NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధి పనులపై దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ శనివారం సమీక్ష నిర్వహించారు. చీఫ్ ఇంజనీర్ జి.వి.ఆర్. శేఖర్‌తో కలిసి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల నాణ్యతలో రాజీ పడొద్దని అధికారులను ఆదేశించారు.
KNR: తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన PCR బంకెట్ హాల్‌ను మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. ప్రజలకు అందుబాటులో సరసమైన ధరలకు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
KDP: ప్రొద్దుటూరులో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను బహిరంగంగానే వాణిజ్య అవసరాలకు మళ్లిస్తున్నారు. రెస్టారెంట్లు, హోటళ్లు, బేకరీలు, క్యాటరింగ్ సెంటర్లలో విచ్చలవిడిగా గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను వాడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. స్థానిక గ్యాస్ ఏజెన్సీలు గృహ వినియోగ సిలిండర్లను అధిక ధరలకు వ్యాపారులకు అమ్ముకుంటున్నారని, దోపిడీని అరికట్టాలని వినియోగదారులు కోరుతున్నారు.
BHNG: మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలో అంగడి బజార్‌లో తై బజార్ పనులను మున్సిపల్ ఛైర్ పర్సన్ గడ్డం స్వప్న సోమా నర్సయ్య దగ్గర ఉండి పరివేకస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మోత్కూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ పన్నాల శ్రీవిద్య శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమీషనర్ సతీష్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
AP: తమిళనాడు బోట్ల విడుదలలో తనపై వస్తున్న ఆరోపణలను ఎంపీ బీద మస్తాన్‌రావు ఖండించారు. వివాదంపై అధికారులు, మత్యకార గ్రామ పెద్దలతోగానీ చర్చించలేదని తెలిపారు. విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని చంద్రబాబు, అధికారులను కోరానని చెప్పారు. వాస్తవాలను బయటపెట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతానని వెల్లడించారు.
KRNL: ఎమ్మిగనూరు మండలం మసీదుపురం గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు కురువ పెటయ్య ఇవాళ ఆకస్మికంగా మృతిచందాడు. ఈ వార్త తెలిసి నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జి కె.రాజీవ్ రెడ్డి, మండల కన్వీనర్ బసిరెడ్డి మృతుడి కుటుంబాన్ని పరామర్శించి, వారి పట్ల ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. పెటయ్య పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
NLG: నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శాసనసభ విప్‌గా నియమితులైన సందర్భంగా చిట్యాల మండలం తాళ్ల వెల్లంల ప్రజాప్రతినిధులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపి, సత్కరించారు. సర్పంచ్ జోగు సురేష్, మాజీ సర్పంచ్ జనగాం రవీందర్ గౌడ్, ఉప సర్పంచ్ సునీత బుచ్చి రాములు గౌడ్, మాజీ ఉపసర్పంచ్ అంజయ్య గౌడ్, వెంకన్న గౌడ్, నరసింహ, నక్క యాదగిరి పాల్గొన్నారు.
HNK: పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ఈద్-ఉల్-ఫితర్ ప్రార్థనలు సురక్షితంగా, సామరస్యంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని WGL CP సన్ ప్రీత్ సింగ్ అధికారులకు ఆదేశించారు. శనివారం HNKలోని బొక్కలగడ్డ, పోతానగర్ ఈద్గాలను CP సందర్శించారు. ప్రార్థనలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
కోనసీమ: ఐ.పోలవరం(మం) మురముళ్లలో ఉన్న శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయ పునఃనిర్మాణానికి శనివారం కాకినాడకు చెందిన గమిడి వర ప్రసాద్ రూ.10 వేలు, హైదరాబాద్‌కి చెందిన చిలుకూరు సాయమ్మ రూ.10,116లు విరాళం ఆలయ అధికారులకు అందించారు. దాతలకు ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.
E.G: గోపాలపురం నియోజవర్గం రామన్నగూడెం గ్రామపంచాయతీ దేవినేనివారి గూడెంలో జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులను శనివారం ద్వారకతిరుమల సొసైటీ ఛైర్మన్ పోలిన శ్రీనివాసరావు పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు రూ.50 లక్షలు నిధులు మంజూరు చేశారని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలు పాటించి పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.
KMR: బిక్కనూర్ అర్చకుల అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని, అర్చక అభివృద్ధి సంఘ అధ్యక్షుడు కొడకండ్ల రామగిరి శర్మ చెప్పారు. శనివారం మండల కేంద్రంలోని స్థానిక సిద్ధిరామేశ్వర ఆలయంలో అర్చకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉగాది రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ అర్చకుడిగా ప్రశంసా పత్రం అందుకున్న సందర్భంగా అర్చకులు ఆయన్ని అభినందించారు.
TG: సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార గృహంపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. జనగామ-సూర్యాపేట జాతీయ రహదారి పక్కన వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వివిధ ప్రాంతాల నుంచి మహిళలను తీసుకొచ్చి అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. పోలీసుల దాడిలో మైనర్లు పట్టుబడినట్లు తెలుస్తోంది.
AP: వ్యవసాయం చేసే చాలామంది రైతులకు ఆదాయం రావట్లేదని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఒకే పంట కాకుండా ఎక్కువ పంటలు వేయాలని సూచించారు. మార్కెట్ డిమాండ్‌పై అవగాహన పెంచుకున్నాక పంటలు వేయాలని విజ్ఙప్తి చేశారు. రైతు ఉత్పత్తి సంఘాలుగా ఏర్పడితే లబ్ధి జరుగుతుందని తెలిపారు. మిద్దె తోటలకు బడ్జెట్ కేటాయింపుపైనా ప్రభుత్వంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.
CTR: కార్వేటి నగరం సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రంజాన్ సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఐ హనుమంతప్ప తెలిపారు. స్థానిక మసీదులు, ప్రార్థన మందిరాలను పోలీసు సిబ్బంది సందర్శించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపి చాక్లెట్లు, పూలు పంపిణీ చేశారు. ప్రేమ ఆప్యాయతలను పంచుతూ.. సోదర భావాన్ని తెలియజేశారు.
WNP: కేంద్ర విశ్వవిద్యాలయాల్లో పిల్లలను చేర్పించాలని భావిస్తున్న తల్లిదండ్రులకు చక్కటి అవకాశం. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకటో తరగతి, బాల వాటిక అడ్మిషన్ కోసం అధికారిక దరఖాస్తులు అవమానిస్తున్నట్లు ప్రిన్సిపల్ దశరథ్ రామ్ తెలిపారు. ఆసక్తి గలవారు http://admission.kvs.gov.in లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తులు స్వీకరించబడతాయన్నారు.