• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

గుడిలో హుండీ దొంగతనం చేసిన వ్యక్తి అరెస్టు

తూ.గో: గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలో సాయిబాబా గుడి హుండిని కొల్లగొట్టి సొమ్ము అపహరించినట్లు గుడి కమిటీ మెంబర్ సూర్య ప్రకాష్ 3వ తేదీన గోకవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం జరిగిందని ఎస్ఐ పవన్ కుమార్ తెలిపారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి అదే గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్‌ను అదుపులోని తీసుకుని రూ. 9వేల రికవరీ చేశామన్నారు.

February 25, 2026 / 07:15 PM IST

BREAKING: 26 మంది గ్రూప్-1 అధికారులు బదిలీ

AP: రాష్ట్రంలో 2018 గ్రూప్-1 అధికారులను మూకుమ్మడి బదిలీ చేశారు. 2018 రిక్రూట్‌మెంట్ లోపాలపై విచారణ పూర్తయ్యేవరకు అప్రాధాన్య పోస్టుల్లో ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ 26 మందిని GADకి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

February 25, 2026 / 07:13 PM IST

‘భోగాపురం ఎయిర్‌పోర్టుకు సీఎం చేసిందేమి లేదు’

AP: చంద్రబాబు భోగాపురం ఎయిర్‌పోర్టుకు చేసిందేం లేదని ఎమ్మెల్సీ సూర్యనారాయణ విమర్శించారు. ‘భూసేకరణ మొదలు.. కోర్టు కేసులు కూడా జగన్ హయాంలోనే క్లియర్ అయ్యాయి. 2,700 ఎకరాలకు 350 ఎకరాల భూసేకరణే చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి 20 నెలలు గడుస్తోంది. భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఇంకా రోడ్ల కనెక్టివిటీ లేదు. ఎయిర్ పోర్ట్ కోసం ఇంకా భూసేకరణ చేస్తున్నారా?’ అంటూ ప్రశ్నించారు.

February 25, 2026 / 07:12 PM IST

‘భోగాపురం ఎయిర్‌పోర్టుకు సీఎం చేసిందేమీ లేదు’

AP: చంద్రబాబు భోగాపురం ఎయిర్‌పోర్టుకు చేసిందేం లేదని ఎమ్మెల్సీ సూర్యనారాయణ విమర్శించారు. ‘భూసేకరణ మొదలు.. కోర్టు కేసులు కూడా జగన్ హయాంలోనే క్లియర్ అయ్యాయి. 2,700 ఎకరాలకు 350 ఎకరాల భూసేకరణే చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి 20 నెలలు గడుస్తోంది. భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఇంకా రోడ్ల కనెక్టివిటీ లేదు. ఎయిర్ పోర్ట్ కోసం ఇంకా భూసేకరణ చేస్తున్నారా?’ అంటూ ప్రశ్నించారు.

February 25, 2026 / 07:12 PM IST

యువత క్రీడల్లో రాణించాలి: ఎంపీపీ

ASR: క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని అనంతగిరి ఎంపీపీ తెడబారికి మితుల పేర్కొన్నారు. గిరిజన యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకొని, క్రీడల్లో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. బుధవారం అనంతగిరి మండలంలోని చిలకలగెడ్డ పంచాయతీ దిగువబూడి గ్రామంలో ఏర్పాటు చేసిన మెగా క్రికెట్ టోర్నమెంట్‌ను సర్పంచ్ అప్పారావుతో కలిసి ఎంపీపీ ప్రారంభించారు.

February 25, 2026 / 07:11 PM IST

బాలుడు సురక్షితంగా గుర్తింపు

TPT: ఇంటి నుంచి పారిపోయి తిరుపతికి చేరుకున్న తెలంగాణ రాష్ట్రం ఘట్కేసర్‌కు చెందిన బాలుడు లావేటి సుజిత్ కుమార్‌ను అలిపిరి చెక్ పాయింట్ వద్ద టీటీడీ భద్రతా సిబ్బంది గుర్తించారు. అతని వివరాలను సేకరించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ మేరకు బుధవారం సురక్షితంగా బాలుడిని అప్పగించారు. కుమారుడు దొరకడంతో కుటుంబ సభ్యులు టీటీడీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

February 25, 2026 / 07:11 PM IST

‘ప్రమాదకర లక్షణాలు సకాలంలో గుర్తించాలి’

PPM: గర్భిణీల్లో ప్రమాదకర లక్షణాలను ముందస్తుగా గుర్తించి సకాలంలో చికిత్స, పర్యవేక్షణ ఉండాలని DMHO డా. ఎస్. భాస్కరరావు స్పష్టం చేశారు. హైరిస్క్ గర్భిణీల ఆరోగ్య నిర్వహణ, నియమాలపై వైద్యాధికారులకు ఓరియెంటేషన్ శిక్షణను ఎన్జీఓ హోంలో బుధవారం నిర్వహించారు. ప్రభుత్వ అనుబంధ అర్మాన్ స్వచ్ఛంద సంస్థ నుండి డా. కె. విద్యాసాగర్ పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

February 25, 2026 / 07:11 PM IST

బ్లూ జెట్ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళన

AKP: సీతపాలెంలో ఏర్పాటు చేయనున్న బ్లూ జెట్ ఫార్మా కంపెనీను వ్యతిరేకిస్తూ మత్స్యకారులు బుధవారం ఆందోళన చేశారు. ఫార్మా పరిశ్రమల వల్ల వాయు,జల కాలుష్యం పెరిగి 20 వేల మంది ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే సెజ్లోని కంపెనీల వ్యర్థాలతో మత్స్య సంపద దెబ్బతిందని వాపోయారు. తక్షణమే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి శంకుస్థాపన నిలుపుదల చేయాలన్నారు.

February 25, 2026 / 07:10 PM IST

కౌశిక్ రెడ్డిపై అబద్ధపు ప్రచారం: గంగుల

TG: MLA కౌశిక్ రెడ్డిపై పోలీసులు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. సీపీ మతమార్పిడులు చేస్తున్నారని కౌశిక్ అనలేదని తెలిపారు. సీఐడీ దర్యాప్తు చేయాల్సిన అవసరమే లేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులను ప్రభుత్వం కావాలనే ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు.

February 25, 2026 / 07:08 PM IST

సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్స్ పంపిణీ

BHNG: చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ 10వ తరగతి విద్యార్థులకు సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధ‌వారం పరీక్ష ప్యాడ్లు,పెన్నులు పంపిణీ చేశారు. వార్డు కౌన్సిలర్ల చేతుల మీదుగా విద్యార్థులకు ఈ వస్తు సామగ్రిని అందించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. వార్డ్ కౌన్సిలర్ ఉదరి యాదయ్య పాల్గొన్నారు.

February 25, 2026 / 07:07 PM IST

గుంతకల్లు వాసి నాగార్జునకు అరుదైన గౌరవం

ATP: గుంతకల్లు వాసి నాగర్జున NCTE అమలు చేస్తున్న జాతీయ మెంటరింగ్ మిషన్ NMMలో మెంటర్‌గా అధికారికంగా బుధవారం ఎంపికయ్యారు. జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా ప్రారంభించిన ఈ మిషన్ లక్ష్యం దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులకు అకాడెమిక్, వృత్తిపరమైన మార్గదర్శకత్వం అందించడం కోసం రూపొందించబడింది. ఈ సందర్బంగా నాగార్జునకు పలువురు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

February 25, 2026 / 07:06 PM IST

‘మోటార్ సైకిళ్ల దొంగ దొరికాడు’

VZM: విజయనగరం 1వ, 2వ పట్టణ పోలీసు స్టేషన్ల పరిధిలో మోటారు సైకిళ్ల చోరీలకు పాల్పడిన గుమ్మడి ఆదినారాయణను అరెస్టు చేసి అతని వద్ద నుంచి 6 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ దామోదర్ బుధవారం తెలిపారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నామని, కోర్టు ఆదేశాలతో వాహనాలను బాధితులకు అప్పగిస్తామని చెప్పారు.

February 25, 2026 / 07:05 PM IST

అసెంబ్లీలో చేనేత స్టాళ్లకు భారీ స్పందన

GNTR: వెలగపూడి అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన చేనేత స్టాళ్లకు విశేష స్పందన లభిస్తోంది. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రారంభించిన ఈ స్టాళ్లను మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతిరోజూ సందర్శిస్తూ ఉత్సాహంగా వస్త్రాలను కొనుగోలు చేస్తున్నారు. బుధవారం మహిళా మంత్రులు స్టాళ్ల వద్ద సందడి చేశారు. నేతన్నల ఉత్పత్తులకు ప్రజాప్రతినిధుల నుంచి మంచి మద్దతు లభిస్తోంది.

February 25, 2026 / 07:05 PM IST

దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి.. బీజేపీ డిమాండ్​

NZB: జిల్లాలోని రుద్రూర్ బాన్సువాడ నిజామాబాద్​లో హిందువులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి కోరారు. హైదరాబాద్​లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ చందర్​రావుతో కలిసి డీజీపీ శివధర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. హిందువులపై కొందరు దుండగులు ఉద్దేశపూర్వకంగా దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

February 25, 2026 / 07:05 PM IST

మద్యం సేవించి వాహనాలు నడపవద్దు: డీజీపీ

PDPL: మద్యం సేవించి వాహనాలు నడపవద్దని పెద్దపల్లి డీజీపీ రామ్ రెడ్డి సూచించారు. సుల్తానాబాద్ మండల కేంద్రంలో బుధవారం రహదారి భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని మద్యం సేవించి వాహనాలు నడపడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. వేగ పరిమితులను పాటించాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని ఆయన సూచించారు.

February 25, 2026 / 07:05 PM IST