• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి

MNCL: క్యాతనపల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఆదివారం క్యాతనపల్లి మున్సిపాలిటీ 8, 9 వార్డుల్లో రూ.13 లక్షల TUFIDC నిధులతో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. గత ప్రభుత్వంలో తీసుకువచ్చిన నిధులతోనే అభివృద్ధి జరుగుతోందని BRS నాయకులు చేస్తున్న ప్రచారంను మంత్రి ఖండించారు.

March 22, 2026 / 10:33 AM IST

‘అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి’

BHPL: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు ఆధ్వర్యంలో ఈ నెల 23న నిర్వహించనున్న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి భూపాలపల్లి జిల్లా నుంచి కార్యకర్తలు భారీగా హాజరై విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డి కోరారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.

March 22, 2026 / 10:33 AM IST

MP మహేశ్‌కు మద్దతుగా బ్యానర్‌లు

KDP: కొద్దిరోజులుగా డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏలూరు MP పుట్టా మహేశ్ యాదవ్‌కు మద్దతుగా కడప జిల్లాలో పలుచోట్ల బ్యానర్లు వెలిశాయి. మైదుకూరు నియోజకవర్గం మొర్రాయిపల్లి రోడ్డులో ‘న్యాయం నిలుస్తుంది, నిజాయితి గెలుస్తుంది.. వీ స్టాండ్ విత్ పుట్టా మహేశ్, ఇట్లు చాపాడు మండల ప్రజలు’ అనే వాక్యాలతో బ్యానర్‌లో రాసి ఉంది.

March 22, 2026 / 10:33 AM IST

శ్రీ సీతారామస్వామి కళ్యాణానికి రావాలని మాజీ మంత్రికి ఆహ్వానం

JGL: జగిత్యాల పట్టణంలోని ఇందిరా భవన్‌లో మాజీ మంత్రి జీవన్ రెడ్డిని సీతారామచంద్ర స్వామి ఆలయ కమిటీ సభ్యులు ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా పట్టణంలోని విద్యానగర్ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఈనెల 27న జరిగే శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి రావాలని ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

March 22, 2026 / 10:32 AM IST

కారంచేడులో భూ సమస్యలపై ప్రత్యేక శిబిరం

BPT: భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ క్లినిక్ కారంచేడు ఎమ్మార్వో కార్యాలయంలో నిర్వహించనున్నారు. చీరాల ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించి పరిష్కార చర్యలు చేపడతారు. రైతులు, భూసంబంధిత సమస్యలున్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.

March 22, 2026 / 10:30 AM IST

మామిడిపల్లిలో పారిశుద్ధ్య పనులు ప్రారంభం

VZM: సంతకవిటి మండలం మామిడిపల్లి గ్రామంలో సర్పంచి కోల్ల రేవతి ఆధ్వర్యంలో వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. గ్రామంలోని మరుగు కాలువ పూడుకతీత పనులు చేపట్టినట్లు పంచాయతీ కార్యదర్శి కూనబిల్లి కోటేశ్వరరావు తెలిపారు. మురుగు కాలవలోని పూడిక గ్రామ శివారు ప్రాంతానికి తరలించడం జరిగిందన్నారు.

March 22, 2026 / 10:30 AM IST

భట్టి విక్రమార్కకు MLA నల్లమిల్లి ఆహ్వానం

E.G: అనపర్తి MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శనివారం రాత్రి తెలంగాణ డిప్యూటీ CM మల్లు భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుమార్తె డాక్టర్ సనాతని వివాహ ఆహ్వాన పత్రికను అందజేసి వేడుకకు రావాలని కోరారు. గౌరు చరితరెడ్డి, వెంకటరెడ్డిల కుమారుడు జనార్ధన్ రెడ్డితో సనాతని వివాహం ఏప్రిల్ 2న హైదరాబాద్‌లో జరగనుందని ఎమ్మెల్యే నల్లమిల్లి తెలిపారు. 

March 22, 2026 / 10:30 AM IST

భారీగా పెరిగిన చికెన్ ధరలు!

KKD: పిఠాపురం మార్కెట్‌లో ఆదివారం చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. సాధారణ చికెన్ కిలో రూ.280 ఉండగా, స్కిన్‌లెస్ రూ. 350, బోన్ లెస్ రూ. 420 వరకు విక్రయిస్తున్నారు. నాటుకోడి ధర రూ. 600కు చేరింది. గత వారంతో పోలిస్తే ధరలు భారీగా పెరగడంతో మాంసం ప్రియులు ఇబ్బంది పడుతున్నారు. ఒక్కసారిగా రేట్లు పెరగడంతో సామాన్యులు చికెన్ కొనాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు.

March 22, 2026 / 10:30 AM IST

గురుకులలో ప్రవేశాలకు దరఖాస్తులు

KRNL: బనవాసి బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశ పరీక్ష కోసం ఈ నెల 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ రాజిత ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీలో 60, బైపీసీలో 40, ఎంఈసీలో 30 సీట్లు ఉన్నాయని తెలిపారు.

March 22, 2026 / 10:29 AM IST

‘గాలికుంటు నివారణ టీకాలు వేయించాలి’

ADB: నెరడిగొండ మండలంలోని లక్కంపూర్ గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. మండల పశు వైద్యాధికారి డాక్టర్ రాథోడ్ జీవన్ మాట్లాడుతూ.. పశుపోషకులు తమ పాడి పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని సూచించారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఈ సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

March 22, 2026 / 10:28 AM IST

PSL నుంచి వైదొలిగిన మరో ప్లేయర్

PSL 2026 నుంచి ఆసీస్ ప్లేయర్ జేక్ మెక్‌గుర్క్ తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ‘రావల్‌పిండిజ్’ (కొత్త) టీమ్ ధ్రువీకరించింది. కాగా IPL 2024 & 25లో ఢిల్లీకి ఆడిన ఈ టాపార్డర్ బ్యాటర్.. ఇటీవలి వేలంలో అమ్ముడుపోలేదు. అయినప్పటికీ గాయపడినవారి స్థానంలో IPL 2026లో ఆడే ఛాన్స్ లేకపోలేదు. ఇక చార్లెస్ జాన్సన్(WI) తప్పుకోవడంతో కరాచీ కింగ్స్ రీజా హెండ్రిక్స్(SA)ని తీసుకుంది.

March 22, 2026 / 10:28 AM IST

త్వరలో యాదాద్రికి MMTS

NLG: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి భక్తులకు త్వరలో రైల్వే శాఖ తీపి కబురు అందించనుంది. వచ్చే నెలలో ప్రధాని మోదీ చేతుల మీదుగా MMTS రెండో దశ పనులకు అంకురార్పణ జరగనుంది. సుమారు రూ.430 కోట్ల వ్యయంతో ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు 33KM మేర కొత్త లైన్ నిర్మించి, రెండున్నరేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని దక్షిణ మధ్య రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది.

March 22, 2026 / 10:26 AM IST

గ్రంథాలయంలో చదువుపై అవగాహన కార్యక్రమం

BPT: సంతమాగులూరు శాఖ గ్రంథాలయంలో ఇవాళ విద్యార్థులకు చదువుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. లైబ్రేరియన్ విజయభాస్కర్‌రెడ్డి గ్రంథాలయాల ఉపయోగాన్ని వివరించి, నిత్యం చదవడం అలవాటు చేసుకోవాలని సూచించారు. పుస్తక పఠనం ద్వారా విజ్ఞానం పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.

March 22, 2026 / 10:25 AM IST

యుద్ధంలో నెల్లికుదురు వాసి మృతి..!

MHBD: సౌదీ అరేబియా-ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో జిల్లాకు చెందిన వ్యక్తి మరణించాడు. నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామానికి చెందిన రవిగోపాల్ ఉపాధి నిమిత్తం కొద్దిరోజుల క్రితం సౌదీ అరేబియా వెళ్ళాడు. ఇటీవల ఇరాన్ జరిపిన డ్రోన్ సిబ్బంది దాడిలో రవిగోపాల్ తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు అధికారులక సమాచారం అందించారు.

March 22, 2026 / 10:24 AM IST

మందకృష్ణ మాదిగ నేటి పర్యటన వాయిదా

SRPT: పోలీస్ లాకప్‌లో మృతి చెందిన కథల రాజేష్ కేసు విచారణపై చర్చించేందుకు నేడు కోదాడలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశం వాయిదా పడింది. మందకృష్ణ మాదిగ అనివార్య కారణాల వల్ల రాలేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు సోమవారం ఉదయం 10 గంటలకు ఒక ప్రకటనలో తెలిపారు.

March 22, 2026 / 10:23 AM IST