• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఉమ్మడి జిల్లాలో తగ్గిన ఉష్ణోగ్రతలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. మూడు రోజులుగా కురుస్తున్న వడగళ్ల వర్షాలకు ఉష్ణోగ్రతలో వ్యత్యాసం ఏర్పడింది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. మోస్రా 33.9°C, ఎడపల్లి 33.1, నిజామాబాద్(సౌత్), పెర్కిట్ 32.9, కోటగిరి, మంచిప్ప 32.8, మేనూరు(మద్నూర్) 32.7, మదన్ పల్లి, గోపన్ పల్లి, NZB (నార్త్) 32.6, ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

March 19, 2026 / 10:13 AM IST

ఘనంగా శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర ప్రారంభం

PDPL: అంతర్గాం మండల కేంద్రంలో బర్మా- కాందీశీకుల ఇలవేల్పు శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా అమ్మవారి దీక్షపరులు పెద్ద ఎత్తున పాల్గొని పూజలు చేశారు. అనంతరం మొక్కులు చెల్లించుకోవడంలో భాగంగా నాలుకపై శూలాలు గుచ్చుకున్నారు. అనంతరం భారీ ఊరేగింపుగా వెళ్లి నూకాంబిక అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అగ్నిగుండ ప్రవేశం జరిగింది.

March 19, 2026 / 10:12 AM IST

మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌‌కు వరుసగా సెలవులు

JGL: మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా సెలవులు ప్రకటించారు. ఉగాది సందర్భంగా ఈరోజు 19 తేదీతో పాటు మార్చి 20న కూడా మార్కెట్ యార్డ్‌కు సెలవులు ప్రకటించారు. అదేవిధంగా మార్చి 21 రంజాన్, 22 ఆదివారం కావడంతో పసుపు కొనుగోళ్లు మార్చి 23 నుంచి యథావిధిగా ప్రారంభమవుతాయని మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. రైతులు, కొనుగోలుదారులు గమనించాలని సూచించారు.

March 19, 2026 / 10:11 AM IST

రాష్ట్రంలోనే ప్రత్యేకం.. మోత్కూరు ఉగాది.!

BHNG: తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది పండుగ అంటే పచ్చడి, పంచాంగ శ్రవణం గుర్తొస్తాయి. కానీ, ఉమ్మడి జిల్లాలోని మోత్కూరులో మాత్రం ఉగాది అంటే ‘బోనాల పండుగ’. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా ఇక్కడ నిర్వహించే వినూత్న వేడుకలు రాష్ట్రంలోనే ఎక్కడా లేని ప్రత్యేకతను చాటుకుంటాయి. ఉగాదికి కొన్ని రోజుల ముందే పట్టణంలో దండోరా వేయడంతో పండుగ హడావుడి మొదలవుతుంది.

March 19, 2026 / 10:10 AM IST

గురుకుల ఇంటర్.. ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులకు ఆహ్వానం

MDCL: ఇంటర్ గురుకులం, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ చేయడం కోసం ప్రథమ సంవత్సర ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం ప్రారంభమైనట్లు ఉప్పల్ అధికారి రాములు తెలిపారు. టెన్త్ పూర్తి చేసిన వారు, టెన్త్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు ఏప్రిల్ 15 లోగా దరఖాస్తు చేసుకోవాలని, మే 3వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుందని వివరించారు.

March 19, 2026 / 10:08 AM IST

‘మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం’

ADB: గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా నార్నూర్ మండలం తడిహత్నూర్ గ్రామంలో దాల్, మిల్లెట్ ఫ్లోర్ మిల్ యూనిట్‌ను కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. సంపూర్ణ అభియాన్ 2.0లో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళల ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేశారు. ఇటువంటి యూనిట్ల వల్ల స్థానికంగా ఉపాధి పెరిగి మహిళలు ఆర్థికంగా బలోపేతం అవుతారని కలెక్టర్ ఆకాంక్షించారు.

March 19, 2026 / 10:06 AM IST

ముస్లింలకు ఈద్గా తోఫా పంపిణీ

KNR: సైదాపూర్ మండలంలోని గొల్లగూడెం గ్రామంలో గురువారం ముస్లింలకు ఈద్గా తోఫా కానుకలను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మిట్టపల్లి కిష్టయ్య, సర్పంచ్ బత్తుల మౌనిక పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కిష్టయ్య మాట్లాడుతూ.. ముస్లింల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

March 19, 2026 / 10:05 AM IST

రేపు చెర్వుగట్టులో వేలంపాట

NLG: చెర్వుగట్టులో శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో 2026-27 సంవత్సరానికి గాను వివిధ విభాగాల్లో హెచ్-1, ఎల్-1 వేలం నిర్వహించనున్నట్లు EO ఎస్.మోహన్ బాబు తెలిపారు. ఈ నెల 20న తలనీలాలు సేకరించుకునే హక్కు, కిరాణా సామాగ్రి విక్రయం, షాపుల కిరాయి, కూరగాయలు, వాటర్ మోటార్ల రిపేరు, బ్రహ్మోత్సవాల అలంకరణ పనుల హక్కుల కోసం వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

March 19, 2026 / 10:02 AM IST

’19వ వార్డులో మంచినీటి సమస్యను పరిష్కరించండి’

వనపర్తి జిల్లా లోని 19వ వార్డులో గత వారం రోజులుగా మంచినీటి సమస్య నెలకొందని వెంటనే పరిష్కారం చూపాలని కౌన్సిలర్ మురళి సాగర్ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లుకు విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది ఉగాది, రంజాన్ పండుగలు ఏకకాలంలో రావడం వల్ల మంచినీటి వాడకం అధికంగా ఉంటుందని దానిని దృష్టిలో ఉంచుకుని లీకేజీలు, నిరంతరం మంచినీటి పంపిణీని చేపట్టాలని వినతిపత్రం అందజేశారు.

March 19, 2026 / 10:01 AM IST

ఉగాది వేళ మన్యంకొండకు భక్తుల రద్దీ

MBNR: నూతన తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మన్యంకొండ దేవస్థానంకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో నిలబడి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

March 19, 2026 / 10:00 AM IST

‘కలెక్టరేట్ వద్ద ధర్నా విజయవంతం చేయండి’

SRD : శివ్వంపేట మండలం దొంతి గ్రామం ఎస్సీ కాలనీలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళలో నివసిస్తున్న వారి సమస్యలను సీపీఎం ప్రతినిధి బృందం తెలుసుకుంది. నివాసితులకు పట్టాలు ఇవ్వాలని, ఉపాధి హామీ పనులు ప్రారంభించాలని, సీసీ రోడ్లు, విద్యుత్ దీపాలు, మురుగు కాలువలు నిర్మించాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. మార్చి 24న కలెక్టర్ ముందు ధర్నాకు రావాలన్నారు.

March 19, 2026 / 10:00 AM IST

కాళేశ్వరం నీటితో రైతన్నల హర్షం

MDK: కాళేశ్వరం ప్రాజెక్టు నీరు రామాయంపేట మండలం డి. ధర్మారం గ్రామానికి చేరుకోవడంతో కెనాల్ కాల్వ నిండుగా ప్రవహిస్తోంది. దీనిపై గ్రామ సర్పంచ్ బండారు శ్రీనివాస్ గౌడ్, మహేందర్ గౌడ్, వార్డు సభ్యులు, వ్యవసాయదారులు హర్షం వ్యక్తం చేశారు. సాగునీరు పుష్కలంగా అందడంతో వరి పంటలు బాగా పండుతాయని ధీమా వ్యక్తం చేస్తూ, నీటిని విడుదల చేసిన ప్రభుత్వానికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

March 19, 2026 / 09:56 AM IST

ఈనెల 20న జిల్లా మహాసభలు

NZB: అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం నిజామాబాద్ జిల్లా ప్రథమ మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా నాయకుడు సీహెచ్. రమేష్ పిలుపునిచ్చారు. సాలూరలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 20న జిల్లా కేంద్రంలోని కోటగల్లీ ఎన్.ఆర్ భవన్లో ఈ మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

March 19, 2026 / 09:56 AM IST

మోత్కూర్‌లో దేవతలకు పట్టు వస్త్రాలు

BHNG: మోత్కూర్‌లో ఉగాది సందర్భంగా గ్రామ దేవతలకు పట్టు వస్త్రాల అలంకరణ కార్యక్రమం నిర్వహించారు. ఛైర్‌పర్సన్ గడ్డం సప్న, వైస్ ఛైర్మన్ పల్లెర్ల వెంకన్న ఆధ్వర్యంలో బొడ్రాయి వద్ద డప్పు చప్పులతో సమర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సతీష్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఉగాది పండుగను స్థానికులు ఘనంగా జరుపుకున్నారు.

March 19, 2026 / 09:55 AM IST

వినియోగదారుల హక్కుల కరపత్రం ఆవిష్కరణ

NLG: చండూరులో జాగృతి వినియోగదారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినియోగదారుల హక్కులు, బాధ్యతలపై కరపత్రికను ఆర్డీవో వీ.శ్రీదేవి ఆవిష్కరించారు. ప్రతి వ్యక్తి జననం నుంచి వినియోగదారుడేనని ఆమె తెలిపారు. వస్తువులు, సేవలు వినియోగించే వారందరికీ హక్కులు వర్తిస్తాయని చెప్పారు. పోటీ ప్రపంచంలో అవగాహన అవసరమని సూచించారు.

March 19, 2026 / 09:52 AM IST