• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పాలు తాగితే కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుందా?

పాలు జంతు సంబంధిత ఆహారం కాబట్టి ఇందులో కొలెస్ట్రాల్ స్థాయిలను ప్రభావితం చేసే కొవ్వులు ఉంటాయి. అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు పాలను మానేయడం సరికాదు. శరీర ఆరోగ్యాన్ని బట్టి పాలను ఎంచుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ధమనుల్లో ఫలకాలు ఏర్పడేలా చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్ రక్తనాళాలను ఇరుకుగా చేసి గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.

February 23, 2026 / 10:36 AM IST

అన్నా క్యాంటీన్‌ను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్

KRNL: ఆదోనిలోని అన్నా క్యాంటీన్‌ను ఇవాళ మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాంటీన్‌ను చేరుకున్న ఆయన, అక్కడ అందుతున్నసేవలపై ఆరా తీశారు. అక్కడ పాటిస్తున్న పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం అల్పాహారం చేస్తున్న సామాన్య ప్రజల వద్దకు వెళ్లి, ఆహారం రుచిగా ఉంటుందా అని అడిగి తెలుసుకున్నారు. నాణ్యత విషయంలో రాజీపడకూడదని స్పష్టం చేశారు.

February 23, 2026 / 10:35 AM IST

సామర్లకోటలో పోలీస్ బందోబస్త్

KKD: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు నేపథ్యంలో సామర్లకోట పట్టణ పరిధిలో గల పరీక్ష కేంద్రాల వద్ద ప్రత్యేక బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు పటిష్ట బందోబస్తులను చేపట్టినట్టు సామర్లకోట సీఐ కృష్ణ భగవాన్ పేర్కొన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.

February 23, 2026 / 10:34 AM IST

పాలక వర్గం ఏర్పాటయ్యేలా చూడాలి: CPI

MNCL: క్యాతన్ పల్లి మున్సిపల్ పాలక వర్గాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని CPI రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్ సోమవారం ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రజా తీర్పును అగౌరవపరుస్తూ అధికారులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఓటర్ల తీర్పును గౌరవించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. వెంటనే పాలక వర్గం ఏర్పాటయ్యేలా చూడాలన్నారు.

February 23, 2026 / 10:33 AM IST

ధర్మసాగర్ లో పూర్వ విద్యార్థుల ప్రత్యేక సమ్మేళనం

 HNK: ధర్మసాగర్ మండల కేంద్రంలో సోమవారం పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు ప్రత్యేక సమావేశాన్ని జరుపుకున్నారు.1981-82వ సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థులు సమావేశాన్ని జరుపుకుని ఆత్మీయతను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఏలూరు కతోలిక పీఠాధిపతిగా కొనసాగుతున్న జయ రావు పులిమేరాను సహచర మిత్రులు ఘనంగా సన్మానించారు.

February 23, 2026 / 10:32 AM IST

ఆ స్పెషల్‌ డేకు.. ‘జననాయగన్’ రిలీజ్‌!

దళపతి విజయ్ నటించిన చివరి, 69వ తమిళ చిత్రం ‘జననాయగన్’. హెచ్. వినోద్ దర్శకత్వంలో KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ రాజకీయ యాక్షన్ థ్రిల్లర్, సెన్సార్ బోర్డు వివాదాల నుండి బయటపడి, విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమాను విజయ్ పుట్టినరోజుకు విడుదల చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

February 23, 2026 / 10:32 AM IST

విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ

AKP: పాములవాక జడ్పీ హైస్కూల్ విద్యార్థులకు సోమవారం జిల్లా అందత్వ నివారణ సమితి ఆధ్వర్యంలో కంటి అద్దాలు పంపిణీ చేశారు. వారం రోజుల కిందట విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి కంటి లోపాలు ఉన్న విద్యార్థులను గుర్తించారు. వారిలో అర్హులైన వారికి కంటి అద్దాలను పంపిణీ చేసినట్లు ఉపాధ్యాయులు సుజాత, భీమన్న, రామారావు తెలిపారు.

February 23, 2026 / 10:31 AM IST

నిరుపయోగంగా తనకల్లు బస్టాండు

సత్యసాయి: తనకల్లులో ఆర్టీసీ బస్టాండు ఎనిమిదేళ్లుగా నిరుపయోగంగా మారింది. అధికారులు బస్సులను అంబేద్కర్ సర్కిల్ వద్ద నిలుపుతున్నారు. దీంతో ప్రయాణికులు నీడ, తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం లేక దుకాణాల ముందు నిలబడాల్సి వస్తోంది. మహిళా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి బస్సులను బస్టాండు నుంచి నడపాలని స్థానికులు కోరుతున్నారు.

February 23, 2026 / 10:31 AM IST

ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధర వివరాలు..

ADB: ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో సోమవారం సీసీఐ పత్తి ధర క్వింటా రూ.8,010గా, ప్రైవేట్ పత్తి ధర రూ.7,000గా నిర్ణయించారు. గత వారం ధరతో పోలిస్తే సోమవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పు లేదు. ప్రైవేట్ ధరలో సైతం వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలియజేశారు.

February 23, 2026 / 10:30 AM IST

నేడు రాజాంలో సందడి చేయనున్న జబర్దస్త్ టీం

VZM: రాజాం శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి 100వ జాతరలో సోమవారం రాత్రి జబర్దస్త్ టీం సందడి చేయనున్నారు. జబర్దస్త్ నటుడు హైపర్ ఆది, రేంజింగ్ రాజ్, శాంతి స్వరూప్, దొరబాబు, సౌమ్య రావు, తదితరులు తమ కామెడీతో అలరించనున్నారు. ఈవెంట్ వద్ద ఎటువంటి ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని పోలీసులు, కమిటీ నిర్వాహకులు తెలిపారు.

February 23, 2026 / 10:30 AM IST

బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం ఆరా

TG: ఆదిలాబాద్ జిల్లా శ్యామ్‌పూర్‌లో ఆసిఫాబాద్ డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించిన కారణాలపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్, ఎస్పీతోనూ మాట్లాడారు.

February 23, 2026 / 10:29 AM IST

నేడు కోదాడలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పర్యటన

SRPT: కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఈరోజు నియోజకవర్గంలో పలు సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా మధ్యాహ్నం 3:00 గంటలకు కోదాడ మున్సిపల్ కార్యాలయంలో నూతన చైర్మన్, కౌన్సిలర్ల బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం లారీ ఓనర్స్ అసోసియేషన్ సమావేశంలో పాల్గొంటారని పిఆర్ఓ వెంకట రెడ్డి తెలిపారు.

February 23, 2026 / 10:27 AM IST

ఎస్ ఎం పురంలో ఘనంగా ఎర్రం నాయుడు జయంతి వేడుకలు

SKLM: ఎచ్చెర్ల మండలం ఎస్ ఎం పురం గ్రామంలో దివంగత నేత, మాజీ మంత్రి కింజరావు ఎర్రం నాయుడు 69వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జిల్లా టీడీపీ అధ్యక్షులు చౌదరి నారాయణమూర్తి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్ ధనలక్ష్మి, డీసీఎంఎస్ ఛైర్మన్ అవినాష్, తదితరులు పాల్గొన్నారు.

February 23, 2026 / 10:25 AM IST

BREAKING: అనూరియా వ్యాధి.. ముగ్గురు మృతి

AP: రాజమండ్రిలో అనూరియా వ్యాధితో ముగ్గురు మృతి చెందారు. మృతులలో కృష్ణవేణి(85), రాధాకృష్ణామూర్తి(74), శేషగిరిరావు(72) ఉన్నారు. మరో 11 మంది బాధితులు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు.

February 23, 2026 / 10:23 AM IST

ట్విన్స్ డే రోజే.. ట్విన్స్ వివాహం

KMR: ట్విన్స్ డే రోజే ట్విన్స్ వివాహం చేసుకున్న అరుదైన సంఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో జరిగింది. ఘన్పూర్‌కు చెందిన భాస్కర్- సుజాత దంపతుల కవల కుమారులు విజయ్‌కుమార్, వినయ్‌కుమార్‌కు తాడ్వాయి మండలం దేమే గ్రామానికి చెందిన కుమ్మరి రాజమణి- సాయన్న కవల కుమార్తెలు కీర్తన, కీర్తితో వివాహం జరిగింది. అంతర్జాతీయ కవలల దినోత్సవం రోజే వారికి పెళ్లి అయింది.

February 23, 2026 / 10:22 AM IST