• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మోహన్ కృష్ణ మరణం టీడీపీకి తీరని లోటు : MLA

SKLM: నగరంలోని మండలి వీధిలో నివాసం ఉంటున్న టీడీపీ కార్యకర్త మోహన్ కృష్ణ మరణం టిడిపికి తీరని లోటుఅని నరసన్నపేట ఎమ్మెల్యే రమణమూర్తి అన్నారు. శనివారం రాత్రి మోహనకృష్ణ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు.

March 22, 2026 / 09:12 AM IST

BELలో ఉద్యోగాలు.. గడువు ముగుస్తోంది

భారత రక్షణ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) నెట్‌వర్క్ & సైబర్ సెక్యూరిటీ విభాగంలో 18 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఎల్లుండి(మంగళవారం)తో ముగియనుంది. ఫీల్డ్ ఆపరేషన ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు ఉండగా.. విద్యార్హతతో పాటు సంబంధిత IT సర్టిఫికేషన్ గలవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.400+18% GST. SC, ST, దివ్యాంగులకు ఫీజు లేదు.

March 22, 2026 / 09:12 AM IST

‘వాహనాల అధిక వేగంతో అందరికీ ఇబ్బంది’

MNCL: వాహనాలను అధిక వేగంతో నడిపితే వాహన దారులకు వన్యప్రాణులకు నష్టం జరిగే అవకాశం ఉందని స్థానిక FDO రామ్మోహన్ అన్నారు. ఆదివారం ఉదయం ఆయన మాట్లాడుతూ.. అభయారణ్యం వన్యప్రాణులకు నిలయమన్నారు. దీంతో కవ్వాల్ అభయారణ్యంలో వేగ పరిమితి గంటకు 30 కిలోమీటర్లకు పరిమితం చేయడం జరిగిందన్నారు. అవసరమైన చోట్ల స్పీడ్ బ్రేకర్లను కూడా ఏర్పాటు చేశామని FDO తెలిపారు.

March 22, 2026 / 09:10 AM IST

అరటిపండు.. ఇన్‌స్టాంట్ ఎనర్జీ..!

చాలామంది ఉదయం బ్రేక్ ఫస్ట్ స్కిప్ చేస్తుంటారు. అలా చేయకుండా ఒక అరటిపండు, గ్లాస్ పాలు తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అరటిపండులో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించడమే కాకుండా రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అంతేకాదు అరటిపండు గుండె ఆరోగ్యానికి, జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది.

March 22, 2026 / 09:10 AM IST

రోడ్డు ప్రమాదం.. యువకుడికి తీవ్ర గాయాలు

NLR: జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. శనివారం రాత్రి ఒంగోలు నుంచి భీమవరానికి బైక్‌పై వస్తున్న ఉలవపాడు మండలం భీమవరం గ్రామానికి చెందిన సురేశ్ అనే యువకుడు పాలేరు బ్రిడ్జి సమీపంలో అదుపుతప్పి కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ అతడిని స్థానికులు గుర్తించి అంబులెన్స్‌లో ఒంగోలు ఆసుపత్రికి తరలించారు.

March 22, 2026 / 09:08 AM IST

మునగాలలో వికలాంగుల వినూత్న నిరసన

SRPT: మునగాల మండలం బరాఖత్ గూడెంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. బడ్జెట్‌లో వికలాంగుల సంక్షేమానికి తగినన్ని నిధులు కేటాయించలేదని ఆరోహిస్తూ వికలాంగులు బట్టలు చింపుకొని, బలుసు ఆకులు తింటూ బడ్జెట్ పత్రాలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ మాట్లాడారు.. దివ్యాంగుల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలన్నారు.

March 22, 2026 / 09:08 AM IST

BREAKING: ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

AP: తూర్పు గోదావరి జిల్లా యర్నగూడెం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్తున్న ఓ కారు నియంత్రణ కోల్పోయి హైవే డివైడర్‌ను దాటి మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో మరో నలుగురికి గాయలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీప గోపాలపురం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 22, 2026 / 09:08 AM IST

‘తిమ్మరాజుపల్లి టీవీ’ రిలీజ్ డేట్ ఇదే

టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్న మూవీ ‘తిమ్మరాజుపల్లి టీవీ’. ఈ సినిమాలో సాయి తేజ్, వేద జలంధర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుపుతూ మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాకు వి. మునిరాజు దర్శకత్వం వహిస్తున్నాడు.

March 22, 2026 / 09:08 AM IST

పచ్చర్లలో దస్తగిరయ్య ఉర్సు ఉత్సవాలు

GDWL: రాజోలి మండలంలోని పచ్చర్ల గ్రామంలో దస్తగిరయ్య ఉర్సు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం గ్రామ సర్పంచ్ బేబీ ఆధ్వర్యంలో ‘కిస్తీ’ వేడుకలను భక్తిశ్రద్ధతో నిర్వహించారు. వేలాది మంది భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించి కిస్తీ సమర్పించారు. గ్రామ పెద్దలు, భక్తులు భారీగా పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు.

March 22, 2026 / 09:06 AM IST

విజయవాడ ఆలయంలో ఇంటి దొంగలు

AP: విజయవాడ నగర శివారు యనమలకుదురు శివాలయంలో అధికారులే చోరీకి పాల్పడటం సంచలనంగా మారింది. అర్చకుడు సాగర్ ఆలయానికి మారు తాళాలు చేయించి ఎవరూ లేనప్పుడు హుండీ  కానుకలను మాయం చేసేవాడని తేలింది. ఆలయ మంటపంలోని 16 CC కెమెరాలను ఆఫ్ చేసేవాడని, గత రెండేళ్లలో దాదాపు రూ.10 లక్షల విలువైన కానుకలు మాయమైనట్లు పోలీసులు తెలిపారు. దీనికి ఆలయ ఈఓ భవాని సూత్రధారిగా ఉన్నట్లు తెలుస్తోంది.

March 22, 2026 / 09:05 AM IST

సంక ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

BDK: అశ్వరావుపేట చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సంకా ప్రసాద్ మాతృమూర్తి వరలక్ష్మి అనారోగ్యంతో ఇవాళ ఉదయం మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వారి నివాసానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ముఖ్యంగా వ్యాపార వర్గాలకు చెందిన పలువురు నాయకులు, సభ్యులు ఈ వార్త విని దిగ్భ్రాంతికి గురైనట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.

March 22, 2026 / 09:05 AM IST

దాడులు చేస్తే ఊరుకునేది లేదు: ఎమ్మెల్యే

KRNL: ఆదోనిలోని గౌలిపేట కిందిగేరిలో ఇటీవల గాయపడిన బోయ రామును ఎమ్మెల్యే పార్థసారథి వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ.. నిరపరాధులపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. యువత అనవసర గొడవలకు దూరంగా ఉండాలని సూచించారు. చిన్న గొడవలు పెద్ద సమస్యలుగా మారి కుటుంబాలకు ఇబ్బందులు కలిగిస్తాయని ఎమ్మెల్యే తెలిపారు.

March 22, 2026 / 09:04 AM IST

మల్లెబోయిన్పల్లిలో సీసీ రోడ్ల ప్రారంభం

MBNR: జడ్చర్ల మండలం మల్లెబోయిన్పల్లి గ్రామపంచాయతీలో ఎంపీ డీకే అరుణ కేటాయించిన నిధులతో సర్పంచ్ చికూరి శేఖర్ ముదిరాజ్, ఉప సర్పంచ్ శేఖర్ శనివారం సీసీ రోడ్ల నిర్మాణం ప్రారంభించారు. బీజేపీ నేతలు, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొని ఎంపీ నిధుల ద్వారా గ్రామ అభివృద్ధి ముఖ్యమని వివరించారు.

March 22, 2026 / 09:04 AM IST

ఘనాపూర్ గ్రామంలో స్వచ్ఛ భారత్

MDK: తూప్రాన్ మండలం ఘనపూర్ గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టారు. ఆదివారం పాలకవర్గ సభ్యులు, యువత హనుమాన్ ఆలయం వద్ద స్వచ్ఛభారత్ నిర్వహించి శుభ్రం చేశారు. గతంలో నిర్వహించి నిలిపివేయగా, మళ్లీ స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. హనుమాన్ ఆలయం వద్ద జరిగిన స్వచ్ఛ భారత్‌లో సర్పంచ్ వెంకటేష్, పాలకవర్గ సభ్యులు, యువత పాల్గొన్నారు.

March 22, 2026 / 09:02 AM IST

గ్యాస్ నౌక ఆలస్యం.. కిరోసిన్ పంపిణీ

VSP: హార్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతల ప్రభావంతో విశాఖకు ఈ నెల 21న రావాల్సిన గ్యాస్ నౌక 26న చేరనుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గ్యాస్ కొరత నేపథ్యంలో కేంద్రం కేటాయించిన 2800 కిలోలీటర్ల కిరోసిన్‌ను వచ్చే సోమవారం నుంచి గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో రేషన్ ద్వారా లీటరు చొప్పున పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.

March 22, 2026 / 09:00 AM IST