• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మార్చి 22: చరిత్రలో ఈరోజు

1739 : నాదిర్షా ఢిల్లీని ఆక్రమించి నెమలి సింహాసనాన్ని అపహరించాడు.1868 : భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత రాబర్ట్ మిల్లికాన్ జననం2005: తమిళ నటుడు జెమినీ గణేశన్ మరణం2009: సినీ నటుడు తాడేపల్లి లక్ష్మీ కాంతారావు మరణం➢ ప్రపంచ జల దినోత్సవం

March 22, 2026 / 12:01 AM IST

ఆ క్షణాలు మర్చిపోలేను: కోహ్లీ

గత సీజన్ ఫైనల్ గెలిచిన క్షణాలను విరాట్ కోహ్లీ తాజాగా అభిమానులతో పంచుకున్నాడు. ‘కీలక వికెట్ పడినప్పుడు బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న నేను, బయట ఉన్న ఏబీ డివిలియర్స్ ఒకేలా సెలబ్రేట్ చేసుకున్నాం’ అని తెలిపాడు. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత RCB తొలిసారి కప్ ముద్దాడిన ఆ చారిత్రాత్మక క్షణం ఎప్పటికీ స్పెషల్ అంటూ కోహ్లీ ఎమోషనల్ అయ్యాడు.

March 21, 2026 / 11:44 PM IST

వేసవిలో నీటి ఎద్దడి ఉండొద్దు: సీతక్క

TG: వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని మిషన్ భగీరథ అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు 1916 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ముఖ్యంగా అటవీ ప్రాంతాలు, తండాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమస్యలపై వెంటనే స్పందించాలని ఆమె స్పష్టం చేశారు.

March 21, 2026 / 11:28 PM IST

ప్రాక్టీస్ మ్యాచ్‌లో నితీష్ రెడ్డి అద్భుత స్పెల్

SRH ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. SRH-A జట్టు 253 పరుగులు చేయగా, SRH-B 282 పరుగులు సాధించింది. బ్యాటర్ల ఆధిపత్యం కొనసాగిన ఈ మ్యాచ్‌లో నితీష్ కుమార్ రెడ్డి తన బౌలింగ్‌తో మెరిశాడు. 4 ఓవర్లలో కేవలం 32 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. IPL ముందు నితీష్ ఫామ్‌లోకి రావడం ఆరెంజ్ ఆర్మీకి గుడ్ న్యూస్‌గా చెప్పవచ్చు.

March 21, 2026 / 11:11 PM IST

అదే నన్ను ఆరోగ్యపరంగా దెబ్బతీసింది: నటి

నటి భూమి పెడ్నేకర్ తన సినీ ప్రయాణంలో ఎదురైన సవాళ్లను వెల్లడించింది. పాత్రల కోసం చేసిన శారీరక మార్పులు తన ఆరోగ్యంపై ప్రభావం చూపాయని, ‘ది లేడీ కిల్లర్’ వైఫల్యం తనను బాగా దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేసింది. స్క్రిప్ట్‌లో మార్పులు, అసంపూర్తిగా సినిమా విడుదల కావడం తనను ఆశ్చర్యపరిచాయని, ఇదొక పెద్ద పాఠం నేర్పిందని ఆమె పేర్కొంది.

March 21, 2026 / 10:59 PM IST

రాష్ట్రంలో ఆయిల్ పామ్ విప్లవం: మంత్రి తుమ్మల

తెలంగాణను దేశంలోనే ఆయిల్ పామ్ హబ్‌గా మార్చడమే తమ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులకు అధిక ఆదాయాన్నిచ్చే ఈ పంటను సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతో విస్తరిస్తున్నామన్నారు. ఒక్కసారి నాటితే 25-30 ఏళ్ల పాటు నిరంతర ఆదాయం లభిస్తుందని అన్నారు. ఇది రైతుల బంగారు భవిష్యత్తుకు భరోసా అని పేర్కొన్నారు.

March 21, 2026 / 10:35 PM IST

సంజూ స్థానం RO-KO లాంటిదే: పరాగ్

RRలోకి శాంసన్‌కి బదులు వేరొకరిని తీసుకోగలం కానీ, అతని స్థానాన్ని భర్తీ చేయలేమని ఆ టీమ్ కొత్త కెప్టెన్ రియాన్ పరాగ్ తెలిపాడు. టీమ్ ఏదైనా రోహిత్, కోహ్లీ స్థానాలను ఎలా భర్తీ చేయలేమో.. సంజూ పరిస్థితీ అంతేనన్నాడు. సారథిగా విజయం కోసం ఎక్కడ ఎలా వ్యవహరించాలన్నదానిపైనే ఎక్కువ ఫోకస్ చేస్తానని చెప్పుకొచ్చాడు. కాగా ట్రేడ్ డీల్‌లో భాగంగా సంజూ CSKలో చేరిన సంగతి తెలిసిందే.

March 21, 2026 / 10:25 PM IST

‘ప్రజానాట్యమండలి మహాసభలను జయప్రదం చేయండి’

నల్గొండలోని దొడ్డి కొమరయ్య భవనంలో ప్రజానాట్యమండలి జిల్లా కమిటీ సమావేశం ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రమౌళి అధ్యక్షతన జరిగింది. ఈ మేరకు రాష్ట్ర నాయకుడు నాగార్జున మాట్లాడుతూ.. ప్రజా కలల పరిరక్షణ కోసం ఉద్యమించాలని అన్నారు. వచ్చేనెల 6, 7 తేదీల్లో నల్గొండలో నిర్వహించే జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఆయన కోరారు. తదనంతరం ఆ మండలి నూతన డైరీ ఆవిష్కరణ చేశారు.

March 21, 2026 / 10:22 PM IST

పాక్ క్రికెట్ బోర్డుపై గ్యారీ కిర్‌స్టన్ ఫైర్

పాకిస్తాన్ కోచ్‌గా తన 6 నెలల అనుభవం అత్యంత దారుణమని గ్యారీ కిర్‌స్టన్ ఆవేదన వ్యక్తం చేశాడు. మేనేజ్‌మెంట్ అతిగా జోక్యం చేసుకోవడం, కోచ్‌లకు స్వేచ్ఛ లేకపోవడం వల్లే తాను తప్పుకోవాల్సి వచ్చిందన్నాడు. ఆసీస్ మాజీ పేసర్ గిలెస్పీ కూడా పీసీబీ తీరును తప్పుబడుతూ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

March 21, 2026 / 10:20 PM IST

మల్లేశ్వరస్వామి హుండీ ఆదాయం రూ.48.76 లక్షల

GNTR: పెదకాకాని శ్రీ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం కానుకల హుండీల లెక్కింపు పూర్తైంది. హుండీల ద్వారా రూ.48,76,103, అన్నదాన హుండీ ద్వారా రూ.2,81,368 ఆదాయం వచ్చినట్లు ఉపకమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

March 21, 2026 / 10:00 PM IST

రాముడిపాలెంలో చీఫ్ విప్ పర్యటన

PLD: వినుకొండ నియోజకవర్గం రాముడిపాలెంలో చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పర్యటించారు. ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో భాగంగా రైతులతో ముఖాముఖి మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయ పొలాలను ఆయన పరిశీలించారు. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల అమలుపై రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

March 21, 2026 / 10:00 PM IST

రాష్ట్ర బడ్జెట్‌లో వరంగల్‌కు నిరాశే: మాజీ ఎమ్మెల్యే

WGL: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు అన్యాయం జరిగిందని శనివారం నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. కొత్త ప్రాజెక్టులు లేకుండా పాత పనులకే పరిమితమైందని, యూజీడీ, మామునూరు వంటి కీలక ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదన్నారు. దీనిపై సీఎం స్పందించి జిల్లా అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాలని కోరారు.

March 21, 2026 / 09:59 PM IST

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం..!

BDK: ఇల్లందు మండలం మసివాగు గ్రామ పంచాయతీ పరిధిలో శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు, ఆటో వేగంగా ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వారిని ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 21, 2026 / 09:46 PM IST

198 పోస్టులు.. హాల్‌ టికెట్లు విడుదల

TG: టీజీఎస్‌ఆర్టీసీలో ట్రాఫిక్‌ సూపర్‌వైజర్లు, మెకానికల్‌ సూపర్‌వైజర్‌ ట్రెయినీ పోస్టుల రాత పరీక్షకు హాల్‌ టికెట్లు విడుదలయ్యాయి. ఈ రెండు విభాగాల్లో 198 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నెల 29న రెండు విడతల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ పోలీసు నియామక మండలి వెల్లడించింది.

March 21, 2026 / 09:46 PM IST

కోతుల దాడిలో వృద్ధురాలి మృతి

AP: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో విషాదం చోటుచేసుకుంది. కోతుల దాడిలో దానబోయిన చిన్నబుల్లి(68) అనే వృద్ధురాలు మృతిచెందింది. పెద్దిపాలెం గ్రామ శివారులో ఉంటున్న ఆమె.. గేదెలకు నీరు పెట్టేందుకు వెళ్లగా, కోతులు దాడి చేశాయి. వాటి నుంచి తప్పించుకునే వీలు లేకపోవడంతో ఆమె చనిపోయింది. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా.. ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారని గ్రామస్థులు పేర్కొన్నారు.

March 21, 2026 / 09:42 PM IST