• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రామ మందిరం నిర్మాణానికి విరాళం అందజేత

VZM: మెరకముడిదాం మండలం సిరియాలపేట గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న రామ మందిరం నిర్మాణం కోసం విరాళంగా రూ.10,5000, 2 బియ్యం బస్తాలు వైసీపీ జిల్లా బూత్ కన్వీనర్ అధ్యక్షులు బూర్లె నరేష్ కుమార్ ఆదివారం అందించారు. ఈ నెల 6, 7, 8వ తేదీలో రామాలయం ప్రతిష్ట జరుగుతుందని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలియజేశారు. ఈమేరకు గ్రామ ప్రజలు, యువత హర్షం వ్యక్తపరిచారు.

March 1, 2026 / 02:13 PM IST

జిల్లాస్థాయి స్కేటింగ్ పోటీలు ప్రారంభం

SKLM: పలాసలో గోపీచంద్ రోలర్ స్కేటింగ్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి స్కేటింగ్ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్రీడల ద్వారా విద్యార్థుల్లో శారీరక పెరుగుదల, ఏకగ్రత శక్తి పెరుగుతుందని అన్నారు.

March 1, 2026 / 02:12 PM IST

కేజీహెచ్‌లో తాగునీటి సంక్షోభం

VSP: ఎండలు తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో విశాఖ కింగ్‌జార్జ్ ఆస్పత్రిలో తాగునీటి సమస్య ఉధృతమైంది. రోజూ వేలాది మంది రోగులు, సహాయకులు వచ్చే ఈ ఆస్పత్రిలో తాగడానికి నీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పలు విభాగాల్లో వాటర్ ప్లాంట్లు పనిచేయకపోవడంతో బయట దుకాణాల్లో అధిక ధరలకు నీటి బాటిళ్లు కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది.

March 1, 2026 / 02:12 PM IST

మార్చి 2.. చిత్రాల నుంచి క్రేజీ అప్‌డేట్స్

* సూర్య ‘సూర్య 46’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ కాబోతుంది.* యష్ ‘టాక్సిక్’ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల అవుతుంది.* నాని ‘ది ప్యారడైజ్’ ఫస్ట్ సింగిల్ హిందీ, తమిళ వెర్షన్ రిలీజ్..?* రామ్ చరణ్ ‘పెద్ది’ సెకండ్ సింగిల్ రాబోతుంది.

March 1, 2026 / 02:12 PM IST

వార్షిక మహోత్సవానికి విచ్చేయాలని ఆహ్వానం

NLG: నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను చిట్యాల శ్రీ కనకదుర్గ ఆలయ కమిటీ ఛైర్మన్ మారగోని ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 4న జరిగే దేవస్థానం 23వ వార్షిక మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి, ఉత్సవాలను ప్రారంభించాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేసి, కరపత్రాలను ఎమ్మెల్యేతో ఆవిష్కరింపజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు పాల్గొన్నారు.

March 1, 2026 / 02:11 PM IST

రూ. 500 కొత్త నోటును చూస్తే హడల్

MNCL: లక్షెట్టిపేట పట్టణంలోని వ్యాపారులు, ప్రజలు రూ.500 కొత్త నోట్లను చూస్తే హడలిపోతున్నారు. పట్టణంలో ఇటీవల రూ. 500 నకిలీ నోటు చలామణి కావడం సంచలనంగా మారిన విషయం తెలిసింది. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు నకిలీ నోట్లను చలామణి చేసిన అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేశారు. వ్యాపారులలో భయం పోలేదు. తమ దుకాణాలకు వస్తున్న రూ. 500 నోట్లను పరిశీలించి తీసుకుంటున్నారు.

March 1, 2026 / 02:10 PM IST

నిబంధనలు పాటించని దుకాణాల లైసెన్సులు రద్దు: ప్రకాష్

ATP: నగరంలో మాంసం విక్రయ కేంద్రాలను తనిఖీ చేసిన ఏపీ మీట్ కార్పొరేషన్ ఛైర్మన్ ప్రకాష్ నాయుడు విక్రేతలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో మాంసం విక్రయిస్తున్నట్లు గుర్తించిన పలు దుకాణాలకు జరిమానాలు విధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ కుళ్ళిన మాంసం లేదా చనిపోయిన కోళ్లను విక్రయిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని స్పష్టం చేశారు.

March 1, 2026 / 02:08 PM IST

సీతారాముల కళ్యాణ ఉత్సవ కమిటీ ఎన్నిక

KNR: హుజురాబాద్ మండలం బోర్నపల్లి హనుమాన్ దేవాలయంలో శ్రీసీతారాముల కళ్యాణ ఉత్సవ నూతన కమిటీ ఎన్నిక నిర్వహించారు. గ్రామస్తులు, భక్తుల సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మసాడి సంపత్ రావు, ఉపాధ్యక్షులుగా పిల్లి గణేశ్, సంపత్ ప్రధాన కార్యవర్గ సభ్యులుగా జూపక శ్రీనివాస్‌ను సభ్యులు ఎన్నుకున్నారు.

March 1, 2026 / 02:08 PM IST

ఆత్మరక్షణకు కరాటే అవసరం: సర్పంచ్

BDK: భద్రాచలం గిరిజన బాలికల స్కూల్ లో సుమన్ షోటోకాం స్పోర్ట్స్ కరాటే – డో అకాడమీ ఆఫ్ ఇండియా కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పూనెం కృష్ణ పాల్గొని మాట్లాడుతూ.. యువతి యువకులు క్రీడల పట్ల ఆసక్తి కలిగి ఉండాలన్నారు. అలాగే ఆత్మ రక్షణకు కరాటే అవసరం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

March 1, 2026 / 02:08 PM IST

మంత్రి చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందజేత

E.G: సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన దుర్ఘటనలో దర్శిపాటి నాని, ఏడిద సంపత్ కుమార్, గంపల మంగ, గంపల నాగరాజు, మందపల్లి చిన్ని, గొడత మహేష్, గొడత వీరవెంకట రమణ, కడింపల్లి ధనరాజు ప్రాణాలు కోల్పోయారు. ఈ సందర్భంగా నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ ఆదివారం సంఘటనా స్థలాన్ని పర్యవేక్షించి రూ.20 లక్షల చెక్కును అందజేశారు.

March 1, 2026 / 02:07 PM IST

కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్ వద్ద రైతుల ఆందోళన

KDP: లింగాల మండలంలోని బియాండ్ తాతిరెడ్డిపల్లె ఎత్తిపోత పథకం ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఆదివారం రైతులు ఆందోళన చేశారు. వారు మాట్లాడుతూ.. ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ట్రాన్స్‌ఫార్మర్ తెప్పించినా, కనెక్షన్ ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. రైతుల విషయంలో రాజకీయాలకు తావులేకుండా అధికారులు వ్యవహరించాలన్నారు. విద్యుత్ అధికారులు కనెక్షన్ ఇవ్వకపోతే ధర్నా చేస్తామన్నారు.

March 1, 2026 / 02:07 PM IST

హోలీ రోజే చంద్రగ్రహణం.. బ్రాహ్మణ సంఘం ప్రకటన

VKB: రాబోయే హోలీ పండుగ, చంద్రగ్రహణ సమయాలపై వికారాబాద్ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు జ్యోషి సుభాశ్ చంద్రకాంత్ శర్మ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ విద్వత్ సభ నిర్ణయించిన ప్రమాణాల మేరకు మార్చి 2న కామదహనం, మార్చి 3న హోలీ జరుపుకోవాలని సూచించారు. అదేరోజు మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రం 6:47 వరకు చంద్రగ్రహణం ఉంటుందని తెలిపారు.

March 1, 2026 / 02:07 PM IST

ఆదివాసీల సమస్యలపై మంత్రికి వినతి

ADB: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును టీపీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర వైస్ ఛైర్మన్ సెడ్మకి ఆనంద్ రావు ఆదివారం సచివాలయంలో కలిశారు. ఐటీడీఏల ద్వారా ఆదివాసీలకు ఇందిరమ్మ ఇళ్లు, ఇతర సంక్షేమ పథకాలు మంజూరు చేయాలని కోరారు. ఈ విన్నపాలపై మంత్రి సానుకూలంగా స్పందించారని ఆనంద్ రావు తెలిపారు.

March 1, 2026 / 02:05 PM IST

మున్సిపల్ వైస్ ఛైర్మన్‌కు ఘన సన్మానం

NRML: నిర్మల్ మున్సిపల్ నూతన వైస్ ఛైర్మన్ అప్పల గణేష్‌ను 1993–1996 B.Sc, BZC బ్యాచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మిత్రబృందం ఆదివారం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ఆయన ఇంకా ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో TRSMA నిర్మల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, కంకేట మాజీ సర్పంచ్ శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.

March 1, 2026 / 02:05 PM IST

CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త

NDL: ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన CMRF చెక్కులు ఎమ్మెల్యే గిత్త జయసూర్య పంపిణీ చేశారు. జూపాడు బంగ్లా మండలం, మండ్లెం గ్రామానికి చెందిన షేక్ ఫరీదాబికి రూ.79,670 విలువైన చెక్కు ఎమ్మెల్యే ఆదివారం అందజేశారు. ఈ మేరకు CM మంద్రబాబు, MLAకు ఫరీదా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

March 1, 2026 / 02:04 PM IST