AKP: ఉగాది సందర్భంగా అచ్యుతాపురం మండలం కొండకర్లలో నిర్వహించిన మండల స్థాయి చదరంగం పోటీలు శనివారం ముగిసాయి. ఈ పోటీల్లో తిమ్మరాజుపేటకు చెందిన పీ శ్రీనివాసరావు ప్రథమ స్థానం దక్కించుకున్నారు. ద్వితీయ స్థానంలో అనకాపల్లికి చెందిన కె తేజ, మూడవ స్థానంలో తిమ్మరాజుపేటకు చెందిన పీ నాగు, జూనియర్ విభాగంలో కౌశిక్, చైతన్య ప్రథమ ద్వితీయ స్థానం సాధించారు.
VSP: ఒడిశాకు చెందిన వ్యక్తి విశాఖలోని లాడ్జిలో దిగారు. ఐదుగురు వ్యక్తులు ఆయనను పరిచయం చేసుకొని మద్యం కొనుగోలు చేయించి దాడి చేశారు. అనంతరం సెల్ ఫోన్, నగదు దోచుకున్నారు. బాధితుడు ఎంవీపీ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సుంకరి గౌతమ్, కన్నన్ చందు, వంగర సాయిదినేశ్, నిశాంత్ రెడ్డి, జగదీశ్‌ను శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు CI చక్రధర్ రావు తెలిపారు.
కోనసీమ: సఖినేటిపల్లి మండలం పల్లెపాలెం మత్స్యకారుల వలకు శనివారం రెండు అరుదైన ఆడ కచ్చిడి చేపలు చిక్కాయి. ఔషధాల తయారీలో వీటిని వినియోగిస్తారని మత్స్యకారులు తెలిపారు. అయితే ఇవి ఆడ చేపలు కావడంతో ఆశించిన స్థాయిలో ధర రాదని, అదే మగ చేపలు అయితే భారీ ధర పలికేవని మత్స్యకారులు పేర్కొన్నారు. సముద్రంలో వేటకి వెళ్లిన సమయంలో ఈ చేపలు లభించాయని తెలిపారు.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘కల్కి’ సీక్వెల్‌గా ‘కల్కి 2’ రాబోతుంది. తాజాగా ఈ సినిమాపై క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుండగా.. ఈ షెడ్యూల్‌లో జేడీ చక్రవర్తి, దుల్కర్ సల్మాన్ జాయిన్ అయినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.
JGL: జిల్లా కేంద్రంలోని 33KV టౌన్ ఫీడర్ పరిధిలో చెట్ల కొమ్మల తొలగింపు, విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా ఆదివారం ఉ. 9-12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డివిజనల్ ఇంజనీర్ కె.గంగారాం తెలిపారు. జగిత్యాల పట్టణంలోని చిలుకవాడ, మోతే చౌరస్తా, జంబి గద్దె, తహసీల్ చౌరస్తా ప్రాంతాలతో పాటు మోతే, వెల్దుర్థి, గొల్లపల్లి గ్రామాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
NDL: 30 రోజులలో శ్రీశైల మల్లన్నకు భక్తులు సమర్పించిన కానుకలను శనివారం లెక్కించారు. రూ.7,19,58,064 నగదు రాబడిగా లభించిందని ఆలయ అధికారులు తెలిపారు. 122 గ్రాముల బంగారు, 6 కేజీల వెండి, విదేశీ కరెన్సీ లభించిందని, పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్ల మధ్య, సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఈవో ఎం.శ్రీనివాసరావు, తదితరులు ఉన్నారు.
చెరో 5 IPL ట్రోఫీలు గెలిచిన MI, CSKలో గొప్ప జట్టు ఏదనే చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అయితే కొత్త టాలెంట్‌ని వెలికితీసి, ప్రోత్సహించడంలో CSK కంటే MI ముందుంటుందని.. భారత క్రికెట్‌కి ఎందరో గొప్ప ప్లేయర్లను అందించచిన ఘనత ముంబైదే అని స్పష్టంచేశాడు. జట్టులో నలుగురు భారత కెప్టెన్లు ఉన్నప్పటికీ ఒక్కటిగా రాణించడం ముంబైకే సాధ్యమైందని గుర్తుచేశాడు.
HYD: లేక్ PS, సికింద్రాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ సంయుక్తంగా ఖైరతాబాద్ మ.సీ. మర్థా ప్రాంతంలో గంజాయి రవాణాను భగ్నం చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. దీపక్ పాండా, కుముదిని పాండా, సోను కుమార్‌ను అదుపులోకి తీసుకుని 1.4 కిలోల గంజాయి, 10 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఒడిశా నుంచి గంజాయి తెప్పించి నగరంలో విక్రయిస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు.
BHNG: భువనగిరి మండలం తాజ్ పూర్‌కు చెందిన పేద ముస్లిం ఒంటరి మహిళ అయిన షేక్ అమీనాబి ఆవాసం లేక చాలా ఇబ్బంది పడుతుంది. ఆమె పరిస్థితి చూసి గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్, ఆర్ఎస్‌కే ఫౌండేషన్ ద్వారా సామాజికవేత్త డా.ర్యాకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇంటిని నిర్మించి చేయూతనిచ్చారు. ఆ ఇంటిని శనివారం రంజాన్ సందర్బంగా గృహప్రవేశం చేయించారు.
ELR: విద్యార్థులందరూ చదువులోనే కాకుండా క్రీడల్లో, సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించడంలో ముందుండాలని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు. శనివారం రాత్రి జంగారెడ్డి గూడెం మండలం వేగవరంలో ప్రైవేట్ స్కూల్ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. విద్యార్థులు విద్యతో పాటు సాంస్కృతిక రంగాలలోనూ ముందుండాలని సూచించారు.
ఆఫ్ఘనిస్తాన్‌లోని భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.6గా నమోదైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.6గా నమోదైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
MLG: పట్టణ కేంద్రానికి చెందిన మైనార్టీ నాయకుడు అఫ్రోజ్ నివాసంలో శనివారం రాత్రి రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి సీతక్క హాజరై మాట్లాడారు. రంజాన్ మాసం ముస్లిం ప్రజలకు పవిత్రమైన నెల అని అన్నారు. అల్లా దీవెనలతో నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. DCC అధ్యక్షుడు అశోక్ తదితరులు ఉన్నారు.
NGKL: ఎస్ఎల్బిసి టన్నెల్ పనులు పునః ప్రారంభమయ్యాయి. గతంలో మాదిరిగా టీబీఎం మిషన్లతో కాకుండా డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ పద్దతిలో పనులు ప్రారంభించడం గమనార్హం. ఇప్పటికే గత ఫిబ్రవరి 18న మన్నెవారి పల్లి అవుట్ లెట్ వైపు సొరంగం పనులు ప్రారంభించడం జరిగింది. గత ఏడాది ఫిబ్రవరి 22న ఇన్ లెట్ పనుల్లో 13.95 కిలోమీటర్ వద్ద సొరంగం పైకప్పుకూలి ప్రమాదం చోటు చేసుకుంది.
ADB: జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని కలెక్టర్ రాజర్షి షా శనివారం స్పష్టం చేశారు. ప్రజల అవసరాలకు తగినంత గ్యాస్ నిల్వలు ఉండటంతో సరఫరా వ్యవస్థ సజావుగా కొనసాగుతోందన్నారు. గ్యాస్ కొరతపై వ్యాపిస్తున్న పుకార్లను నమ్మవద్దన్నారు. అనవసర భయాందోళనలకు లోనై పానిక్ బుకింగ్‌లు చేయడం వల్ల ఇతర వినియోగదారులకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.