KDP: టీం ఇండియా మహిళా క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీచరణి ఇవాళ కుటుంబ సమేతంగా కడపలోని శ్రీ విజయ దుర్గాదేవిని దర్శించుకున్నారు. పదేళ్లుగా ఆమె తల్లి ఈ ఆలయంలో రాహుకేతు పూజలు చేస్తుండగా, శ్రీచరణి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ నిర్వాహకులు ఆమెకు స్వాగతం పలికి, అమ్మవారి శేషవస్త్రాలతో సత్కరించారు.
మనం ఎంత ఎదిగినా చిన్ననాటి జ్ఞాపకాలు మరువలేనివి. అప్పట్లో లేత జామ ఆకులను తెంచి దాంట్లో చింతపండు, ఉప్పు కలిపి తింటే ఆ రుచి మాటల్లో వర్ణించలేనిది. తెలిసి తెలియని వయసులో తిన్న ఆ పదార్థం ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేసేది. స్నేహితులతో 90’S కిడ్స్ చేసిన ఆ అల్లరిని, ఆ రుచిని ఆస్వాదించిన తీరు ఎప్పటికీ మర్చిపోలేరు. మీరూ ఇలా చేశారా? కామెంట్ చేయండి.
SKLM: మందస మండలం డిమిరియా గ్రామ సమీపాన గెడ్డలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమయింది. గ్రామస్థుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడు అంబుగాంకు చెందిన గుడియా జగన్నాథ్(47)గా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
GNTR: ఆచార్య నాగార్జునా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న డీఎస్ఆర్ కృష్ణకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (DEE)గా పదోన్నతి కల్పించారు. వైస్ చాన్సలర్ కే. గంగాధర రావు ఉత్తర్వులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రెక్టర్ శివరాం ప్రసాద్, రిజిస్ట్రార్ సింహాచలం, ఓఎస్డీ రవికుమార్, ఇంజనీర్ రాజకుమార్ పాల్గొన్నారు.
MDCL: అల్వాల్ ఇందిరా నగర్ కాలనీలోని ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం వద్ద శనివారం హిందూ సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాలు, పోస్టర్లు, బ్యానర్లు శనివారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు నిమ్మ చిరంజీవి రెడ్డి సహా నిర్వాహకులు, సభ్యులు పాల్గొన్నారు. హిందూ బంధువులందరూ సమ్మేళనానికి హాజరుకావాలని పిలుపునిచ్చారు.
మాయిశ్చరైజర్స్ మాదిరిగానే ఐస్ క్యూబ్స్ చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. మచ్చలు, పొడిబారడం వంటి చర్మ సమస్యలను నివారించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఇందుకోసం పడుకునే ముందు ఐస్ క్యూబ్స్‌తో చర్మంపై స్క్రబ్ చేస్తే చాలు.. చర్మం ఉపశమనం పొందడంతో పాటు హైడ్రేటెడ్ అవుతుంది. అలాగే రక్తప్రసరణ పెరిగి మెరవడమే కాక టాన్ దూరమవుతుంది.
TG: రంజాన్ పండుగను పురస్కరించుకుని ప్రముఖ భారత క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్ HYD మెహదీపట్నం ఫస్ట్ లాన్సర్ ప్రాంతంలోని ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నాడు. ప్రార్థనల అనంతరం సిరాజ్ తన స్నేహితులు, స్థానికులతో కలిసి పండుగ శుభాకాంక్షలు పంచుకున్నారు. అభిమానులు ఆయనను చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా సిరాజ్ అందరితో సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశాడు.
MHBD: గంగారం మండలం దుబ్బగూడంలో జనగాం పాపారావు తల్లి ఇటీవల మృతి చెందడంతో శనివారం మంత్రి సీతక్క ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, గంగారం మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ మిక్స్‌డ్ టాక్‌తో దూసుకెళ్తోంది. మెదటి రోజు ఈచిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.50 కోట్ల గ్రాస్ సాధించగా.. రెండో రోజు కేవలం రూ.12 కోట్ల గ్రాస్ మాత్రమే వసూళ్లు సాధించింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను రీచ్ అవ్వాలంటే రాబోయే రోజుల్లో భారీ వసూళ్లను రాబట్టాల్సి ఉంది.
BDK: వడగండ్ల వాన ఈదురుగాలులకు దెబ్బతిన్న మొక్కజొన్న పంట నష్టానికి రైతులకు తక్షణమే పరిహారం అందేలా ప్రభుత్వంపై వత్తిడి తెస్తానని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హామీ ఇచ్చారు. ప్రకృతి వైపరీత్యం వల్ల మొక్కజొన్న పంటకు జరిగిన భారీ నష్టంపై ఆయన మాట్లాడుతూ.. తక్షణమే సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని శాస్త్రీయంగా అంచనా వేయాలని అదేశించారు.
BHNG: కాల్వపల్లి బ్రిడ్జి వద్ద పైపుల దగ్గర కుంగి రాకపోకలకు అంతరాయం జరిగింది. పొట్టిమర్రి ఉధృతికి రాజపేట-యాదగిరిగుట్ట ప్రధాన రహదారి కోతకు గురై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. హై లెవెల్ బ్రిడ్జ్ పనుల వద్ద కాంట్రాక్ట్ నిర్లక్ష్యం వల్లే తాత్కాలిక మట్టి రోడ్డు పట్టుకుపోయిందని గ్రామ ప్రజలు వాపోతున్నారు. దీంతో పోలీసులు దారిని మూసివేయడం మూసివేశారు.
HYD: భద్రాచలం సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంలో ఉపయోగించిన పవిత్ర తలంబ్రాలను భక్తుల ఇళ్లకు పంపిణీ చేయనున్నారు. ఈ విషయాన్ని సికింద్రాబాద్ డివిజన్ డిప్యూటీ రీజినల్ మేనేజర్ పవిత్ర తెలిపారు. భక్తులు ముందుగా బుకింగ్ చేసుకోవాలన్నారు. బుకింగ్ కోసం 9010334184, 9154208831 నంబర్లను సంప్రదించాలని సూచించారు. శ్రీ సీతారాముల ఆశీస్సులు పొందే అవకాశం మిస్ కావొద్దని పవిత్ర తెలిపారు.
HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 10వ ప్లాట్‌ఫారం వచ్చే నెలలో అందుబాటులోకి రానుందని SCR అధికారులు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యాల మెరుగుదల కోసం ఈ ప్లాట్‌ఫారం నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. అయితే భద్రతా వ్యవస్థకు సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాకే పూర్తి స్థాయిలో ప్రారంభం చేయనున్నారు. మరో వైపు స్కానింగ్ వ్యవస్థను ప్రారంభించనున్నారు.
HNK: కమలాపూర్(M) భీంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాలను ఇవాళ నిర్వహించారు. హుజురాబాద్ కాంగ్రెస్ ఇంఛార్జి ప్రణవ్, మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్ ఝాన్సీరాణి రవీందర్, స్థానిక సర్పంచ్ వాసాల శ్రీనివాస్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులను సన్మానించారు. ప్రజా ప్రభుత్వంలోనే పేద ప్రజల సొంత ఇంటి కళ నెరవేరుతుందని వారు అన్నారు.
ప్రస్తుత తరం యువతలో చిన్న పనికే అలసిపోవడం, దేనిమీదా ఆసక్తి లేకపోవడం చూస్తున్నాం. అయితే డిప్రెషన్‌తో ఉన్నవారిలో కణాలు అవసరానికి మించి శక్తిని ఉత్పత్తి చేస్తాయట. ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు అదనపు శక్తిని ఉత్పత్తి చేయడంలో ఈ కణాలు విఫలమవుతున్నాయట. ఈ వైరుధ్యం వల్లే యువతలో నిరంతర అలసట కనిపిస్తుందని ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు చెప్పారు.