PDPL: పెద్దపల్లి లేబర్ ఆఫీసర్ హేమలతపై చర్యలు తీసుకోవాలని దళిత, బహుజన లేబర్ అసోసియేషన్ ప్రతినిధులు చెన్నూర్ క్యాంపు కార్యాలయంలో మంత్రి వివేక్ వెంకట స్వామికి వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక సహాయాన్ని అడ్డుకుంటూ, కార్మికులను వేధింపులకు గురి చేస్తున్నారని వారు ఆరోపించారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు మంత్రిని కోరారు.
అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబోలో రాబోతున్న ప్రాజెక్టుపై అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీలో బాలీవుడ్ నటి అనుష్క శర్మ చేరినట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే దీపికా పదుకొనె, రష్మిక, మృణాల్, జాన్వీ కపూర్ వంటి హీరోయిన్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతుండగా, అనుష్క చేరికతో ఈ సినిమాకు మరింత గ్లామర్ తోడైంది. ఇది ఆమెకు పవర్ ఫుల్ కమ్‌బ్యాక్ కానుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
PPM: మన్యం లీగ్స్-2026 జిల్లా స్థాయి క్రికెట్‌లో విజేతగా కురుపాం జట్టు నిలిచింది. ఈ మేరకు శనివారం నిర్వాహకులు DSTO శ్రీధర్ చేతులమీదుగా విజేతలకు ట్రోఫీతో పాటు రూ.5వేలు నగదు బహుమతి అందించారు. రన్నరప్‌గా వీరఘట్టం జుట్టుకు రూ.3వేలు, తృతీయ స్థానం సాధించిన కొండవాడ జట్టుకు రూ.2వేలు బహుమతి అందజేసారు. అనంతరం డీఎస్టీవో శ్రీధర్ విజేతలను అభినందించారు.
CTR: గుడిపాల మండల పరిధిలో శనివారం భారీగా పొగాకు ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిద్ధార్థ్ నగర్ నుంచి వేలూరు వైపుగా పొగాకు ఉత్పత్తులను అక్రమంగా తరలిస్తున్న వాహనాలను 2 టౌన్ సీఐ, గుడిపాల యాదమరి ఎస్సై తనిఖీ చేశారు. కూల్ లిప్స్, హాన్స్, విమల్ 23 బ్యాగులు, యాదమరి జంక్షన్ వద్ద 22 బ్యాగులు, 2 వాహనాలను పట్టుకుని సీజ్ చేశారు.
MDK: రామాయంపేట మండలం అక్కన్నపేటలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రామ్ రెడ్డి అనే (40) సంవత్సరాల యువకుడు నిజామాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఉగాది పండగకు ఇంటికి వచ్చి వెళ్లిన రామ్ రెడ్డి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో శుక్రవారం రాత్రి ఇంట్లో మృతి చెందారు. శనివారం సాయంత్రం రామ్ రెడ్డి మృతిని గమనించారు.
పల్నాడు: నరసరావుపేటలో చికెన్ ధరలు సామాన్యులకు గుదిబండగా మారాయి. పండగల సీజన్ కావడంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి తగ్గడంతో ధరలు అమాంతం పెరిగాయి. ప్రస్తుతం లైవ్ కోడి కిలో రూ.180 పలుకుతుండగా, స్కిన్ చికెన్ రూ.320-340, కీమా 340-360కి విక్రయిస్తున్నారు. మటన్ కేజీ రూ.900-1000కి చేరగా, 100 గుడ్ల ధర రూ. 445గా ఉంది. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
WG: కొవ్వాడ 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం పరిధిలో అత్యవసర నిర్వహణ పనుల కారణంగా ఇవాళ విద్యుత్ అంతరాయం కలుగుతుందని ఈఈ వెంకటేశ్వరరావు తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గరగపర్రు రోడ్, విష్ణు కాలేజీ రోడ్డు, దుర్గపురం, కొవ్వాడ, అన్నవరం తదితర ప్రాంతాల్లో సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు
RR: నాదర్‌గుల్‌లోని గ్రీన్ హోమ్స్ కాలనీలో సైబర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సోషల్ మీడియా, తాజా డిజిటల్ అరెస్టుల వాటిపై వివరించారు. మోసపూరిత కాల్స్, ఓటీపీలు/పాస్‌వర్డ్‌ను పంచుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. తెలియని వ్యక్తులకు బ్యాంకు వివరాలు పాస్‌వర్డ్ ఇవ్వకూడదని సూచించారు.
SDPT: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించాల్సిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ కె. హైమావతి ఒక ప్రకటనలో తెలిపారు. 2027 జనాభా లెక్కల సేకరణపై జిల్లా స్థాయి అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి సోమవారం ఎవరూ కలెక్టరేట్‌కు రావద్దని ఆమె కోరారు.
తిరుపతిలో రైల్వే పోలీసుల అప్రమత్తతతో గంజాయి రవాణా ప్రయత్నం విఫలమైంది. డీఎస్పీ మురళీ మార్గదర్శకత్వంలో GRPS, RPF సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు చేసి ఇద్దరు అనుమానితులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 17 ప్యాకెట్లలో సుమారు 15.460 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.75 వేలుగా ఉంటుదని వారు అంచనా వేశారు.
KKD: విదేశాలకు అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని డీఎస్ఓ సత్యనారాయణ రాజు దాడి చేసి పట్టుకున్నారు. కాకినాడ పోర్టులో ఐదు లారీల్లో 140 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేస్తుండగా సమాచారం తెలుసుకున్న డీఎస్ఓ ఆకస్మిక దాడులు నిర్వహించి పట్టుకున్నారు. మొత్తం 140 టన్నుల బియ్యం ఖరీదు రూ.65లక్షలు ఉంటుందని వెల్లడించారు. ధాన్యాన్ని, ఎక్స్‌పోర్టు చేస్తున్న లారీలను సీజ్ చేశామని తెలిపారు.
EG: గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ హెచ్చరించారు. ఇప్పటివరకు 42 కేసులు నమోదు చేసి, 114 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో ఎల్పీజీ కొరత లేదని, పంపిణీదారుల వద్ద 10,897 సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
MBNR: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కుల వృత్తుల వారు, చేతివృత్తుల వారు సద్వినియోగం చేసుకోవాలని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ అన్నారు. శనివారం క్యాంపు కార్యాలయంలో కులవృత్తుల సంఘాలతో ఎంపీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్వర్ణకారులు, గొల్ల కురుమలకు ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయని వెల్లడించారు.
దేశంలో వాణిజ్య సిలిండర్ల సరఫరాపై ఉన్న ఆంక్షలు తొలగిపోనున్నాయి. రేపటి నుంచి వాణిజ్య సిలిండర్లు సరఫరా చేస్తామని కేంద్రం ప్రకటించింది. వాణిజ్య సిలిండర్ల సరఫరాను 20 శాతం పెంచినట్లు వెల్లడించింది. హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, క్యాంటీన్లకు ప్రాధాన్యత ఇవ్వాలని డీలర్లకు సూచించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, యూటీలకు లేఖ రాసింది.
VKB: ఉచిత గిఫ్టులు, లాటరీల పేరుతో వచ్చే ఆఫర్లకు ఆశపడి మోసపోవద్దని ధరూర్ ఎస్సై రాఘవేందర్ ప్రజలను కోరారు. ఉచితం అంటే అది కచ్చితంగా మోసమేనని గుర్తించాలని సూచించారు. ప్రజల అత్యాశనే మోసగాళ్లు పెట్టుబడిగా మార్చుకుంటున్నారని, ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. అనుమానిత లింకులను క్లిక్ చేయవద్దని స్పష్టం చేశారు.