• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పెదకాకానిలో స్పౌజ్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం

GNTR: పెదకాకాని మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు, సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ ఆదేశాల మేరకు నూతనంగా మంజూరైన 14 స్పౌజ్ (విడో) పెన్షన్లను పంపిణీ చేశారు. పెదకాకాని, తక్కెళ్ళపాడు, ఉప్పలపాడు, కొప్పురావూరు, వెనిగండ్ల గ్రామాల లబ్ధిదారులకు మండల ఎంపీపీతో పాటు, కూటమి నాయకులు పెన్షన్లు అందజేశారు.

February 28, 2026 / 04:59 PM IST

గలిజేరుగుళ్లలో శనగలు, కందులు కొనుగోలు ప్రారంభం

ప్రకాశం: బేస్తవారిపేట మండలంలోని గలిజేరుగుళ్ల గ్రామంలో శనివారం కందులు, శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ రఫీక్ పాల్గొని మాట్లాడారు. కందులు ప్రభుత్వం మద్దతు ధర రూ. 8000, శనగలు ప్రభుత్వం మద్దతు ధర రూ. 5850గా నిర్ణయించడం జరిగిందని అన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలన్నారు.

February 28, 2026 / 04:57 PM IST

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల బుక్‌లెట్ ఆవిష్కరణ

KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల బుక్‌లెట్‌ను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ఎం. రవిచంద్ర కలిసి ఆవిష్కరించారు. మార్చి 27 నుంచి ఏప్రిల్ 5 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 1న సీతారాముల కల్యాణాన్ని రాష్ట్ర పండుగగా అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

February 28, 2026 / 04:55 PM IST

మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం: పవన్

AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

February 28, 2026 / 04:54 PM IST

సబ్ జైలును తనిఖీ చేసిన జడ్జి రాజ్యలక్ష్మి

W.G: నరసాపురం అదనపు సివిల్ జడ్జి ఎస్. రాజ్యలక్ష్మి శనివారం సబ్ జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె జైలులోని రికార్డులను పరిశీలించి, ముద్దాయిలతో నేరుగా మాట్లాడారు. వారి కేసుల వివరాలు, ఆరోగ్య పరిస్థితి, జైలులో అందిస్తున్న ఆహారం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జైలు ప్రాంగణం పరిశుభ్రంగా ఉండాలని సూచించారు.

February 28, 2026 / 04:54 PM IST

రాయచోటిలో మహిళా దినోత్సవ ర్యాలీ

అన్నమయ్య: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాయచోటిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. డీఎస్పీ కృష్ణమోహన్ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. SN కాలనీ నుంచి నేతాజీ సర్కిల్ వరకు విద్యార్థినులతో మానవహారం నిర్వహించారు. మహిళల పట్ల అన్యాయం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. మహిళలకు ఎలాంటి సమస్యలు వచ్చినా పోలీసులు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు.

February 28, 2026 / 04:54 PM IST

కలెక్టర్‌తో ఎమ్మెల్యే పరిటాల సునీత భేటీ

ATP: ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ శనివారం జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్‌ను కలిసి నియోజకవర్గ సమస్యలపై చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మార్చి 4న జరగనున్న సమీక్షా సమావేశం నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. నడిమివంక రక్షణ గోడకు రూ.40 కోట్లు, జలజీవన్ మిషన్ పెండింగ్ బిల్లుల అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

February 28, 2026 / 04:51 PM IST

తుంపర్తి కాలనీలో మంచినీటి సమస్యకు మోక్షం

సత్యసాయి: ధర్మవరం పట్టణం తుంపర్తి కాలనీలో గత 20 రోజులుగా నెలకొన్న మంచినీటి సమస్యపై మంత్రి సత్యకుమార్ కార్యాలయం తక్షణమే స్పందించింది. నీటి మోటార్ వైర్లు కాలిపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించిన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ హరీష్ బాబు శనివారం కాలనీని సందర్శించారు. అనంతరం త్వరగా నీటి సరఫరాను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు.

February 28, 2026 / 04:51 PM IST

అదనపు కలెక్టర్ కు తీన్మార్ మల్లన్న వినతి

KMM: భూదాన్ భూముల బాధిత కుటుంబాలకు అదే భూమిలో పునరావాసం కల్పించాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని విజ్ఞప్తి చేశారు. శనివారం తీన్మార్ మల్లన్న అదనపు కలెక్టర్‌ను కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రం అందించారు. తక్షణ సహాయం కింద ప్రతి బాధిత కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సాయం అందించాలని చెప్పారు. పేదలపై దాడి సరికాదన్నారు.

February 28, 2026 / 04:50 PM IST

‘టాక్సిక్’ టికెట్ ధర రూ.1200..?

కన్నడ స్టార్ యష్ కథానాయకుడిగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ చిత్రం ‘టాక్సిక్’. ఈ సినిమా టికెట్ ధరలపై బెంగళూరులో జోరుగా చర్చ సాగుతోంది. మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధర దాదాపు రూ.1200 వరకు ఉండవచ్చని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. భారీ బడ్జెట్ సినిమా కావడంతో, క్రేజ్‌కు తగ్గట్టుగా ప్రీమియం స్క్రీన్లలో ఈ స్థాయిలో ధరలు ఉండే అవకాశం ఉందని టాక్.

February 28, 2026 / 04:49 PM IST

వెంకటేశ్వర స్వామికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే

PLD: రాజుపాలెం మండలం దేవరంపాడు గ్రామంలోని శ్రీ స్వయంభు మత్స్యావతార వెంకటేశ్వర స్వామివారి తిరుణాల మహోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తిరునాళ్ల సందర్భంగా సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ , ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు పొందారు.

February 28, 2026 / 04:48 PM IST

వర్ధన్నపేటలో పరిశుభ్రతపై ఛైర్మన్ సారంగపాణి తనిఖీలు

WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీలోని 2వ, 7వ డివిజన్లలో మున్సిపాలిటీ ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి పరిశుభ్రత పనులను శనివారం తనిఖీ చేశారు. చెత్త బండి సకాలంలో వస్తుందా లేదా అని పర్యవేక్షించిన ఆయన, ప్రజలకు లేదా సిబ్బందికి సమస్యలుంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు బెజ్జం .పాపరావు, శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు.

February 28, 2026 / 04:47 PM IST

బీసీ సంఘం టేబుల్ క్యాలెండర్ ఆవిష్కరణ

KNR: బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ ఆధ్వర్యంలో బీసీ సంఘం టేబుల్ క్యాలెండర్ను KNRలో మహాత్మ జ్యోతిబాపూలే మైదానంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడూరి పరుశురాం గౌడ్, జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాచమల్ల రాజు, తదితరులు పాల్గొన్నారు.

February 28, 2026 / 04:47 PM IST

‘సెంటిల్ కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ ఎంపీ’

MHBD: నెల్లికుదురు మండలంలోని రత్తిరాం తండాకు చెందిన గుగులోతు వంశీకృష్ణ హైదరాబాదులో నూతనంగా ఏర్పాటు చేసిన సెంటిల్ కార్పొరేట్ కార్యాలయాన్ని మహబూబాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత ప్రారంభించారు. సెంటిల్ కార్పొరేట్ కార్యాలయం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని అన్నారు.

February 28, 2026 / 04:47 PM IST

టెన్త్ పరీక్షల్లో వంద శాతం ఫలితాలే లక్ష్యం: కలెక్టర్

గద్వాల: పదో తరగతి పరీక్షలు అంటే భయం వద్దు, ఒత్తిడిని వీడి ప్రశాంతంగా చదివితే విజయం మీదే అని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పేర్కొన్నారు. శనివారం జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా గద్వాల బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్, ఫుడ్ ఫెస్టివల్‌ను ఆయన సందర్శించారు. విద్యార్థులు రూపొందించిన వైజ్ఞానిక నమూనాలను ప్రశంసించారు.

February 28, 2026 / 04:46 PM IST