MDCL: మేడ్చల్ పరిసర ప్రాంతాలలో వేసవి వేళ ఓవైపు భూగర్భ జలాలు తగ్గుముఖం పడుతుంటే, కొంతమంది ఎలాంటి పర్మిషన్లు లేకుండా బోర్లు వేస్తూ భూగర్భ జలాలను తోడేస్తున్నారని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని భూగర్భ జల శాఖ అధికారులు తగిన విధంగా పరిశీలించి, చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
IPL ట్రేడ్ డీల్‌లో సంజూ శాంసన్ RR నుంచి CSKలో చేరిన సంగతి తెలిసిందే. గతంలో రాజస్థాన్ నుంచి చెన్నైకి వచ్చిన రవీంద్ర జడేజా, షేన్ వాట్సన్, రాబిన్ ఉతప్ప, శివమ్ దూబే, అజింక్యా రహానే ట్రోఫీ గెలిచారు. వాట్సన్(2018), ఉతప్ప(2021), రహానే(2023) అయితే CSK తరఫున తొలి టోర్నీలోనే కప్ అందుకున్నారు. ఈ క్రమంలో సంజూ కూడా ఈ సారి కప్ గెలుస్తాడని CSK ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల వేళ ఐకమత్యంగా ఉండాలన్న ప్రధాని మోదీ పిలుపుపై ‘కాంతార’ నటుడు కిషోర్ మండిపడ్డారు. దేశాన్ని కులమతాల వారీగా విభజించి, ప్రజల మధ్య ద్వేషాన్ని నింపిన తర్వాత మళ్లీ ‘అందరం ఒకటి’ అనడంపై ఆయన సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. ప్రధాని అనాలోచిత నిర్ణయాల వల్ల దేశం ఇప్పటికే ఎన్నో సవాళ్లు ఎదుర్కొందని, ఇకనైనా విద్వేష రాజకీయాలు ఆపాలని అన్నారు.
WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని రామాలయంలో రేపు శ్రీరామనవమి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు ఇవాళ తెలిపారు. ఉదయం 6 గంటలకు స్వామివారి విగ్రహాలకు అభిషేకాలు, ఉదయం11 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.
AP: మార్కాపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై విచారణ చేస్తున్నామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో బస్సు, టిప్పర్ రెండూ రాంగ్ రూట్‌లో ఉన్నాయని ప్రాథమికంగా నిర్ధారణ అయిందని, టిప్పర్ డీజిల్ ట్యాంకర్‌ను బస్సు ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయని చెప్పారు. బస్సు డ్రైవర్ చెప్పిన స్టీరింగ్ స్ట్రక్ విషయంపై పూర్తి స్థాయిలో విశ్లేషిస్తామన్నారు.
వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా సినిమాటోగ్రాఫర్ రవి కె. చంద్రన్ సోషల్ మీడియా వేదికగా క్రేజీ అప్‌డేట్ ఇచ్చాడు. ఇప్పటికే నెల రోజుల సుదీర్ఘ షెడ్యూల్ విజయవంతంగా పూర్తయిందని తెలిపాడు. ప్రస్తుతం చిన్న బ్రేక్ తీసుకున్న చిత్ర యూనిట్.. త్వరలోనే తదుపరి షెడ్యూల్‌ను స్టార్ట్ చేయనున్నట్లు చెప్పాడు.
CTR: పుంగనూరు పట్టణం నగిరి వీధి శ్రీసోమేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రెండవ రోజు ఉదయం సింహ వాహనం సేవ నిర్వహించారు. ఉదయం స్వామివారికి అభిషేకాలు, హోమాలు, నిర్వహించి ఉత్సవ విగ్రహమూర్తులను ప్రత్యేక పూజలు చేశారు. సింహ వాహనంపై మంగళ వాయిద్యాల మధ్య పురవీధుల్లో ఊరేగించారు.
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘నాగబంధం’. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది. 2026 జూలై 3న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు మేకర్స్ ప్రకటిస్తూ పోస్టర్ షేర్ చేశారు. ఇక 1750 కాలం నాటి నేపథ్యంలో దేవాలయ నిధి రహస్యాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. నభా నటేష్, ఐశ్వర్యా మేనన్, జగపతి బాబు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు.
AP: జగన్ రాష్ట్ర రాజకీయాల గురించి కాకుండా CM చంద్రబాబుపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మండిపడ్డారు. ‘చంద్రబాబు మైండ్ సెట్ బాగోలేదని జగన్ అంటున్నారు. కానీ CBN ముఖమే తెలుగు జాతి తలెత్తుకునేలా చేసింది. మా నాయకులను బాడీ షేమింగ్ చేస్తే ఒకే మాటలో చంపేయగలం’ అని హెచ్చరించారు. పాస్ పుస్తకాలపై ఫొటో వేసుకున్న మైండ్ సెట్ ఎవరిదని ప్రశ్నించారు.
TPT: ఎర్పేడు మండలం ఆ మందూరు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గురువారం ఎ.ఆర్.పి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు టూత్‌పేస్ట్, బ్రష్‌లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి ధర్మారెడ్డి మోహన్ రెడ్డి విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ ప్రతిరోజూ దంత ధావన చేయాలని సూచించారు.
GNTR: మంగళగిరి మండలం యర్రబాలెం గ్రామంలో మంత్రి నారా లోకేష్ చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఎల్‌వోసీ చెక్కును టీడీపీ నాయకులు పంపిణీ చేశారు. మాచర్ల వెంకటనారాయణకు రూ.2,85,527 విలువైన ఎల్‌వోసీ మంజూరు పత్రాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
HYD: ఆరోగ్యశ్రీ బిల్లుల విడుదలలో జాప్యం జరుగుతోందని, దీంతో చిన్న ఆసుపత్రులు మూతపడే పరిస్థితి నెలకొందని హరీష్ రావు ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.5 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు 607 మందికి డబ్బులు విడుదల చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచినా కేవలం 496 మందికే ఇచ్చారని వివరించారు.
HYD: ఆరోగ్యశ్రీ బిల్లుల విడుదలలో జాప్యం జరుగుతోందని, దీంతో చిన్న ఆసుపత్రులు మూతపడే పరిస్థితి నెలకొందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.5 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు 607 మందికి డబ్బులు విడుదల చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచినా కేవలం 496 మందికే ఇచ్చారని వివరించారు.
BHPL: గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం పోలీస్ శాఖ సామాజిక బాధ్యతలో భాగమని జిల్లా SP సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. ఇవాళ అడవి ముత్తారం పోలీస్ స్టేషన్ పరిధిలోని పెగడపల్లి ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంప్‌లో SP పాల్గొన్నారు. SP మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఇలాంటి మెగా వైద్య శిబిరాలను కొనసాగిస్తామన్నారు.
MHBD: నిస్వార్థ ప్రజానాయకుడు కామ్రేడ్ ధర్మబిక్షం జీవితం నేటి సమాజానికి ఆదర్శనీయమని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సుధాకర్ రెడ్డి అన్నారు. కురవిలో ధర్మబిక్షం 15వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సీపీఐ సీనియర్ నాయకులు బుడమ వెంకన్న, దూదికట్ల సారయ్య, బొల్లం విజయ్, బొల్లం అనిల్,, తదితరులు ఉన్నారు.