• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నేడు మినుముల కొనుగోలు కేంద్రం ప్రారంభం

కృష్ణా: విశ్వనాథపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రైతులకు ఊరటగా ఆదివారం మినుములు, పెసల కొనుగోలు కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రభుత్వ కనీస మద్దతు ధరల ప్రకారం నాణ్యత ఆధారంగా పంటలను స్వీకరిస్తున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. మినుములకు సుమారు రూ. 7,800, పెసలకు రూ. 8,700 పైగా ధరలు లభిస్తున్నాయని చెప్పారు.

March 22, 2026 / 05:15 AM IST

నేడు శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం

NRML: కుబీర్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ప్రభుత్వ రంగ సంస్థ (మార్క్ ఫెడ్) ఆధ్వర్యంలో PACS ద్వారా ఆదివారం నుంచి శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభించనున్నట్లు AMC ఛైర్మన్ గోనె కళ్యాణ్, PACS కార్యదర్శి క్రాంతి కుమార్ తెలిపారు. MLA రామారావు పటేల్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారన్నారు. ఈ మేరకు రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

March 22, 2026 / 05:14 AM IST

స్నేహితుల మధ్య గొడవ.. దాడికి గురై యువకుడు మృతి

MNCL: స్నేహితుల మధ్య జరిగిన గొడవలో దీపక్ అనే యువకుడు దాడికి గురై శనివారం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సీఐ ప్రమోద్ రావు తెలిపారు. కూలి పని చేసుకునే సిడం దీపక్, సంజీవ్‌లు కాలేజీ రోడ్డులో అద్దెకు ఉంటున్నారు. 2 రోజుల క్రితం జరిగిన గొడవలో దీపక్‌పై రాడ్‌తో దాడి చేయడంతో గాయాలపాలయ్యాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

March 22, 2026 / 04:41 AM IST

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

KNR: చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్ వద్ద విధుల్లో ఉన్న లస్కర్ తడిగొప్పుల మల్లయ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. రాత్రి కాల్వ వద్ద తోటి సిబ్బందితో కలిసి నిద్రించిన ఆయన, తెల్లవారేసరికి విగతజీవిగా కనిపించారు. మృతుని కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని బంధువులు డిమాండ్ చేశారు.

March 22, 2026 / 04:27 AM IST

భార్యపై భర్త పెట్రోల్ దాడి.. చికిత్స పొందుతూ మృతి

JGL: ప్రేమ పెళ్లి చేసుకుని భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించగా బాధితురాలు చికిత్స పొందుతూ మరణించింది. ధర్మపురికి చెందిన బడుగు నవీన్, మసీదు రమ్య (22) నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకోగా, గొడవల వల్ల 5 నెలలుగా రమ్య తన తల్లి వద్ద ఉంటోంది. ఈ నెల 16న అక్కడికి వెళ్లిన నవీన్ ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వరంగల్ MGMలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది.

March 22, 2026 / 04:21 AM IST

సీసీ రోడ్డును పరిశీలించిన మున్సిపల్ ఛైర్మన్

SRCL: వేములవాడ మున్సిపల్ పరిధిలోని 4వ వార్డులో కూలిపోయిన సీసీ రోడ్డును శనివారం సాయంత్రం మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు పరిశీలించారు. గత కొద్ది రోజుల క్రితం సీసీ రోడ్డు కూలిపోవడంతో ఈ విషయమై స్థానిక కౌన్సిలర్ మున్సిపల్ ఛైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆయన పరిశీలించి, మరమ్మతు చేపట్టాలని అధికారులకు సూచించారు.

March 22, 2026 / 04:16 AM IST

నీతి కథ: ఉపకారానికి ప్రత్యుపకారం

అడవికి రాజైన సింహం నిద్రిస్తుండగా ఒక ఎలుక దానిపై ఆడుకుంటూ నిద్రలేపింది. కోపంతో సింహం ఆ ఎలుకను చంపబోతుంటే.. ‘నన్ను వదిలేయండి, ఏదో ఒకరోజు మీకు సహాయం చేస్తాను’ అని ఎలుక వేడుకుంది. సింహం నవ్వి దానిని వదిలేసింది. కొన్ని రోజుల తర్వాత సింహం వేటగాడి వలలో చిక్కుకుంది. ఆ ఎలుక వచ్చి తన పదునైన పళ్లతో వలను కొరికి సింహాన్ని కాపాడింది. నీతి: మనం చేసే చిన్న మేలు వృధా పోదు.

March 22, 2026 / 01:30 AM IST

మార్చి 22: ఆదివారం పంచాంగం

➠ తిథి: చవితి: రా. 12-08 తదుపరి పంచమి ➠ నక్షత్రం: భరణి: రా. 1-33 తదుపరి కృత్తిక ➠ శుభ సమయాలు: ఉ.7:04-10:04, ఉ.11:04-మ.11:58, మ.2:04-4:28 ➠ రాహుకాలం: సా.4:30-సా.6.00 వరకు ➠ యమగండం: మ.12:00-మ.1:30 వరకు ➠ దుర్ముహూర్తం: సా.4:29-సా.5:17 వరకు ➠ వర్జ్యం: ఉ.11:57-మ.1:28 ➠ అమృత ఘడియలు: రా.8:59-10:29 వరకు.

March 22, 2026 / 01:12 AM IST

ప్రాక్టీస్ మ్యాచ్‌లో అభిషేక్, ఇషాన్ మెరుపులు

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో కెప్టెన్ ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. అభిషేక్ కేవలం 42 బంతుల్లోనే 94 పరుగులు, కెప్టెన్ ఇషాన్ 25 బంతుల్లోనే 72 పరుగులతో విధ్వంసం సృష్టించారు. వీరిద్దరి ఫామ్ చూస్తుంటే ఈ సీజన్‌లో ఆరెంజ్ ఆర్మీ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించడం ఖాయంగా కనిపిస్తోంది.

March 22, 2026 / 12:55 AM IST

విడాకులపై స్పందించిన నిహారిక

మెగా డాటర్ నిహారిక తన విడాకులపై తాజాగా స్పందించింది. వైవాహిక బంధం నుంచి బయటకు రావాలనుకున్నప్పుడు ముందుగా ఆ విషయాన్ని తన తండ్రికే చెప్పానని ఆమె తెలిపింది. తాను సంతోషంగా లేననే విషయం ఇంట్లో వారికి ముందే తెలుసని, ఆనందం లేని బంధంలో బలవంతంగా ఉండాల్సిన అవసరం లేదని నాన్నే ధైర్యం చెప్పారని పేర్కొంది. విభేదాలు పరిష్కరించుకోలేనివి కావడంతోనే విడాకులు తీసుకున్నామని స్పష్టం చేసింది.

March 22, 2026 / 12:20 AM IST

మార్చి 22: చరిత్రలో ఈరోజు

1739 : నాదిర్షా ఢిల్లీని ఆక్రమించి నెమలి సింహాసనాన్ని అపహరించాడు.1868 : భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత రాబర్ట్ మిల్లికాన్ జననం2005: తమిళ నటుడు జెమినీ గణేశన్ మరణం2009: సినీ నటుడు తాడేపల్లి లక్ష్మీ కాంతారావు మరణం➢ ప్రపంచ జల దినోత్సవం

March 22, 2026 / 12:01 AM IST

ఆ క్షణాలు మర్చిపోలేను: కోహ్లీ

గత సీజన్ ఫైనల్ గెలిచిన క్షణాలను విరాట్ కోహ్లీ తాజాగా అభిమానులతో పంచుకున్నాడు. ‘కీలక వికెట్ పడినప్పుడు బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న నేను, బయట ఉన్న ఏబీ డివిలియర్స్ ఒకేలా సెలబ్రేట్ చేసుకున్నాం’ అని తెలిపాడు. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత RCB తొలిసారి కప్ ముద్దాడిన ఆ చారిత్రాత్మక క్షణం ఎప్పటికీ స్పెషల్ అంటూ కోహ్లీ ఎమోషనల్ అయ్యాడు.

March 21, 2026 / 11:44 PM IST

వేసవిలో నీటి ఎద్దడి ఉండొద్దు: సీతక్క

TG: వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని మిషన్ భగీరథ అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు 1916 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ముఖ్యంగా అటవీ ప్రాంతాలు, తండాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమస్యలపై వెంటనే స్పందించాలని ఆమె స్పష్టం చేశారు.

March 21, 2026 / 11:28 PM IST

ప్రాక్టీస్ మ్యాచ్‌లో నితీష్ రెడ్డి అద్భుత స్పెల్

SRH ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. SRH-A జట్టు 253 పరుగులు చేయగా, SRH-B 282 పరుగులు సాధించింది. బ్యాటర్ల ఆధిపత్యం కొనసాగిన ఈ మ్యాచ్‌లో నితీష్ కుమార్ రెడ్డి తన బౌలింగ్‌తో మెరిశాడు. 4 ఓవర్లలో కేవలం 32 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. IPL ముందు నితీష్ ఫామ్‌లోకి రావడం ఆరెంజ్ ఆర్మీకి గుడ్ న్యూస్‌గా చెప్పవచ్చు.

March 21, 2026 / 11:11 PM IST

అదే నన్ను ఆరోగ్యపరంగా దెబ్బతీసింది: నటి

నటి భూమి పెడ్నేకర్ తన సినీ ప్రయాణంలో ఎదురైన సవాళ్లను వెల్లడించింది. పాత్రల కోసం చేసిన శారీరక మార్పులు తన ఆరోగ్యంపై ప్రభావం చూపాయని, ‘ది లేడీ కిల్లర్’ వైఫల్యం తనను బాగా దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేసింది. స్క్రిప్ట్‌లో మార్పులు, అసంపూర్తిగా సినిమా విడుదల కావడం తనను ఆశ్చర్యపరిచాయని, ఇదొక పెద్ద పాఠం నేర్పిందని ఆమె పేర్కొంది.

March 21, 2026 / 10:59 PM IST