• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఆలం ఖాన్ పల్లిలో రూ.1.50 కోట్ల డ్రైనేజీ పనులకు శ్రీకారం

కడప నగరంలోని 50వ డివిజన్ ఆలం ఖాన్ పల్లిలో రూ.1.50 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న నూతన డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మాధవి రెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి భూమిపూజ నిర్వహించారు. చిరకాలంగా ఉన్న డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

February 28, 2026 / 07:56 PM IST

క్రీడా పాఠశాలల అడ్మిషన్ల గోడ పత్రిక ఆవిష్కరణ

NGKL: క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి అడ్మిషన్లకు సంబంధించి గోడపత్రికను జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఈరోజు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2026-27 విద్యా సంవత్సరానికి క్రీడ పాఠశాలలో అడ్మిషన్ల కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న అనంతరం క్రీడా శాఖ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

February 28, 2026 / 07:54 PM IST

99 రోజుల యాక్షన్ ప్లాన్‌పై సీఎం సమీక్ష

TG: 99 రోజుల యాక్షన్ ప్లాన్‌పై సీఎం రేవంత్ సమావేశం నిర్వహించారు. మార్చి నుంచి జూన్ వరకు 99 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని  అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో సీఎస్ రామకృష్ణా రెడ్డితో పాటు సీఎం సలహాదారు, డీజీపీ శివధర్ రెడ్డి పాల్గొన్నారు. సంక్షేమ పథకాల అమలు, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పూర్తి, ప్రజల సమస్యల తక్షణ పరిష్కారంపై ఈ ప్లాన్ దృష్టి సారించనుంది.

February 28, 2026 / 07:54 PM IST

ఉత్తమ పనితీరు కనబరిచిన పోలీసులకు ఎస్పీ అభినందనలు

మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ శనివారం క్రైంమీటింగ్ నిర్వహించారు. నేరసమీక్ష అనంతరం ఉత్తమ పనితీరు కనబరిచిన పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసాపత్రాలు అందజేసి, అభినందించారు. విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా, అప్రమత్తంగా ఉండాలని ఎస్సీ సూచించారు.

February 28, 2026 / 07:52 PM IST

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

కర్నూలు జిల్లా ఎదురూరు గ్రామం వద్ద ఇవాళ ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి చెందాడు. ఆర్.కొంతలపాడు గ్రామానికి చెందిన కురువ పరుశరాముడు(24) నడుచుకుంటూ వెళ్తుండగా కర్నూలు రెండో డిపోకు చెందిన బస్సు ఢీకొట్టడంతో ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 28, 2026 / 07:51 PM IST

డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహించిన ఎస్సై

ప్రకాశం: మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడితే రూ.10వేలు జరిమానా తప్పదని హనుమంతునిపాడు ఎస్సై మాధవరావు హెచ్చరించారు. శనివారం వేములపాడు రోడ్డులో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను ఎస్సై నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మద్యం తాగి నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.

February 28, 2026 / 07:50 PM IST

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించిన సీఐ

కృష్ణా: గుడివాడలో విద్యార్థులకు టూ టౌన్ సీఐ హనీష్ కుమార్ ఓపెన్ హౌస్ కార్యక్రమం శనివారం నిర్వహించారు. పోలీస్ శాఖ పనితీరుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఫిర్యాదు (Complaint) అంటే ఏమిటి, ఎఫ్‌ఐఆర్ (FIR) అంటే ఏమిటి, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత ముద్దాయిని అరెస్ట్ చేసే విధానం, తదనంతరం ఛార్జ్ షీట్ దాఖలు చేసే ప్రక్రియ వంటి అంశాల గురించి వివరించారు.

February 28, 2026 / 07:47 PM IST

వేట్లపాలెం ఘటనపై రేవంత్ విచారం

TG: ఏపీలోని కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు సహాకారం అందించాలని పేర్కొన్నారు. కాగా, ఈ పేలుడు ఘటనలో 23 మంది మృతి చెందగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధిత కుటంబాలకు కేంద్రం రూ. 2 లక్షలు ప్రకటించింది.

February 28, 2026 / 07:47 PM IST

‘దోమల నివారణకు తగు చర్యలు తీసుకోండి’

MBNR: కౌకుంట్ల మండలం వెంకటగిరిలో దోమల బెడదా తీవ్రంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. ప్రతి రోజు.. దోమలు కుట్టి టైఫాయిడ్, మలేరియా ఇతర అనేక రోగాల బారిన పడే ప్రమాదం ఉందని స్థానికులు పేర్కొన్నారు. దయచేసి గ్రామ సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ స్పందించి వెంటనే దోమల నివారణకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

February 28, 2026 / 07:45 PM IST

ఫైరింజన్లు రాలేక.. పెరిగిన ప్రమాద తీవ్రత?

AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటన అందరినీ కలచివేసింది. అయితే, బాణాసంచా తయారీ కేంద్రం పొలాల మధ్య ఉండటంతో అక్కడికి ఫైరింజన్, అంబులెన్స్ వెళ్లలేని పరిస్థితి తలెత్తింది. ఫలితంగా చాలాసేపటి వరకు పేలుళ్లు కొనసాగాయి. చివరికి ధైర్యం చేసి కొందరు స్థానికులు పేలుడు సంభవించే ప్రాంతానికి చేరుకునే సరికే చాలామంది అగ్నికి ఆహుతయ్యారు. శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.

February 28, 2026 / 07:45 PM IST

గద్వాల్ రైల్వే పార్కింగ్‌లో అక్రమ వసూళ్లు..?

GDWL: గద్వాల్ రైల్వే స్టేషన్ పార్కింగ్ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. రోజువారీ ఛార్జీల కంటే రెట్టింపు వసూలు చేస్తున్నారని వాహనదారులు అంటున్నారు. 24 గంటల పార్కింగ్‌కు రూ.32 ఉండగా రూ.60 తీసుకుంటున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపించడంతో ఈ అక్రమాలు జరుగుతున్నాయని వాపోతున్నారు.

February 28, 2026 / 07:45 PM IST

మిషన్ భగీరథ నీటి పునరుద్ధరణ

MBNR: జడ్చర్ల మండలం బోయలకుంటలో గత నెలలో బీటీ రోడ్డు ఏర్పాటు సందర్భంగా మిషన్ భగీరథ పైప్ లైన్ ధ్వంసమయ్యింది. విషయాన్ని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించి రూ.2 లక్షలు డీఎన్ఎఫ్టీ నిధులు మంజూరు చేశారు. నూతన పైపులైన్ పనులు పూర్తి కావడంతో శనివారం సర్పంచ్ జోగు లక్ష్మమ్మ వెంకటరమణ పూజలు నిర్వహించి మిషన్ భగీరథ నీటిని పునరుద్ధరించారు.

February 28, 2026 / 07:43 PM IST

గ్రహణం సందర్భంగా రామాలయం మూసివేత

KNR: ఇల్లందకుంట(M) కేంద్రంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానాన్ని మార్చి 3, మంగళవారం చంద్ర గ్రహణం పురస్కరించుకుని మూసివేస్తున్నట్లు ఆలయ ఛైర్మన్ ఇంగిలే రామారావు, ఈఓ సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. గ్రహణ ప్రభావం దృష్ట్యా ఉదయం 7:00 గంటలకే ఆలయ ద్వారాలు మూసివేస్తామని వివరించారు. మరుసటి రోజు ఉదయం ఆలయ శుద్ధి, సంప్రోక్షణ అనంతరం 10:00 గంటలకు భక్తులకు దర్శనం ఉంటుందని తెలిపారు.

February 28, 2026 / 07:42 PM IST

కుమ్మెర మల్లన్న జాతర ఘటనపై DSP స్పందన

నాగర్ కర్నూల్: కుమ్మెర మల్లన్న జాతరలో పసిపాప మరణించిన ఘటనపై SMలో జరుగుతున్న ప్రచారాన్ని DSP బుర్రి శ్రీనివాస్ ఖండించారు. ఈ విషాద ఘటనకు కొందరు రాజకీయ రంగు పులుముతున్నారని ఆయన ఆరోపించారు. అగ్రవర్ణాల వారు పాపను తన్నడం వల్లే మరణించిందన్న వార్తల్లో నిజం లేదని, అందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే అప్పటి వరకు సంయమనం పాటించాలని కోరారు.

February 28, 2026 / 07:41 PM IST

యుద్ధం.. దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లన్నీ బంద్

దుబాయ్‌లోని విమానాశ్రయాలన్నీ మూసివేశామని, ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌కు రావొద్దని అధికారులు సూచించారు. దుబాయ్ మీదుగా ఇతరదేశాలకు వెళ్లే విమానాలపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో భారత్‌లోని పలు ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా విమానాలకు అంతరాయం కలగవచ్చని ఉందని ఢిల్లీ ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు.

February 28, 2026 / 07:41 PM IST