• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పోలీసు అధికారులతో నెలవారి నేర సమీక్షా సమావేశం

కర్నూలు: జిల్లా పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణే లక్ష్యంగా పని చేయాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసు అధికారులకు ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాపర్టీ కేసులలో పోలీసులు బాగా పని చేయాలని సూచించారు.

February 25, 2026 / 06:09 PM IST

అనంతపురంలో టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేయండి: ఎమ్మెల్యే

ATP: అనంతపురం నగర పరిసరాల్లో టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేసి యువత, మహిళలకు ఉపాధి కల్పించాలని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అసెంబ్లీలో కోరారు. బుధవారం సభలో ఆయన మాట్లాడుతూ.. నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు పెరగాలన్నారు. తక్కువ వేతనాలతో ఇబ్బంది పడుతున్న వారికి ఈ పార్క్ ఎంతో దోహదపడుతుందని వివరించారు.

February 25, 2026 / 06:09 PM IST

నాగిరెడ్డిపేట ఏపీఎంగా వెంకటలక్ష్మీ బాధ్యతల స్వీకరణ

కామారెడ్డి జిల్లాలోనీ నాగిరెడ్డిపేట మండల సమాఖ్య ఏపీఎంగా వెంకటలక్ష్మీ బుధవారం రోజున బాధ్యతలు స్వీకరించారు. ఆమె రాజన్న సిరిసిల్ల జిల్లాలో పని చేసి ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఇక్కడ ఎల్లారెడ్డి ఏపీఎం రామ్ నారాయణ గౌడ్ ఇన్‌ఛార్జ్‌గా పని చేశారు. మహిళా సంఘాల అభివృద్ధికి తాను నిరంతరం కృషి చేస్తానని వెంకటలక్ష్మీ తెలిపారు.

February 25, 2026 / 06:08 PM IST

అభివృద్ధి పనుల్లో రాజీ పడొద్దు: రఘునందన్

TG: మెదక్‌లోని రామచంద్రాపురం కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2 వద్ద నిర్మాణంలో ఉన్న సర్వీస్ రోడ్డును ఎంపీ రఘునందన్ రావు పరిశీలించారు. త్వరలోనే ప్రజలకు దీనిని అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ రోడ్డు పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సౌకర్యమే ప్రధాన లక్ష్యమని, అభివృద్ధి పనుల్లో రాజీ పడొద్దని పేర్కొన్నారు.

February 25, 2026 / 06:08 PM IST

భవిష్యత్ బ్యాంకర్లకు ప్రత్యక్ష అనుభవం

KDP: జెడ్‌పీహెచ్‌ఎస్‌ఎస్‌ మైదుకూరులో BFSI వృత్తి విద్యలో భాగంగా విద్యార్థులకు ప్రాయోగిక అవగాహన కల్పించేందుకు మంగళవారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వైఎస్ఆర్‌నగర్ శాఖలో పారిశ్రామిక సందర్శన నిర్వహించారు. శాఖ మేనేజర్ పీ. శర్మిల విద్యార్థులకు బ్యాంక్ పనితీరు, ఖాతా ప్రారంభం, రుణాల ప్రక్రియ, డిజిటల్ బ్యాంకింగ్ సేవలపై వివరించారు.

February 25, 2026 / 06:07 PM IST

రైతుల ఉసురు పోసుకుంటున్న కాంగ్రెస్: హరీశ్ రావు

SDPT: కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటోందని మాజీ మంత్రి,ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు బడా కాంట్రాక్టర్ల కోసమే పనిచేస్తున్నారని ‘X’ వేదికగా విమర్శించారు. రైతుల కన్నీళ్లతో పాలన సాగించిన ఏ ప్రభుత్వం బాగుపడలేదని హితవు పలికారు.అన్నదాతలు ఇబ్బందుల్లో ఉన్నారని వెంటనే రైతుబంధు విడుదల చేయాలన్నారు

February 25, 2026 / 06:06 PM IST

ముగిసిన ఎంఈఓల శిక్షణ కార్యక్రమం

ATP: ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాల మండల విద్యాశాఖ అధికారుల రెండు రోజుల శిక్షణ కార్యక్రమం బుధవారం ముగిసింది. కొర్రపాడు, బుక్కరాయసముద్రం కేంద్రాల్లో నిర్వహించిన ఈ సదస్సులో కేపాసిటీ బిల్డింగ్, ఎఫ్ఎల్ఎన్ అంశాలపై అవగాహన కల్పించారు. అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల ఎంఈఓలు, డైట్ అధ్యాపకులు ఇందులో పాల్గొన్నారు.

February 25, 2026 / 06:05 PM IST

‘విధుల్లో అలసత్వం వద్దు’

VZM: ముఖ్యమంత్రి ప్రజావేదికకు పక్కా ఏర్పాట్లు చేయాలని అమరావతి నుండి వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఇంఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి విరించారు. ఎటువంటి అవాంతరాలు లేకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలన్నారు

February 25, 2026 / 06:05 PM IST

మార్కాపురం జిల్లాకు సీఎం వరాల జల్లు

ప్రకాశం: మార్కాపురం జిల్లా ప్రజలకు సీఎం చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. మార్కాపురంలో నూతన కలెక్టరేట్‌ నిర్మాణానికి రూ.50 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. జిల్లాలో ఫ్లోరైడ్ బాధితులు లేకుండా రక్షిత మంచి నీరు ఇస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలో ఉన్న భూ సమస్యలు పరిష్కరిస్తానని, వెలిగొండ్ల ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తానని చెప్పుకొచ్చారు.

February 25, 2026 / 06:05 PM IST

మార్చి 1 నుంచి సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు

NLG: ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టినట్లు ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ తెలిపారు. చిట్యాలలో బుధవారం జరిగిన సీపీఎం మండల కమిటీ సమావేశంలో… మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై బృందం అధ్యయనం చేసి పోరాట కార్యక్రమాన్ని రూపొందిస్తుందని తెలిపారు.

February 25, 2026 / 06:04 PM IST

3.45 లక్షల మంది బాలికలకు ఫ్రీగా HPV టీకాలు

AP: గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లపై ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. 3.45 లక్షల మంది బాలికలకు ఉచితంగా HPV టీకాలు పంపిణీ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 1,683 ఆరోగ్య కేంద్రాల ద్వారా టీకాల పంపిణీ చేపట్టనున్నారు. బాలికల వ్యాక్సినేషన్‌కు తల్లిదండ్రుల్లో ఒకరి సమ్మతి తప్పనిసరి. ఈనెల 28న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా టీకాలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి సత్యకుమార్ వెల్లడించారు.

February 25, 2026 / 06:03 PM IST

రేపల్లెలో జీవనోపాధులపై పైలట్ ప్రాజెక్ట్

BPT: రేపల్లెలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో బుధవారం టీడీపీ నేత అనగాని శివప్రసాద్ ఆధ్వర్యంలో జీవనోపాధులపై సమీక్ష జరిగింది. మహిళా సంఘాల ద్వారా తాటి బెల్లం, ఎండు చేపలు, పండ్లను ప్రాసెసింగ్ చేసి ఎగుమతి చేసే ప్రణాళికపై వారు చర్చించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా రేపల్లె నియోజకవర్గంలో ఈ పైలట్ ప్రాజెక్ట్ అమలు కానుంది.

February 25, 2026 / 06:02 PM IST

‘అటవీ అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారు’

ASF: తమ భూమిలో సాగు చేసుకోనియకుండా అటవీ అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారని సిర్పూర్(T) మండలం అచ్చేల్లి గ్రామస్థులు ఆరోపించారు. గత 40 ఏళ్లుగా 136 సర్వే నెం.లో సాగు చేసుకుంటున్న తమ భూమి అటవీ పరిధిలో వస్తుందని అధికారులు అబద్దాలు చెబుతున్నారన్నారు. ఈ మేరకు ఇట్టి భూములపై జాయింట్ సర్వే చేసి తమకు న్యాయం చేయాలని బుధవారం MRO కి వినతిపత్రం అందజేశారు.

February 25, 2026 / 06:01 PM IST

‘పోషకాహారం నాణ్యంగా ఉండాలి’

ASF: కాగజ్ నగర్ మండలం కోయవాగు అంగన్వాడీ కేంద్రాన్ని సర్పంచ్ చింతపురి లక్ష్మి బుధవారం సందర్శించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నారులకు అందించే పోషకాహారం నాణ్యంగా ఉండాలని, పంపిణీలో ఎటువంటి లోపాలు ఉండకూడదని సిబ్బందిని ఆదేశించారు. గ్రామంలోని చిన్నారులందరూ కేంద్రానికి వచ్చేలా చూడాలని, వారి ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

February 25, 2026 / 06:01 PM IST

కాల్వ పనుల కోసం భిక్షాటన చేసిన రైతులు

SRCL: ఇల్లంతకుంట మండల కేంద్రంలో LM–6 కాల్వ పనుల కోసం 16వ రోజు దీక్ష కొనసాగిస్తున్న బాధిత రైతులు బుధవారం బిక్షాటనకు దిగారు. పెద్దలింగపూర్ నుంచి ట్రాక్టర్లపై వచ్చిన రైతులు, సర్పంచులు, మహిళలు దుకాణదారుల వద్ద సహాయం కోరారు. కాల్వ పూర్తి చేయడానికి రూ.3.20 కోట్లు అవసరమని, నిధులు విడుదలయ్యే వరకు పోరాటం ఆపబోమని వారు స్పష్టం చేశారు.

February 25, 2026 / 06:01 PM IST