• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసిన ఎమ్మెల్యే

ప్రకాశం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను సచివాలయంలో మంగళవారం ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల చర్ల జనార్ధన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఒంగోలు నియోజకవర్గం మరియు ప్రకాశం జిల్లా అభివృద్ధి కోసం అవసరమైన నిధులు మంజూరు చేయాలని ఆయన వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం స్పందిస్తూ, ప్రకాశం జిల్లా అభివృద్ధికి తనవంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం.

February 24, 2026 / 08:00 PM IST

పాఠశాలను సందర్శించిన ఇస్రో సైంటిస్ట్

HNK: నడికూడ (M) చర్లపల్లి ప్రాథమిక పాఠశాలను ఇస్రో సైంటిస్ట్ అనుమాండ్ల సుకృత సందర్శించారు. సుకృత మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు పిల్లలకు చిన్నప్పటి నుంచే శాస్త్రీయ దృక్పథంతో విద్యాబోధన చేయాలని, అప్పుడే విద్యార్థులలో కొత్త ఆలోచనలు వస్తాయని, విద్యార్థుల పరిశోధనలే దేశ ప్రగతికి సోపానాలవుతాయని అన్నారు. ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.

February 24, 2026 / 07:56 PM IST

ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు

TG: రాష్ట్ర ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఉద్యోగుల ప్రమాద బీమా, ఆరోగ్య పథకాలు అమలు చేస్తామని వెల్లడించింది. మొత్తం 652 ఆస్పత్రుల్లో నగదు రహిత చికిత్సలు, 1,998 వ్యాధులకు క్యాష్ లెస్ సదుపాయం కల్పించినట్లు పేర్కొంది. దీంతో ఉద్యోగ, పెన్షనర్ సంఘాల నేతలు CM రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

February 24, 2026 / 07:56 PM IST

అతిసారం కట్టడికి కలెక్టర్ ప్రత్యేక చొరవ

శ్రీకాకుళంలోని పలు ప్రాంతాల్లో అతిసారం కేసులు నేపథ్యంలో జిల్లా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ నేతృత్వంలో వైద్య, మున్సిపల్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో ఇంటింటి సర్వే నిర్వహించారు. 24 గంటల అంబులెన్స్ సదుపాయం, ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 52 కేసులు నమోదైనట్లు తెలిపారు.

February 24, 2026 / 07:55 PM IST

విజిబుల్ పోలీసింగ్.. ప్రజల్లో చట్టాల అవగాహన

CTR: జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు, సిబ్బంది విస్తృత స్థాయిలో “విజిబుల్ పోలీసింగ్” కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని ప్రధాన కూడళ్లలో, సెంటర్లలో, మార్కెట్ ప్రాంతాల్లో, పోలీసులు ప్రజలతో మమేకమై రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం వంటి అంశాలపై ప్రత్యేకంగా సూచనలు ఇచ్చారు.

February 24, 2026 / 07:53 PM IST

HYDలో రోజుకు టన్నుల కొద్ది గార్బేజి విడుదల

HYD: జీహెచ్ఎంసీ పరిధిలో 4500 స్వచ్ఛ ఆటోలు ఇంటింటికి తిరిగి చెత్త సేకరిస్తున్నట్లుగా కమిషనర్ కర్ణన్ తెలిపారు. 18,557 మంది శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్నారని, నగరంలో రోజుకు 7,810 టన్నుల గార్బేజి విడుదలవుతున్నట్లు TG చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావుకి సమాచారం అందించారు. GHMC వ్యాప్తంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు.

February 24, 2026 / 07:50 PM IST

ఐదోసారి జతకట్టనున్న క్రేజీ కాంబో..!

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్, దర్శకుడు శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘వీరం’, ‘వేదాళం’, ‘వివేగం’, ‘విశ్వాసం’ వంటి చిత్రాలు ఘనవిజయం సాధించాయి. ఇప్పుడు ఈ సక్సెస్‌ఫుల్ కాంబో మరో ప్రాజెక్ట్‌తో రాబోతోంది. అజిత్‌తో మరో సినిమా తీయబోతున్నట్లు శివ తాజాగా ప్రకటించాడు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తానని పేర్కొన్నాడు.

February 24, 2026 / 07:49 PM IST

ఇంటర్ సెకండియర్ పరీక్ష.. ఎంత మంది గైర్హాజరు అంటే..!

KDP: ఇవాళ ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలకు 97 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. మంగళవారం జిల్లాలో 62 కేంద్రాల్లో 15,159 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా.. 14,777 మంది విద్యార్థులు హాజరయ్యారు. 382 మంది గైర్హాజరయ్యారు. ఇందులో 14,011 మంది జనరల్ విద్యార్థుల్లో 13,691 మంది హాజరవ్వగా.. 320 మంది గైర్హాజరయ్యారు.

February 24, 2026 / 07:46 PM IST

పరీక్షా సెంటర్‌ను పరిశీలించిన ఎంపీడీవో

RR: కేశంపేట మండలం కొత్తపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షల సందర్భంగా కొత్తపేటలో ఉన్న పరీక్ష కేంద్రాన్ని కేశంపేట ఎంపీడీవో రవిచంద్ర కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతున్నాయని, విద్యార్థులు ఎలాంటి గందరగోళానికి గురికాకుండా పరీక్షలు రాయాలన్నారు.

February 24, 2026 / 07:45 PM IST

‘ఒక కొత్త రంగంలో నైపుణ్యం పెంపొందించుకోవాలి’

RR: నందిగామ కన్హ శాంతి వనంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఇండియా స్కిల్ రిజనల్ కాంపిటీషన్ నేడు ముగింపుకు చేరుకుంది. ఈ కార్యక్రమానికి మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. కాంపిటీషన్‌లో గెలుపొందిన విద్యార్థులకు మెడల్స్‌తో పాటు నగదు ప్రోత్సాహం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యువత విద్యతో పాటు ఏదో ఒక కొత్త రంగంలో నైపుణ్యం పెంపొందించుకోవాలన్నారు.

February 24, 2026 / 07:44 PM IST

RUB నిర్మాణాలకు భూసేకరణ వేగవంతం చేయాలి: జేసీ

W.G: భీమవరం కలెక్టరేట్ నుంచి మంగళవారం రైల్వే కన్స్ట్రక్షన్ అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులతో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి గూగుల్ మీట్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలో అనుమతులు లభించిన నవాబ్ పాలెం (378), పత్తిపాడు (376), ఆరుగొలను (379) లెవల్ క్రాసింగ్ గేట్ల వద్ద రైల్వే అండర్ బ్రిడ్జిల (RUB) నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.

February 24, 2026 / 07:44 PM IST

టీడీపీ పార్టీకి రాజీనామా చేసిన మాజీ సర్పంచ్

KRNL: కౌతాళం మండలం కుంబలనూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బొంబాయి ముత్తన్న టీడీపీకి సభ్యత్వానికి స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్లు ఇవాళ ప్రకటించారు. పార్టీ అధిష్టానం ఉరుకుంద శ్రీ లక్ష్మీనరసింహ ఈరన్న స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

February 24, 2026 / 07:43 PM IST

విద్యుత్ అధికారులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే

JN: స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలోని విద్యుత్ సమస్యలపై ఎన్పిడిసీఎల్ సిఎండి వరుణ్ రెడ్డితో కలిసి విద్యుత్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి రివ్యూ నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలో ఎలాంటి విద్యుత్ సమస్యలు లేకుండా పటిష్ట చర్యలు తీసుకువాలని, అందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించే బాధ్యత నాదని ఎమ్మెల్యే అన్నారు.

February 24, 2026 / 07:43 PM IST

రూ.394 కోట్ల ప్రాజెక్టు సెప్టెంబర్ నాటికి పూర్తి: మంత్రి

SRPT: చింతలపాలెం మండలం దొండపాడు గ్రామంలో రూ.394 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులను మంగళవారం రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించిన మంత్రి, పనుల పురోగతి, నాణ్యత ప్రమాణాలపై అధికారులను ప్రశ్నిస్తూ పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

February 24, 2026 / 07:40 PM IST

లడ్డూ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టాలి: రామకృష్ణ

AP: అసెంబ్లీ బడ్జెట్ సెషన్ లడ్డూ సెషన్‌గా మారిందని సీపీఐ రామకృష్ణ పేర్కొన్నారు. లడ్డూ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని కోరారు. 3 లక్షల కోట్ల బడ్జెట్‌పై చర్చ లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. ప్రజా సమస్యలు పక్కనపెట్టి రాజకీయ చర్చ చేపట్టారని విమర్శించారు. లడ్డూ కల్తీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

February 24, 2026 / 07:40 PM IST