NRPT: నర్వ మండలంలోని లక్కర్ దొడ్డి-కొత్తపల్లి రహదారి కంకర తేలి అధ్వానంగా మారింది. ఏళ్లుగా బీటీ రోడ్డు పనులు జరగకపోవడంతో ప్రయాణికులు, ముఖ్యంగా అత్యవసర సందర్భంలో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ అధికారులు స్పందించి రహదారిని సురక్షితంగా మార్చాలని గ్రామస్థులు ఆశిస్తున్నారు.
అన్నమయ్య: ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన ప్రిన్సిపాల్‌గా (FAC) స్మిత సోమవారం బాధ్యతలు స్వీకరించారు.సీసీఈ ఆదేశాల మేరకు సుధాకర్ రెడ్డి అధికారికంగా బాధ్యతలు అప్పగించారు. అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు.కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని స్మిత తెలిపారు. త్వరలోనే విద్యార్థులతో సమావేశం నిర్వహించి సమస్యలు తెలుసుకుంటానని పేర్కొన్నారు.
కృష్ణా: మచిలీపట్నం సర్వజన ఆస్పత్రి ప్రాంగణంలో దాతల సహకారంతో నిర్మించిన విశ్రాంతి భవనాలను తిరిగి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శేకుబోయిన సుబ్రమణ్యం సోమవారం జాయింట్ కలెక్టర్ నవీన్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో గోవిందు, భోగి రెడ్డి, సుభాని, కోటేశ్వరరావు, పవన్ తదితరులు పాల్గొన్నారు.
ఇరాన్-అమెరికా యుద్ధంతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు భగ్గుమన్నాయి. ముడి చమురు ధర 80 డాలర్ల పైనే ట్రేడ్ అవుతోంది. దీంతో దేశీయంగా చమురు రంగ షేర్లు పతనమయ్యాయి. ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ 5 శాతం మేర కుంగింది. మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్ వంటి షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు హర్ముజ్ జలసంధిలో నౌకల రవాణాను ఇరాన్ అడ్డుకోవడంతో ధరలు 10 శాతం మేర పెరిగాయి.
ASR: గుర్తేడు మండలం వేజువాడ గ్రామానికి చెందిన పాపాయమ్మ అంబులెన్సులో ప్రసవించింది. అంబులెన్సులో రంపచోడవరం ఆసుపత్రికి ఆమెను తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు అధికం అయ్యాయి. దీంతో వైద్య సిబ్బంది ఆమెకు పురుడుపోయగా మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని, వైద్య పరీక్షలు నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించామని సిబ్బంది తెలిపారు.
MLG: వెంకటాపూర్ మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ప్రభుత్వం ఈ నెల 10 తేదీ వరకు పొడిగించినట్లు HM కృష్ణ తెలిపారు. 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అర్హత గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
NLG: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈరోజు సాయంత్రం 3 గంటలకు సాగర్‌లోని బుద్ధవనాన్ని సందర్శించనున్నారు. ఆయనతో పాటు మంత్రులు కోమటిరెడ్డి, వివేక్ వెంకటస్వామి రానున్నారు. ఎంపీ రఘువీర్, ఎమ్మెల్యే జైవీర్ వారికి స్వాగతం పలకనున్నారు. ఖర్గే రాక నేపథ్యంలో బుద్ధవనం అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.
ASF: ఆసిఫాబాద్ మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ సోమవారం అధికారికంగా తమ పదవీ బాధ్యతలను స్వీకరించారు. MLA కోవ లక్ష్మి సమక్షంలో, మున్సిపల్ కమిషనర్ గజానంద్ పర్యవేక్షణలో కార్యక్రమం జరిగింది. నూతన బాధ్యతలు చేపట్టిన వారికి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
PPM: మన్యం పట్టణంలో ప్రైవేట్ లాడ్జీలలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులపై దృష్టి సారించిన పట్టణ పోలీసులు ఒక లాడ్జిలో గంజాయి నిల్వఉంచినట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల సందర్భంగా గంజాయి వినియోగం, అక్రమ రవాణాపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.
ADB: ఇచ్చోడ 108 అంబులెన్స్ వాహనాన్ని జిల్లా కో-ఆర్డినేటర్ శేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనంలోని ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు, బీపీ ఆపరేటర్స్ వంటి అత్యవసర వైద్య పరికరాల పనితీరును ఆయన పరిశీలించారు. మందుల నిల్వలు, రికార్డులను తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అత్యవసర సమయాల్లో బాధితులకు సకాలంలో నాణ్యమైన సేవలు అందించాలన్నారు.
MBNR: మన్యంకొండ శ్రీ అలివేలు మంగమ్మ ఆలయ బ్రహ్మోత్సవాలు సోమవారం ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. వేద మంత్రోచ్ఛారణల మధ్య ధ్వజపతాకాన్ని ఆవిష్కరించారు. ఆలయ ధర్మకర్త అలహరి మధుసూదన్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
VZM: భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల, ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలంటూ ఏపీ లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి జిల్లా కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డిని కోరారు. సోమవారం జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద కార్మికుల, ఉద్యోగులతో కలిసి తమ నిరసన వ్యక్తం చేసి కలెక్టర్‌కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నేతలు ఉంగరాల శ్రీను, కనకరాజు పాల్గొన్నారు.
JGL: ఇరాన్, ఇజ్రాయిల్ అమెరికా సంయుక్త రాష్ట్రాలు నిర్వహిస్తున్న దాడుల నేపథ్యంలో, అక్కడ ఉన్న భారతీయులు అధైర్యపడవద్దని మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ధర్మపురిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.జిల్లా నుంచి ఉపాధి నిమిత్తం ఇరాన్కు వెళ్లిన పలువురి భద్రతపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని తెలిపారు.
ప్రకాశం: కనిగిరి అమరావతి గ్రౌండ్స్‌లో హనుమంతునిపాడు మండలం టీడీపీ పార్టీ నాయకుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పార్టీ బలోపేతం, ప్రభుత్వ పథకాల అమలు, మండల స్థాయి సమస్యల పరిష్కారంపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ అభివృద్ధి కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు.
WGL: “వనం వీడి జనంలోకి” కార్యక్రమంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో మావోయిస్టు పార్టీలో కీలక పాత్ర పోషించిన వారితో ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయిన విషయం తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో రాజకీయంగా ఆరంగేట్రం చేయాలని వారికి సూచనలు చేశారని సమాచారం. ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.