KMM: న్యాయ సేవల అథారిటీ జిల్లా ఛైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. రాజగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం, అత్యధిక కేసులను పరిష్కరించడంతో పాటు తక్షణ న్యాయం అందించాలనే లక్ష్యంతో ఈనెల 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. కోర్టు ఆవరణలో బుధవారం న్యాయమూర్తులు, పోలీసు, వివిధ శాఖల అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
SRD: సిర్గాపూర్ మండలం గోసాయిపల్లి గ్రామం మీదుగా బీటి రోడ్డు నిర్మాణం పనులకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ రోడ్డు అభివృద్ధికి 2024-25 CRR నిధులు రూ. 179 లక్షలు మంజూరయ్యాయి. దీంతో సుల్తానాబాద్ PWD రోడ్డు నుంచి గోసాయిపల్లి మీదుగా పోచాపూర్ క్రాసింగ్ పీఆర్ రోడ్ వరకు రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టారు. త్వరగా BT రోడ్డు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.
WGL: గ్రేటర్ వరంగల్ 20వ డివిజన్ పరిధిలోని కాశీబుగ్గలోని రంగనాథ స్వామి దేవాలయంలో ఇవాళ చండీహోమాన్ని నిర్వహించారు. అమావాస్య సందర్భాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం జరిగింది. స్థానిక మహిళలు, దంపతులు కార్యక్రమంలో పాల్గొని హోమం చేశారు. దేవాలయం మాజీ అధ్యక్షులు వంగరి రవి, కమిటీ సభ్యులు, అర్చకులు ఆరుట్ల కృష్ణమాచార్యులు, తదితరులున్నారు.
JN: పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు నేటి నుంచి ఈనెల 22వ తేదీ వరకు మూసి వేయనున్నట్లు యార్డు ఛైర్మన్ శివరాజ్ యాదవ్ తెలిపారు. ఉగాది, రంజాన్, వారంతపు సెలవుల కారణంగా నాలుగు రోజులపాటు మార్కెట్ బంద్ కానున్నట్లు ఆయన వెల్లడించారు. మళ్లీ ఈనెల 23వ తేదీన మార్కెట్ పున: ప్రారంభం కానున్నట్లు ఆయన పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలన్నారు.
మోత్కూర్, ఆత్మకూర్, గుండాల, అడ్డగూడూరులో ఉగాది పండుగ సందర్భంగా మాంసం దుకాణాల ముందు రద్దీ నెలకొంది. మెయిన్ రోడ్డులో మటన్ కొనేందుకు పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చారు. దీంతో అక్కడ పండుగ వాతావరణం సంతరించుకుంది. రోడ్డుకి ఇరువైపులా జనాలు నిండిపోవడంతో రద్దీగా మారింది. కిలో మటన్ రూ.800 ఉందని వినియోగదారులు చెబుతున్నారు.
WGL: నర్సంపేట మినీ స్టేడియంలో వాకర్స్ ఇంటర్నేషనల్ 303,అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగాది నూతన శ్రీ పరాభవ నామ సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డా. పుల్లూరి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వం వహించారు. ఉగాది కొత్త ఆశలు, లక్ష్యాలకు నాంది పలికే పండుగ అని ఆయన పేర్కొన్నారు. కొత్త సంవత్సరంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
RR: చేవెళ్ల మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రూ. 100 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని టీపీసీసీ మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ అష్వాక్ అలీ డిమాండ్ చేశారు. పట్టణంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్లు, వంటి మౌలికసదుపాయాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు.
నిర్మల్ పట్టణానికి రింగురోడ్డు ఆవశ్యకత ఎంతో అవసరం ఉంది. జిల్లా కేంద్రంగా ఏర్పడడంతో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో జిల్లా ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. నిర్మల్ చుట్టూ రింగ్ రోడ్డు ఏర్పడినట్లయితే ట్రాఫిక్ ఇబ్బందులు తీరడంతో పాటు పట్టణ శివారు ప్రాంతంలో ఉన్న ప్రధాన కార్యాలయాలకు ఈ రింగ్ రోడ్డు ఎంతో ఉపయోగం కానుంది.
PDPL: RGM సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం దగ్గర గల దుకాణ సముదాయంలో అద్దెపై లబ్ధిదారుల ఎంపిక గురించి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ శ్రీ హర్ష తెలిపారు. SC నిరుద్యోగ యువత సొంత పెట్టుబడితో జీవనోపాధి కొరకు వ్యాపారం ప్రారంభించేందుకు ఈనెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కలెక్టరేట్లోని SC కార్పొరేషన్ రూమ్ నెంబర్ 225లో దరఖాస్తులు అందజేయాలన్నారు.
SRCL: కోనరావుపేట మండలంలోని నాగారం ప్రభుత్వ పాఠశాల సుద్దాల రుసివాని విద్యానికేతన్ విద్యార్థులు నవోదయ పాఠశాలకు ఎంపికయ్యారు. సుద్దాల పాఠశాలకు చెందిన మంగళగిరి జయ కేశవ్, పేనుగంటి మను శ్రీ, ఎర్రబెల్లి చైత్ర, నాగారం పాఠశాల చెందిన మేండే దివ్యలు ఎంపిక కాగా డీఈవో జగన్మోహన్ రెడ్డి, ఎంఈవో మురళి నాయక్, కరస్పాండెంట్ దాసు, హెచ్ఎం అరుణ, ఉపాధ్యాయ బృందం అభినందించారు.
MHBD: ఎలాంటి అనుమతులు లేకుండా పాలేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు దంతాలపల్లి ఎస్సై పిల్లల రాజు తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్లను స్థానిక తహసిల్దార్ ఎదుట బైండోవర్ చేసి జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. అనుమతులు లేకుండా ఇసుక తరలించినట్లయితే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
VKB: దుద్యాల్లోని రైతు వేదికలో ఎస్ఎమ్ఎమ్ 2025-26 పథకంలో మంజూరైన 7 రోటవేటర్లను లబ్ధిదారులకు అందించారు. దుద్యాల మండల వ్యవసాయ అధికారి నాగరాజు తైవాన్ స్పేయర్స్ సీడ్ డ్రిల్స్ కల్టివేటర్స్ వంటివి రైతులకు ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ వేణుగోపాల్, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, ఏఈవోలు భావన, జ్యోతి ఉన్నారు.
JGL: మల్యాల మండలంలోని రైతులు యాసంగి రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని AO చంద్ర దీపక్ తెలిపారు. ఫిబ్రవరి 28 వరకు కొత్త పట్టాదారు పాసు పుస్తకం పొందిన రైతులు ఈనెల 25లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హులైన రైతులు దరఖాస్తు ఫారంతో పాటు, పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాకు చెందిన జిరాక్స్ కాపీలను మండల వ్యవసాయ కార్యాలయంలో అందజేయలన్నారు.
WGL: వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీల ద్వారా ప్రజల జీవితాల్లో సంతోషం పెరగాలని, ఈ సంవత్సరంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, రైతులు అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
NLG: వసంతం రావడంతో తెలుగు లోగిళ్లు ఉగాది పండుగకు సిద్ధమయ్యాయి. గతేడాది వింత వ్యాధితో ఎండిపోయి రంగు మారిన వేప చెట్లు, ఇప్పుడు చిగురించి పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. వేప పువ్వు కొరత ఉంటుందని ఆందోళన చెందిన భక్తులకు, చెట్లు నిండుగా పూత పూయడం పెద్ద ఉపశమనాన్నిస్తోంది. ఈ ఏడాది ఉగాది పచ్చడికి వేప పువ్వు పుష్కలంగా లభించనుంది.