• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పాపన్నపేటలో భారీగా రేషన్ బియ్యం పట్టివేత

MDK: పాపన్నపేటలో వాహనాల తనిఖీలలో 224 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి తరలిస్తున్న లారీని ఆపి తనిఖీ చేయగా బియ్యం బయటపడింది. సమాచారం అందుకున్న సివిల్ సప్లై అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

March 21, 2026 / 11:24 AM IST

త్వరగా జిల్లా కార్యాలయానికి భూమి కేటాయించాలి: అశోక్

MLG: జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం భూమి కేటాయించాలని ఇవాల జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర్‌కు, జిల్లా DCC అధ్యక్షుడు అశోక్ వినతిపత్రం అందజేశారు. పార్టీ కార్యాలయం లేకపోవడంతో కార్యకలాపాలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, పార్టీ సంస్థాగత కార్యక్రమాలు సాగించలేకపోతున్నాయని తెలిపారు. త్వరగా భూమి కేటాయించాలని కోరారు.

March 21, 2026 / 11:24 AM IST

కోతుల బెడదకు వినూత్న పరిష్కారం

NRML: మామడ మండలం బండల్ ఖానాపూర్ గ్రామంలో సర్పంచ్ జాదవ్ కళ్యాణి కోతుల సమస్యను అద్భుతంగా పరిష్కరించారు. పంచాయతీ కార్మికుడిని చింపాంజీ వేషంలో గ్రామంలో తిప్పించినందున భయపడిన కోతులు పారిపోయి, దీంతో గ్రామస్థులకు ఉపశమనం లభించింది. స్థానికులు సర్పంచ్ ఆలోచనను ప్రశంసిస్తూ, ఇది కోతుల సమస్యకు సరికొత్త పరిష్కారం అని తెలిపారు.

March 21, 2026 / 11:24 AM IST

జమియా మసీదులో రంజాన్ ప్రార్థనలు

శ్రీకాకుళం: నగరంలోని సూర్య మహల్ జంక్షన్ వద్ద ఉన్న జమియా మసీదులో రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథిగా హాజరై ముస్లిం సోదర సోదరీమణులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. రంజాన్ పర్వదినం శాంతి, సహనం, సౌహార్దానికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. 

March 21, 2026 / 11:23 AM IST

కాళేశ్వరం ప్రాజెక్ట్ వరం: హరీష్ రావు

TG: రాష్ట్ర ప్రజల పాలిట కాళేశ్వరం ప్రాజెక్ట్ వరం అని బీఆర్ఎస్ నేత, మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే పంటల దిగుబడి పెరిగిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడితోనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారని తెలిపారు. పంటలకు మద్ధతు ధర లేక రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని కోరారు.

March 21, 2026 / 11:23 AM IST

పాకాల సరస్సు ప్రకృతి సోయగాలకు ప్రసిద్ధి

WGL: ఖానాపూర్ (M) పాకాల సరస్సు ప్రకృతి సోయగాలకు ప్రసిద్ధి చెందింది. కాకతీయుల కాలంలో నిర్మితమైన ఈ సరస్సు సాగునీటి అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవల వర్షాలతో నీటి మట్టం పెరిగి పరిసర ప్రాంతాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. అధికారులు తెలిపారు.

March 21, 2026 / 11:22 AM IST

హనుమాన్ స్వాములకు ముస్లిం సోదరుడి భిక్ష

KMR: బాన్సువాడ మండలం బొర్లంలో శనివారం మతసామరస్యం వెల్లివిరిసింది. హనుమాన్ మాలధారణ చేసిన స్వాములకు ముస్లిం సోదరుడు సద్దాం ప్రత్యేకంగా భిక్ష (అన్నదానం) ఏర్పాటు చేశారు. భక్తి, మానవత్వం మతాల కంటే గొప్పవని ఆయన చాటిచెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తాయని, అందరూ ఐక్యంగా ఉండాలని స్వాములు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

March 21, 2026 / 11:22 AM IST

పిడుగు పడి ఇద్దరికి గాయాలు

మన్యం: మక్కువ మండలం కన్నంపేట గ్రామంలో శుక్రవారం పిడుగు పడి నల్ల గోపి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షంతో పిడుగులు పడ్డాయి. అదే సమయంలో పొలంలో ఉన్న నల్ల గోపి, బలగ సాయి అనే ఇద్దరి వ్యక్తులకు పిడుగు పాటు వల్ల గాయాలయ్యాయి.

March 21, 2026 / 11:21 AM IST

గుడ్ న్యూస్.. 24న జాబ్ మేళా

KKD: ఈ నెల 24న జిల్లా ఉపాధి కార్యాలయంలో 62 ఉద్యోగాలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి జి.శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫోన్ పే, రామకృష్ణ ఎలక్ట్రికల్ వర్క్స్ వంటి సంస్థలలో పనిచేసేందుకు అభ్యర్థుల ఎంపిక జరుగుతుందన్నారు. 18 నుంచి 35 ఏళ్ల వయసు ఉన్న వారు టెన్త్ నుంచి డిగ్రీ అర్హత కలిగిన వారు ఉదయం 10 గంటలకు ధ్రువపత్రాలతో రావాలన్నారు. 

March 21, 2026 / 11:21 AM IST

జీవన్ రెడ్డి ఈనెల 25న పార్టీ మారనున్నారా?

TG: కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌తో జీవన్ రెడ్డి సమావేశం కావాల్సి ఉండగా.. జగిత్యాలలో రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో BRS నేతలతో సరదాగా ముచ్చటించారు. అధిష్ఠానం నుంచి ఎలాంటి ఫోన్ రాలేదని.. ఈనెల 25న భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తారని ప్రచారం జరుగుతుంది.

March 21, 2026 / 11:21 AM IST

‘కూటమి ప్రభుత్వం హయాంలోనే ఉత్తరాంద్ర అభివృద్ధి’

VZM: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతోందని బొబ్బిలి MLA బేబినాయన అన్నారు. శనివారం బొబ్బిలి కోటలో మాట్లాడుతూ.. మిట్టల్‌ స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణంతో 50 వేలమందికి ఉపాధి లభిస్తుందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రబుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది 20 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని, రెండో ఏడాది జాబ్‌ క్యాలెండ్ విడుదల చేశామన్నారు.

March 21, 2026 / 11:20 AM IST

పెట్రోల్ కొరతతో అవస్థలు ఆడుతున్న వాహనదారులు

ASR: చింతపల్లిలో పెట్రోల్ కొరతతో బంకుల వద్ద వాహనదారులతో భారీ రద్దీ పెరిగింది. అంతర్జాతీయ పరిణామాలు, సరఫరా అంతరాయాలపై భయాందోళనల నేపథ్యంలో చింతపల్లి మండలంలోఇంధన సంక్షోభ వాతావరణం నెలకొంది. శనివారం ఉదయం నుంచే మండల కేంద్రంలోని పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీగా బారులు తీరారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, నాలుగు చక్రాల వాహనాలు కూడా గంటల తరబడి ఎదురుచూస్తున్నారు.

March 21, 2026 / 11:20 AM IST

నీటి సమస్య పరిష్కరించాలని గ్రామస్తుల ఆవేదన

BDK: అశ్వాపురం మండలం మల్లెలమడుగు పంచాయతీ వైకుంఠధామంలో నీటి సమస్య ఉందని గ్రామస్థులు ఆవేదన ఇవాళ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సర్పంచుకు తెలిపిన ఫలితం లేదన్నారు. అక్కడ బోరు ఉన్నప్పటికీ, విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో నీరు రాక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బొమ్మవతి బిక్షమమ్మ 11వ రోజు కర్మకాండల సమయంలో నీరు లేక గ్రామస్థులు వాగు వద్దకు వెళ్లాల్సి వచ్చింది.

March 21, 2026 / 11:19 AM IST

ఈద్-ఉల్-ఫితర్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే

KRNL: ఎమ్మిగనూరు, పవిత్రమైన రాంజాన్ పండుగను పురస్కరించుకుని ఎమ్మిగనూరు స్థానిక ఈద్గాలో ముస్లింలు సోదర, సోదరిమణులకు ఎమ్మెల్యే డాక్టర్ బివి.జయనాగేశ్వర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. 30 రోజులు ఉపవాస దీక్షలు నిర్వహించి ఇవాళ ఈదుల్ ఫితర్ పండగ నిర్వహించుకోవడం శుభ పరిమాణమమని ఆయన పేర్కొన్నారు.

March 21, 2026 / 11:18 AM IST

రైల్వే స్టేషన్‌లో గుర్తుతెలియని యువకుడు మృతి

W.G: కృష్ణా జిల్లా తరిగొప్పుల రైల్వే స్టేషన్ ప్లాట్ఫారమ్ వద్ద గుర్తుతెలియని యువకుడు (సుమారు 25-30 ఏళ్లు) రైలు ఢీకొని మృతి చెందాడు. మృతుని వివరాలు తెలిసిన వారు వెంటనే గుడివాడ రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలని భీమవరం రైల్వే జీఆర్పి సుబ్రహ్మణ్యం కోరారు. మృతుని ఆచూకీ తెలిస్తే 92475 85713, 99890 29379 నెంబర్లను సంప్రదించాలని విన్నవించారు.

March 21, 2026 / 11:16 AM IST