KMM: నేరాల నియంత్రణలో భాగంగా అక్రమ రవాణా, చట్టవ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేసేందుకు ఖమ్మం జిల్లా పోలీస్ యంత్రాంగం జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ నిన్న తెలిపారు. ఏటియం సెంటర్లు, బ్యాంకుల పరిసరాలలో పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించారు. అర్ధరాత్రి వేళలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలను, వాహనాలను తనిఖీ చేశారు.
ELR: నూజివీడు పట్టణంలోని శారద డిగ్రీ కళాశాలలో 25వ తేదీన ఉదయం 9.30 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారని కోఆర్డినేటర్ డి.రామకృష్ణ తలిపారు. 11 కంపెనీల ప్రతినిధులు పాల్గొనే ఈ మేళాలో 925 మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. 18 నుంచి 35 సంవత్సరాల లోపు వయసు ఉన్న అభ్యర్థులు హాజరు కావాలని ఆయన కోరారు.
NDL: వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఇవాళ బనగానపల్లె మండలం నందవరం ఆలయానికి వస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు తెలిపారు. నందవరంలో కొలువైన శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దర్శనానికి మంత్రి సత్యకుమార్ వస్తున్నారని చెప్పారు. రాత్రి 8 గంటలకు నందవరం ఆలయానికి వస్తారని, ఏర్పాట్లు చేపడుతున్నామని పేర్కొన్నారు.
ATP: జిల్లా మట్టి వాసనతో రూపొందిన ‘సొట్టా బుగ్గల పిల్లో’ ఫోక్ సాంగ్ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మార్కెట్ యార్డ్ చైర్‌పర్సన్ బల్లా పల్లవి అతిథిగా పాల్గొని పాటను ఆవిష్కరించారు. అనంతపురం స్వరం, ఇక్కడి లొకేషన్లలోనే చిత్రీకరించిన ఈ జానపద గీతంపై ఆమె ప్రశంసలు కురిపించారు. కళాకారులను ప్రోత్సహించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
PPM: బలిజిపేట మండలం అజ్జాడ గ్రామంలో శనివారం YCP సీనియర్ కార్యకర్తల కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఇటీవల మరణించిన పెంకి సంజీబు, బడే నరసింహ నాయుడు, పోల చిన్నం నాయుడు కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారి కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
చిత్తూరు జిల్లాలో కేంద్రీయ విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి ప్రవేశాలకు ప్రకటన విడుదలైనట్లు జిల్లా ఉన్నతాధికారులు తెలిపారు. ఏప్రిల్ 2 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుందన్నారు. చిత్తూరులోని ఇరువారం, కుప్పంలోని కేంద్రీయ విద్యాలయాల్లో తరగతులు ప్రారంభంకానున్నాయి. దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కృష్ణా: గన్నవరం మండలంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు ఇవాళ అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. బలిపర్రు, వీరపనేనిగూడెం, తెంపల్లి ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు కరెంట్ నిలిపివేయనున్నట్లు వెల్లడించారు. వినియోగదారులు అధికారులకు సహకరించాలని కోరారు.
NRPT: ఊట్కూరు మండలం నిడుగుర్తికి చెందిన డాక్టర్ కౌండిన్య శ్రీజ గౌడ్ అమెరికాలోని ప్రతిష్ఠాత్మక మెడికల్ కాలేజీలో పీజీ సీటు సాధించారు. HYDలోని కామినేని ఆసుపత్రిలో MBBS పూర్తి చేసిన ఆమె, 2025 DECలో నిర్వహించిన USMLE స్టెప్-2 పరీక్షలో 300 మార్కులకు గానూ 252 మార్కులు సాధించి మెరుగైన ప్రతిభ కనబరిచారు.
KRNL: ఈనెల 26న జిల్లాలోని కిడ్స్ వరల్డ్ రోశయ్య కమ్యూనిటీ హాల్‌లో 8వ జిల్లాస్థాయి ఉషూ పోటీలను నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి టి.శ్రీనివాసులు తెలిపారు. పోటీలకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ తన కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు.
VZM: వీధులలో CC కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ప్రజలు ముందుకు రావాలని బొబ్బిలి సీఐ కె.నారాయణరావు సూచించారు. శనివారం సాయంత్రం స్దానిక ఆకులరెల్లివీధిలో గ్రామస్థులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీసీ కెమెరాలతో నేరాలను అదుపు చేయవచ్చన్నారు. అలాగే శక్తి మొబైల్ యాప్‌ను మహిళలు స్మార్ట్ ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసుకోవాలన్నారు.
MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని మెదక్ ఎల్కతుర్తి జాతీయ రహదారిపై భారీ గుంతలు ఏర్పడిన అధికారులు పట్టించుకోవడం లేదు. ఒక 15 రోజులుగా గుంతలు ఏర్పడి వాహనదారులకు ఇబ్బంది ఏర్పడుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంతలు పూడ్చి రోడ్డు మరమ్మతు చేయాలని కోరుతున్నారు.
HYD: త్రిబుల్ ఐటీ HYDలో అందుబాటులోకి తీసుకొచ్చిన దృష్టి లైబ్రరీ విశేష ఫలితాలు ఇస్తోందని ప్రొఫెసర్ జవహర్ తెలిపారు. తెలుగు, హిందీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ వంటి మొత్తం 12 భాషల్లో ఈ లైబ్రరీ అందుబాటులో ఉంది. బ్రెయిలీ లిపి, ఆడియో బుక్ రూపాల్లో పీజీ స్థాయి వరకు పాఠ్యాంశాలు అందించడం ద్వారా దృష్టి లోపం ఉన్న విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారింది.
VSP: మధురవాడ శిల్పారామంలో ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయ శిల్పారామం పరిపాలనాధికారి రమేష్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘గగన సిరి డాన్స్ అకాడమీ’ ఆధ్వర్యంలో కళాకారులు కూచిపూడి, జానపద నృత్యాలు ప్రదర్శిస్తారన్నారు. రాత్రి 8 గంటల వరకు ఈ ప్రదర్శనలు కొనసాగుతాయని తెలిపారు.
NDL: పాణ్యం మండలం కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి భక్తులు రూ.50 వేల విరాళం అందజేసినట్లు ఈవో రామకృష్ణ శనివారం తెలిపారు. పాణ్యానికి చెందిన వెంకట చంద్రశేఖర్ బాబు-విజయలక్ష్మి దంపతులు స్వామివారి ఇలవేల్పు కావడంతో విరాళం అందజేశారు. దాతలకు స్వామివారి ప్రత్యేక పూజల అనంతరం తీర్థప్రసాదాలు, చిత్రపటం అందజేసి సత్కరించారు.
PDPL: ఇటీవల గని ప్రమాదంలో గాయపడి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుడు లక్ష్మీనారాయణను సంస్థ CMO డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా వైద్య బృందం చికిత్స వివరాలు సేకరించారు. వివరాలు కొత్తగూడెం ఆసుపత్రికి పంపించి, తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ మేరకు బాధితుడికి న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు.