లో గుర్రెపుడెక్క తొలగింపు షురూ

MDCL: బోడుప్పల్ సర్కిల్ పరిధి చెరువులు, నీటి మడుగుల్లో పెరిగిన గుఱ్ఱపు డెక్క మొక్కలను యంత్రాలతో తొలగిస్తున్నారు. ఇది “ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమంలో భాగమని డిప్యూటీ కమిషనర్ శైలజ తెలిపారు. పీర్జాదిగూడ చెరువులో పనులు ప్రారంభించి, దోమల నివారణకు గంబూసియా చేపలను వదిలారు. ఈ కార్యక్రమంలో డీఈఈ కె.జహ్నవి శశాంక పాల్గొన్నారు.

March 19, 2026 / 10:31 AM IST

ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపిన అమ్మాపురం సర్పంచ్

MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామ ప్రజలకు గురువారం సర్పంచ్ ముద్ధం సునీత వీరారెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పండుగను పురస్కరించుకొని ప్రజలు సుఖసంతోషాలతో, అప్లైశ్వర్యాలతో ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. ఉగాది పచ్చడిలాగే ప్రతి ఒక్కరి జీవితం కూడా పుడ్రుచులతో, ఆనంద హరివిల్లులతో కొనసాగాలని కోరారు.

March 19, 2026 / 10:29 AM IST

ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

WGL: నర్సంపేట నియోజకవర్గం ప్రజలకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ‘శ్రీ పరాభవ నామ సంవత్సరం’ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పండుగ తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. కొత్త సంవత్సరంలో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ప్రజలందరికీ ఆరోగ్యం, ఆయుష్షు, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.

March 19, 2026 / 10:28 AM IST

వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి

WGL నగరంలోని గోపాలస్వామి టెంపుల్లో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బుధవారం రాత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అదే చెప్పులు కమిటీ సభ్యులు స్థానిక కాంగ్రెస్ నాయకులు మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు.

March 19, 2026 / 10:24 AM IST

భూదాన్ భూములపై హైకోర్టు స్టే

KMM: వెలుగుమట్ల భూదాన్ భూములపై యథాస్థితి స్టేటస్ కో కొనసాగించాలని ఖమ్మం కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అసలైన లబ్దిదారులను గుర్తించాలని, నష్టపోయిన బాధితులందరికీ భూదాన్ భూముల్లో ఇళ్ల స్థలం, ఇళ్లు మంజూరు చేయాలని బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన కోర్టు ఇళ్ల కోల్పోయిన ప్రతి ఒక్కరికీ ఇళ్లు ఇవ్వాలని ఆదేశించింది.

March 19, 2026 / 10:24 AM IST

పోచమ్మ ఆలయంలో దాడి ఘటనలో కేసు నమోదు

ఆసిఫాబాద్ మండలం కసాబ్వాడి పోచమ్మ ఆలయాన్ని శుభ్రం చేస్తున్న తక్కల్ల జయశ్రీపై మరో మహిళ (జయశ్రీ) దాడికి పాల్పడింది. అసభ్య పదజాలంతో దూషించి, చీపురుతో కొట్టడమే కాకుండా అక్కడే ఉన్న పవన్, శిరీషలను కులం పేరుతో అవమానపరిచినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు సీఐ బాలాజీ వరప్రసాద్ తెలిపారు.

March 19, 2026 / 10:16 AM IST

విద్యార్థులకు ఆన్‌లైన్‌లో కంప్యూటర్ అప్లికేషన్ కోర్స్

MDCL: ప్రస్తుత తరుణంలో కంప్యూటర్ పరిజ్ఞానం అత్యవసరమైన వేల కంప్యూటర్ అప్లికేషన్ కోర్సు దూరవిద్య, ఆన్‌లైన్ వేదికగా నేర్చుకోవడానికి AICTE అనుమతులు అందించిందని ఉప్పల్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ విజయకుమార్ తెలిపారు. ప్రస్తుత యూత్, ఇంటర్మీడియట్ స్థాయి నుంచి కంప్యూటర్ అప్లికేషన్‌పై పట్టు సాధించడం ఎంతో లాభాలు చేకూరుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

March 19, 2026 / 10:16 AM IST

జిల్లాలోని బియ్యాన్ని FCIకి తరలించాలి: కలెక్టర్

VKB: మిల్లర్ల దగ్గర ఉన్న బియ్యాన్ని వేగంగా FCIకి తరలించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ మిల్లర్లకు సూచించారు. వికారాబాద్ కలెక్టరేట్‌లో రబీ సీజన్‌కు సంబంధించి వరి ధాన్యం సేకరణకు సంబంధిత అధికారులతో కార్యాచరణ ప్రణాళికపై రైస్ మిల్లర్లు, సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 129 వరి ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు.

March 19, 2026 / 10:15 AM IST

పండుగలకు ప్రతీక ఉమ్మడి WGL జిల్లా

ఉమ్మడి WGL జిల్లా సాంప్రదాయానికి పేరుపొందిన ప్రాంతం, నేడు ఉగాది పర్వదినం కావడంతో ప్రజలు సాంప్రదాయబద్ధంగా పండుగను జరుపుకుంటున్నారు. ఉదయాన్నే ఇల్లు శుద్ధి చేసుకుని షెడ్ రుచులతో పచ్చడి తయారుచేసి తాగుతారు. జిల్లాలోని ప్రసిద్ధ ఆలయంలో సాయంత్రం అర్చకులు సంవత్సరం కాల పంచాంగం వివరిస్తారు. ఆచారాలు జిల్లా సంస్కృతిని మరింత శోభాయమానం చేస్తున్నాయి.

March 19, 2026 / 10:15 AM IST