TG: కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డితో మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కీలక చర్చలు జరిపారు. జగిత్యాల వెళ్లిన మంత్రులు ఆయనతో భేటీ అయి, పార్టీ మారవద్దని సూచించారు. నియోజకవర్గంలో ఎదురవుతున్న సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. గత కొద్దిరోజులుగా అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డిని శాంతింపజేసేందుకు ప్రభుత్వం తరఫున ఈ బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది.
MHBD: తొర్రూరు (M) లోని దుబ్బాతండా, కర్రె బిక్య తండాల్లో అంగన్వాడి కేంద్రాలు మూతపడడంతో చిన్నారుల పోషకాహార సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. పర్యవేక్షణ లేకపోవడంతో ప్రభుత్వం అందిస్తున్న పోషకాహార సరుకులు లబ్ధిదారులకు అందడం లేదు. అంగన్వాడీ సేవలు నిలిచిపోవడంతో బాలింతలు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే అంగన్వాడీలను పునఃప్రారంభించాలని కోరారు.
MDK: నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలం సికింద్లాపూర్ గ్రామంలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర ఘనంగా జరిగింది. ఈ జాతరలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. జాతర సందర్భంగా MLA స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలతో కలిసి జాతర ఉత్సవాల్లో పాల్గొని భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు.
HYD: నేరెడ్‌మెట్, ఓల్డ్ సఫిల్‌గూడలో హృదయవిదారక ఘటన జరిగింది. ప్రేమ వివాహనికి యువతి తల్లి నిరాకరించడంతో మనస్తాపం చెందిన 23 ఏళ్ల నరేశ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉగాది పండుగకు స్నేహితుడు స్వగ్రామానికి వెళ్లగా ఒంటరిగా ఉన్న సమయంలో నరేశ్ గదిలో ఉరేసుకుని మృతి చెందాడు. పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
NGKL: అమ్రాబాద్ మండలం కల్ములోనిపల్లిలో ఎనిమిదేళ్ల క్రితం తెచ్చిన డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ విగ్రహం ఇప్పటికీ ఆవిష్కరణకు నోచుకోలేదు. ప్రస్తుత ఎమ్మెల్యే వంశీకృష్ణ గతంలో అందించిన ఈ విగ్రహాన్ని రాజకీయ కారణాలతో ఒక మూల పడేశారు. ప్లాస్టిక్ కవర్ కప్పి చెత్త కుప్పలో ఉంచడంపై గ్రామ యువత తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అన్నమయ్య: సంబేపల్లిలో రంజాన్ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. నెలరోజులు ఉపవాస దీక్షలో పాల్గొన్న ముస్లింలు చివరి రోజు ఈద్గా వద్దకు వెళ్లారు. అందరూ కలిసి ప్రార్థనలు చేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పేదలకు దానధర్మాలు చేశారు.
ELR: రేపు ఉదయం 10 గంటలకు ఏలూరులోని యూటీఎఫ్ భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ ఇవాళ తెలియజేశారు. ఏలూరు పవర్ పేట అన్నే భవనంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏలూరులో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభలు జూన్ 3, 4, 5 తేదీలలో నిర్వహిస్తున్నామన్నారు.
NRPT: మరికల్ మండలం తీలేరులో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. గత మూడు రోజుల క్రితం గ్రామంలో ప్రదర్శించిన శ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జీవిత చరిత్ర వీధి నాటకంలో పాల్గొన్న భక్తులు, కళాకారులు శనివారం కడప జిల్లాలోని బ్రహ్మంగారిమఠం దర్శనార్థం బయలుదేరి వెళ్లారు. స్వామి వారి పాత్రలు పోషించిన అనంతరం క్షేత్ర దర్శనం చేసుకుంటే శుభం జరుగుతుందన్నారు.
AP: MLA అరవ శ్రీధర్ బాధితురాలు హర్ష వీణ మరో వీడియో రిలీజ్ చేసింది. అరవ శ్రీధర్‌కు పవన్ కళ్యాణ్ క్లీన్‌చిట్ ఇచ్చారా. కేసులపై మాట్లాడకూడదని ఆంక్షలు ఉన్నాయి. పార్టీ కార్యక్రమాల్లో శ్రీధర్ పాల్గొంటున్నారు. ఇప్పటివరకు శ్రీధర్‌పై ఎలాంటి చర్యలు లేవు. నాకు న్యాయం చేయండి’ అని పేర్కొన్నారు.
KDP: కొండాపురం మండలంలోని 67 జాతీయ రహదారిలో ఉన్న వెంకటాపురం సీతారామయ్యస్వామి ఆలయానికి 116 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ దేవాలయాన్ని 1910లో ఒక భక్తుడు నిర్మించాడు. ఈ నెల 27న శ్రీరామనవమి పండగ పర్వదినం సందర్భంగా.. పంచామృత అభిషేకం, ప్రత్యేక పూజలు పానకం, వడపప్పు వితరణ, రామ భజనలు ఈ ప్రాచీన ఆలయంలో జరగనున్నట్లు స్థానికులు తెలిపారు.
NTR: విజయవాడ మధురానగర్ నేతాజీ కాలనీలో నివాసం ఉంటున్న బుక్త జ్యోతి ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొని, గత కొంతకాలంగా కంటి సమస్యతో బాధపడుతూ,సరిగ్గా చూడలేకపోతున్నానని ఎమ్మెల్యే బోండా ఉమా దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే తక్షణమే స్పందించి, జ్యోతికు అవసరమైన కళ్ళజోళ్లను శుక్రవారం ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
RR: శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ ఆదిత్య నగర్ ఈద్గాలో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని కొనియాడారు.
NLR: కందుకూరి ఎమ్మెల్యే నాగేశ్వరరావు ముస్లిం సోదర సోదరీమణులకు పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అన్నారు. ఈద్ పండుగ అందరి ఇంట కొత్త వెలుగులు తీసుకురావాలని, అల్లాహ్ దీవెనలతో ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలన్నారు. రంజాన్ పండుగను సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
NZB: జక్రాన్‌పల్లి మండలం అర్గుల్లో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద శనివారం శ్రీనివాస్ గౌడ్ దంపతులు గృహ ప్రవేశం చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు రాజేందర్ హాజరయ్యారు. నిరుపేదల సొంతింటి కల నెరవేరుస్తున్న ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకలో లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాలుగోన్నారు.
SRCL: వేములవాడలో జరిగిన రంజాన్ పండుగ వేడుకల్లో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. అలాగే ముస్లింలకు రంజాన్ పవిత్ర మాసం అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు, వైస్ ఛైర్మన్ నరాల శేఖర్, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.