• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ కలిశెట్టి

VZM: రంజాన్ పండుగ పురస్కరించుకుని ముస్లిం సోదర సోదరీమణులందరికీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ఈ పవిత్ర రంజాన్ అందరి జీవితాల్లో శాంతి, సౌభ్రాతృత్వం, సహనం, దయా గుణాలు మరింత పెంపొందించేలా ఉండాలని, సమాజంలో ఐక్యత, పరస్పర గౌరవం మరింత బలపడాలని ఆకాంక్షించారు.

March 21, 2026 / 10:30 AM IST

కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించిన చంద్రబాబు

AP: తిరుమల వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సీఎం చంద్రబాబు సందర్శించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫుడ్ సేఫ్టీ ల్యాబ్‌ను ఆయన ప్రారంభించనున్నారు. ఈ ల్యాబ్ ద్వారా నీరు, ఆహారపదార్థాలు, ముడి సరకుల నాణ్యతను పరీక్షించనున్నారు.

March 21, 2026 / 10:30 AM IST

‘ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి’

SDPT: హుస్నాబాద్ పట్టణంలో ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా 4 వార్డు కౌన్సిలర్ పిల్లి తిరుపతి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి చెత్త విభజనపై అవగాహన కల్పించారు.ఇంటి పరిసరాలు ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆరు బయట చెత్త వేయకుండా, మున్సిపల్ బండికి తడి చెత్త పొడి చెత్త వేరుచేసి అందించాలని సూచించారు.

March 21, 2026 / 10:29 AM IST

కాటారంలో ఘనంగా రంజాన్ వేడుకలు

BHPL: కాటారం మండలంలో రంజాన్ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ వేడుకల్లో మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య పాల్గొని మాట్లాడుతూ.. రంజాన్ మాసం ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో పాటించే పవిత్రమైన మాసమని అన్నారు.

March 21, 2026 / 10:29 AM IST

సంగారెడ్డిలో రంజాన్ ప్రార్ధనలు

SRD: రంజాన్ పండుగ సందర్భంగా సంగారెడ్డి పట్టణ శివారులోని ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులు శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం మత పెద్దలు రంజాన్ పండుగ గురించి వివరించారు. ప్రార్థన అనంతరం ఒకరినొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. డీఎస్పీ సత్తయ్య గౌడ్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

March 21, 2026 / 10:26 AM IST

TGSET-2025లో వికారాబాద్ విద్యార్థుల ప్రభంజనం

VKB: TGSET-2025 ఫలితాల్లో మ్యాథమెటికల్ సైన్సెస్ విభాగంలో వికారాబాద్ జిల్లా నుంచి ఐదుగురు విద్యార్థులు అర్హత సాధించారు. రాష్ట్ర స్థాయి పోటీలో విజయం సాధించిన వారు జె. దీపిక (158 మార్కులు), విష్ణువర్ధన్ (150), వి. వనిత (146), జి. మౌనిక (144), ఎం. ప్రవీణ్ కుమార్ (140) మార్కులతో ప్రతిభావంతులుగా ప్రదర్శన కనబరిచారు. వీరిని గ్రామస్థులు అభినందించారు.

March 21, 2026 / 10:25 AM IST

అక్రమంగా ఇసుక రవాణా.. డ్రైవర్ పై కేసు నమోదు

BHPL: టేకుమట్ల మండలంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారానే పక్క సమాచారం మేరకు SI సుధాకర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ను పట్టుకొని డ్రైవర్ వినయ్‌పై కేసు నమోదు చేశారు. అనుమతి పత్రాలు లేకుండా ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని SI హెచ్చరించారు.

March 21, 2026 / 10:24 AM IST

అశ్వాపురంలో మద్యం సిండికేట్ బహిరంగ దందా

BDK: అశ్వాపురం మండల కేంద్రంలో మద్యం సిండికేట్ ఆగడాలు రోజురోజుకు మితిమీరి పోతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా, అధికారుల అండదండలతోనే ఈ అక్రమ వ్యాపారం సాగుతోందని స్థానికులు మండిపడుతున్నారు. ప్రధాన రహదారి పక్కన, దేవాలయం, ఆసుపత్రి వంటి సున్నిత ప్రాంతాల సమీపంలోనే సిండికేట్ ఆఫీస్ నడుస్తోంది. సంబంధిత అధికారులు స్పందించి ఈ కార్యాలయాన్ని మూసివేయాలని కోరారు.

March 21, 2026 / 10:22 AM IST

వరాహ లక్ష్మీ నరసింహ స్వామికి సహస్రనామార్చన

VSP: సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో శనివారం సహస్రనామార్చన నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. సహస్రనామార్చనలో పాల్గొన్న భక్తుల, గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో కమనీయంగా జరిపించారు.

March 21, 2026 / 10:22 AM IST

మోత్కూర్ ఈద్గా వద్ద రంజాన్ ప్రార్థనలు…..

BHNG: మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలో రంజాన్ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఉదయం నుంచే ముస్లిం సోదరులు పట్టణంలోని ఈద్గా వద్దకు భారీగా చేరుకుని సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. చిన్నలు, పెద్దలు ఒకేచోట చేరి భక్తిశ్రద్ధలతో నమాజ్ చేశారు. ఏటా ఆనవాయితీగా ఇక్కడ వేడుకలు జరుపుకుంటామని, పండుగ వేళ అందరూ ఆనందంగా గడిపామని ముస్లిం సోదరులు తెలిపారు.

March 21, 2026 / 10:22 AM IST

మానవత్వం చాటుకున్న టోల్ ప్లాజా సిబ్బంది

KMR: బిక్కనూర్ మండల టోల్ ప్లాజా సిబ్బంది మానవత్వాన్ని చాటుకున్నారు. శనివారం తెల్లవారుజామున 44వ జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి నాగపూర్ వెళ్తున్న డీసీఎం నుంచి నాలుగు అల్లం పేస్ట్ కాటన్లు జారిపడ్డాయి. దీనిని గమనించిన టోల్ సిబ్బంది, మరో వాహనంలో వెళ్లి లారీని వెంబడించి ఆ బాక్సులను డ్రైవర్‌కు భద్రంగా అందజేశారు. సిబ్బంది నిజాయితీని లారీ యజమాని అభినందించారు.

March 21, 2026 / 10:21 AM IST

గల్లంతైన ఐదుగురి మృతదేహాలు లభ్యం

TG: భద్రాద్రి జిల్లా కొల్లుగూడెం వద్ద గోదావరిలో స్నానానికి వెళ్లి గల్లంతైన ఐదుగురి గాలింపు ముగిసింది. నిన్న మూడు మృతదేహాలు లభ్యం కాగా, తాజాగా పాశం సతీష్, గోక తేజ మృతదేహాలను గజ ఈతగాళ్లు వెలికితీశారు. దీంతో ఈ విషాద ఘటనలో మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాల లభ్యతతో ఆయా కుటుంబాల్లో తీరని శోకం మిగిలింది. అధికారులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

March 21, 2026 / 10:21 AM IST

బల్లికురవలో లారీ బీభత్సం

BPT: బల్లికురవ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. అతివేగంతో వెళ్తున్న ఓ భారీ లారీ అకస్మాత్తుగా అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న పల్లపు ప్రాంతంలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో లారీ క్యాబిన్‌లో ఉన్న డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

March 21, 2026 / 10:16 AM IST

ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్

MLG: ఉపాధి హామీ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ సలుగు సంతోష్ అన్నారు. ములుగు జిల్లాలోని దేవా నగర్ గ్రామపంచాయతీ పరిధిలో ఉపాధి హామీ కూలీలకు పే-స్లిప్పులను సర్పంచ్ అందజేశారు. పనులు చేసే వద్ద ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి సర్పంచ్ సూచనలు చేశారు.

March 21, 2026 / 10:16 AM IST

పిడుగు పడి పాడి ఆవు మృతి

PPM: కొమరాడ మండలం పరుశురాం పురం గ్రామంలో పిడుగు పడి పాడి ఆవు మృతి చెందినట్లు రైతు ముత్యాలు తెలిపారు. శుక్రవారం రాత్రి ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో ఆవుపై పిడుగు పడడంతో అక్కడికక్కడే ఆవు మరణించిందన్నారు. పాడే జీవనాధారంగా బతుకుతున్న.. తనకు తీవ్ర నష్టం వాటిలిందని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

March 21, 2026 / 10:15 AM IST